Smartwatch Buying Guide for Beginners : స్మార్ట్‌వాచ్ కొత్తది కొనాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని రీసెట్ చేసుకోవడం నుంచి.. AI బేస్డ్, డిస్ప్లే, కావాల్సిన ఫీచర్లు ఉండేలా చూసుకోవాలి. ఈ ఫీచర్లు మీరు చెక్ చేసుకోకుండా వాచ్ తీసుకుంటే.. కొద్ది రోజుల్లోనే మీరు రిగ్రెేట్ అవ్వాల్సి వస్తుంది. అందుకే స్మార్ట్‌వాచ్ కొనేప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యమని చెప్తున్నారు టెక్ నిపుణులు.
చాలా కాలంగా స్ట్మార్ట్ వాచ్ కేవలం ఫిట్‌నెస్ ప్రియులు మాత్రమే కాకుండా.. ఇతరులు కూడా ఈ గాడ్జెట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడం నుంచి.. హార్ట్ బీట్ రేటు, స్టెప్ కౌంట్ వంటి వాటిని ఈ వాచ్‌లు సులభతరం చేశాయి. అంతేకాకుండా.. తరచుగా ఫోన్‌ను బయటకు తీసి చూడాల్సిన అవసరం లేకుండా.. అనేక ఫోన్ ఫీచర్లతో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఈ బెనిఫిట్స్ కోసం మీరు కొత్త స్మార్ట్ వాచ్ తీసుకోవాలనుకుంటే.. ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
బ్యాటరీ లైఫ్..
స్మార్ట్ వాచ్ కొనేప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా పరిగణించాల్సిన అంశం బ్యాటరీ లైఫ్. స్మార్ట్‌వాచ్‌లో బ్యాటరీ ఎంత పెద్దదిగా ఉంటే.. అది అంత ఎక్కువ సేపు పనిచేస్తుంది. దీనివల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే.. మీరు దాన్ని ప్రతీసారి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే అది పవర్ అవుట్‌లెట్‌కు కనెక్ట్ చేసి ఉండే సమయం కన్నా మీ మణికట్టు మీదే ఎక్కువగా ఉంటుంది. మీరు ఇతర ఫీచర్ల కోసం బ్యాటరీ లైఫ్ విషయంలో రాజీ పడితే.. ఛార్జింగ్ లేక ఇబ్బంది పడొచ్చు.
డిస్ప్లే రకం
మార్కెట్లో మీకు LCD, AMOLED డిస్ప్లేలతో కూడిన స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు బయట కూడా వాచ్ ఉపయోగించాలనుకుంటే.. AMOLED వేరియంట్‌ను ఎంచుకోండి. ఇది ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిని ఇండోర్లో ఎక్కువగా ఉండేవారు LCD డిస్ప్లేను ఎంచుకోవచ్చు.
హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్
మీరు మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, హెల్తీగా ఉండేందుకు స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేస్తుంటే.. దాని ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్లను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. నేటి స్మార్ట్‌వాచ్‌లు మీ హార్ట్ బీట్ నుంచి.. నిద్ర, నీటి వినియోగం వరకు ప్రతిదీ పర్యవేక్షించే అధునాతన సెన్సార్లతో అందుబాటులో ఉంటున్నాయి.
కనెక్టివిటీ ఫీచర్లు
మార్కెట్‌లోని దాదాపు అన్ని స్మార్ట్‌వాచ్‌లు బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తాయి. కానీ మీరు మీ ఫోన్‌పై ఆధారపడకుండా వాటిని ఉపయోగించాలనుకుంటే.. eSIM సపోర్ట్ ఉన్న స్మార్ట్‌వాచ్‌ను ఎంచుకోండి. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లోని అనేక ఫీచర్లను మీ వాచ్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మీకు అనుమతిస్తుంది.
సైజ్..
మీరు మీ స్మార్ట్‌వాచ్‌ను ప్రతిరోజూ ఎక్కువసేపు ఉపయోగించాలని అనుకుంటే.. దాని పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. పెద్ద స్మార్ట్‌వాచ్‌ను ఎంచుకోవడం వల్ల దానిని ఉపయోగించడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. అందువల్ల.. మీ మణికట్టుకు సరిపోయే సైజ్ ఎంచుకోవాలి.
మన్నిక
మీరు బహిరంగ కార్యకలాపాల కోసం స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేస్తుంటే.. అది ఎక్కువకాలం మన్నికగా ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక వాచ్ మన్నికను నిర్ధారించడంలో IP రేటింగ్‌లు బాగా హెల్ప్ అవుతాయి.
