Spicy Garlic Egg Fried Rice Recipe : గుడ్డు, వెల్లుల్లి ఫ్లేవర్ అంటే ఇష్టమా? అయితే మీరు తప్పకుండా స్పైసీ గార్లిక్ ఎగ్​ ఫ్రైడ్ రైస్ ట్రై చేయవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెగ్యులర్​గా తీసుకునేదే కానీ.. కాస్త కారంగా, వెల్లుల్లి ఫ్లేవర్​తో కావాలనుకుంటే మాత్రం ఈ టేస్టీ రెసిపీని పక్కా ట్రై చేయవచ్చు. దీనిని చేయడానికి పెద్దగా ఇతర పదార్థాలు అవసరం లేదు. చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్​ కూడా ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీ ఇక్కడుంది. మరి దీనిని తయారు చేయడానికి ఏ పదార్థాలు కావాలో.. ఎలా దీనిని చేసుకోవాలో చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

  • వెల్లుల్లి - 20
  • ఎండుమిర్చి - 10
  • ఉల్లిపాయలు - 1 పెద్దది
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • గుడ్లు - 3
  • ఉప్పు - రుచికి తగినంత
  • కొత్తిమీర - 1 స్పూన్ తురుము

తయారీ విధానం

ముందుగా ఎండుమిర్చిని అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన ఎండుమిర్చిని.. తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటే మంచిది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. కడాయిలో నూనె వేసి.. ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్​గా మారేవరకు మాడకుండా వేయుంచుకోవాలి. 

ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఈ పేస్ట్​ పక్కకి జరిపి.. గుడ్లు పగలగొట్టి వేయాలి. కొద్దిగా కొద్దిగా మిక్స్ చేస్తూ ఎగ్ ఉడకనివ్వాలి. ఇలా రెండూ బాగా మిక్స్ అయి ఉడుకుతున్న సమయంలో అన్నం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.  

అన్నం, ఎగ్స్ మిక్స్ బాగా కలిస్తే చాలు. వేడి వేడి స్పైసీ గార్లిక్ ఎగ్ రైస్ రెడీ. దీనిని చాలా సింపుల్​గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్​లకు కూడా ఇది మంచి ఆప్షన్. టైమ్ లేదన్నప్పుడు చేసుకోవడానికి ఇది పర్​ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. మరి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తప్పక ట్రై చేసేయండి.