Low Investment Business Idea : ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాల్లో చాలా ప్రెజర్ తీసుకుంటున్నారు. టార్గెట్లు, క్లైంట్స్, ప్రాజెక్ట్స్ అంటూ ఎన్నో రకాల ఒత్తిడిలు ఎదుర్కొంటున్నారు. జాబ్ మానేయాలని ఉన్నా.. సరైనా ఆదాయం లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతో తప్పక ఉద్యోగం చేస్తారు. అలాగే కొందరికి వ్యాపారం చేయాలని ఉన్నా.. ఫండ్స్ లేవని బాధపడుతూ.. జాబ్స్ చేస్తారు. కానీ సరైన ప్లానింగ్ ఉంటే, ప్రణాళికతో పాటు కష్టపడే తత్వం ఉంటే.. కేవలం 5 వేలల్లో కూడా బిజినెస్ ప్రారంభించవచ్చు. 

Continues below advertisement

సోషల్ మీడియా రీచ్ పెరుగుతున్న సమయంలో చాలామంది జాబ్స్ వదిలేసి.. తమకి నచ్చిన పనులు చేసుకుంటూ.. బిజినెస్లు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. కానీ దానికోసం ధైర్యంగా ఓ చిన్న అడుగు వేయాలి. డబ్బులు లేవనుకునేవారు.. 5 వేల రూపాయలతో కూడా లాభదాయకమైన వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం. సరైన దిశలో స్టార్ట్ చేస్తే చిన్న వ్యాపారం కూడా పెద్ద బిజినెస్గా మారుతుంది.

మినీ ఫుడ్ సర్వీస్..

కేవలం 5 వేల రూపాయలతో ఇంటి నుంచే మినీ ఫుడ్ సర్వీస్‌ను ప్రారంభించవచ్చు. తాజా స్నాక్స్, తేలికపాటి భోజనాలను ప్రిపేర్ చేసి.. స్థానికంగా ఉండేవారికి డెలివరీ చేయవచ్చు. ఆఫీస్​కి వెళ్లేవాళ్లు, విద్యార్థులు, సింగిల్ కస్టమర్‌లు ఇలాంటి ఎంపికల కోసం ఎక్కువగా వెతుకుతున్నారు. కాబట్టి ఈ మినీ ఫుడ్ సర్వీస్​కి మంచి డిమాండ్ ఉంది. మంచి నాణ్యతను మెయింటైన్ చేస్తే రీచ్ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ పదార్థాలతో కాకుండా తక్కువ మెనూతో ఈ వ్యాపారం ప్రారంభించండి.

Continues below advertisement

ఇలా ప్రమోట్ చేసుకోండి..

మీ ప్రారంభ బడ్జెట్‌ను ముడి పదార్థాలు, ప్యాకింగ్ సామాగ్రి, వంటగదులలో పెట్టుబడి పెట్టండి. ప్రమోషన్ కోసం సోషల్ మీడియా, స్థానిక సమూహాలు, సమీపంలోని గ్రూప్స్​ని అప్రోచ్ అవ్వండి. నమ్మకాన్ని పెంచుకోవడానికి మొదటి కొన్ని ఆర్డర్‌లను తక్కువ మార్జిన్‌తో పూర్తి చేయండి. కస్టమర్‌లు సంతృప్తి చెందితే చాలు మౌత్ పబ్లిసిటీ అదే పెరుగుతుంది. ఎందుకంటే ఈరోజుల్లో ఫుడ్​కి మించిన బిజినెస్​ మరొకటి లేదు. 

ఎలాంటి ఫుడ్స్ చేయవచ్చంటే..

మొదట్లో మీ స్టైల్ అభిరుచి, సమయపాలన పాటిస్తే చాలు. కొన్ని రోజుల్లోనే రెగ్యులర్ ఆర్డర్లు రావడం ప్రారంభమవుతాయి. మీరు మీ వంటతో కస్టమర్​కి మంచి అనుభవం ఇస్తేనే మళ్లీ ఆర్డర్లు వస్తాయని గుర్తించుకోవాలి. చక్కని ప్యాకేజింగ్, డెలివరీ టైమింగ్స్, రిసీవింగ్, కస్టమర్​తో మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తే వ్యాపారం త్వరగా వృద్ధి చెందుతుంది. 

పోహా, ఉప్మా, పరాఠా, ఇడ్లీ, శాండ్‌విచ్‌లు లేదా తేలికపాటి స్నాక్స్ వంటి తక్కువ ధరకు అందుబాటులో ఉండేవాటిని మెనూలో చేర్చండి. ఇవి తక్కువ ధరతో తయారు చేయవచ్చు. డిమాండ్ పెరిగేకొద్దీ కొత్త ఐటమ్స్ చేర్చుకోవచ్చు. కానీ నాణ్యత విషయంలో రాజీ పడకండి. కస్టమర్

రివ్యూలను ఫాలో అవ్వండి. 

ఆర్డర్ నిర్వహణ కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించండి. UPI ద్వారా చెల్లింపులను అంగీకరించండి. ఆర్డర్‌లు పెరిగేకొద్దీ.. మీ పనిపై ప్రెజర్ లేకుండా హెల్పర్స్​ని పెట్టుకోవచ్చు. ఇలా చిన్న పెట్టుబడితో వారంలోనే మంచి లాభాలు చూడగలుగుతారు.