Long Weekends and Holidays in 2026 : ఉద్యోగులు, స్టూడెంట్స్ కామన్‌గా కోరుకునేవి సెలవులు. పిల్లలు గేమ్స్ ఆడుకుందామని, పెద్దలు రెస్ట్ తీసుకుందామని లేదా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దామని చూస్తారు. లేదా ట్రిప్స్‌కి వెళ్లాలనుకుంటారు. అలాంటివారికి లాంగ్ వీకెండ్స్ అనువైనవి. అయితే 2026లో అలాంటి లాంగ్ వీకెండ్స్ ఎప్పుడు వచ్చాయో.. పండుగలు, జాతీయ సెలవులు వంటివి ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు చూసేద్దాం. వాటిలో మీకు అనువైన సమయం బట్టి ట్రిప్స్ లేదా ఇతర ప్లాన్స్ వేసుకోవచ్చు. 2026లో లాంగ్ వీకెండ్ నుంచి సెలవులతో సహా నెలలవారీగా అన్ని ఇక్కడ ఉన్నాయి.
జనవరి 2026
జనవరి 1-4
- జనవరి 1 (గురువారం): నూతన సంవత్సరం
- జనవరి 2 (శుక్రవారం): సెలవు తీసుకుంటే..
- జనవరి 3-4 (శనివారం-ఆదివారం): వారాంతం
(Image Source: ABPLIVE AI)
జనవరి 23-26
- జనవరి 23 (శుక్రవారం): వసంత పంచమి
- జనవరి 24-25 (శనివారం-ఆదివారం): వారాంతం
- జనవరి 26 (సోమవారం): రిపబ్లిక్ డే
ఫిబ్రవరి 2026
- ఫిబ్రవరి 15: మహాశివరాత్రి
- ఫిబ్రవరి 28 (శనివారం): హోలీ బ్రేక్ తీసుకోగలిగే వీకెండ్
మార్చి 2026
మార్చి 1-3
(Image Source: ABPLIVE AI)
- మార్చి 1: ఆదివారం
- మార్చి 2 (సోమవారం): సెలవు తీసుకోండి
- మార్చి 3 (మంగళవారం): హోలీ
మార్చి 20-22
- మార్చి 20 (శుక్రవారం): ఈద్-అల్-ఫితర్
- మార్చి 21-22 (శనివారం-ఆదివారం): వారాంతం
మార్చి 26-31
- మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి
- మార్చి 27 (శుక్రవారం): సెలవు తీసుకోండి
- మార్చి 28-29 (శనివారం-ఆదివారం): వారాంతం
- మార్చి 30 (సోమవారం): సెలవు తీసుకోండి
- మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి
ఏప్రిల్ 2026
ఏప్రిల్ 3–5
- ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 4-5 (శనివారం-ఆదివారం): వారాంతం
మే 2026
మే 1–3
- మే 1 (శుక్రవారం): బుద్ధ పూర్ణిమ
- మే 2-3 (శనివారం-ఆదివారం): వారాంతం
జూన్ 2026
జూన్ 26–29
(Image Source: ABPLIVE AI)
జూన్ 26 (శుక్రవారం): మొహర్రం
జూన్ 27-28 (శనివారం-ఆదివారం): వారాంతం
జూన్ 29 (సోమవారం): సెలవు తీసుకోండి
జూలై 2026
జూలై 16–19
- జూలై 16 (గురువారం): రథయాత్ర
- జూలై 17 (శుక్రవారం): సెలవు తీసుకోండి
- జూలై 18–19 (శనివారం–ఆదివారం): వారాంతం
ఆగస్టు 2026
ఆగస్టు 25-30
(Image Source: ABPLIVE AI)
- ఆగస్టు 25 (మంగళవారం): మిలాద్-ఉన్-నబీ
- ఆగస్టు 26 (బుధవారం): ఓనం
- ఆగస్టు 27 (గురువారం): సెలవు తీసుకోండి
- ఆగస్టు 28 (శుక్రవారం): రాఖీ పౌర్ణమి
- ఆగస్టు 29–30 (శనివారం–ఆదివారం): వారాంతం
సెప్టెంబర్ 2026
సెప్టెంబర్ 4-6
- సెప్టెంబర్ 4 (శుక్రవారం): జన్మాష్టమి
- సెప్టెంబర్ 5–6 (శనివారం–ఆదివారం): వారాంతం
సెప్టెంబర్ 12–14
- సెప్టెంబర్ 12–13 (శనివారం–ఆదివారం): వారాంతం
- సెప్టెంబర్ 14 (సోమవారం): వినాయక చవితి
అక్టోబర్ 2026
అక్టోబర్ 2–4
- అక్టోబర్ 2 (శుక్రవారం): గాంధీ జయంతి
- అక్టోబర్ 3–4 (శనివారం–ఆదివారం): వారాంతం
అక్టోబర్ 17–20
- అక్టోబర్ 17–18 (శనివారం–ఆదివారం): వారాంతం
- అక్టోబర్ 19 (సోమవారం): సెలవు తీసుకోండి
- అక్టోబర్ 20 (మంగళవారం): దసరా
నవంబర్ 2026
నవంబర్ 2-4
- నవంబర్ 8 (ఆదివారం): దీపావళి
- నవంబర్ 9 (సోమవారం): గోవర్ధన్ పూజ
- నవంబర్ 10 (మంగళవారం): సెలవు తీసుకోండి
- నవంబర్ 11 (బుధవారం): భాయ్ దూజ్
నవంబర్ 21–24
- నవంబర్ 21–22 (శనివారం–ఆదివారం): వారాంతం
- నవంబర్ 23 (సోమవారం): సెలవు తీసుకోండి
- నవంబర్ 24 (మంగళవారం): గురునానక్ జయంతి
డిసెంబర్ 2026
డిసెంబర్ 25–27
(Image Source: ABPLIVE AI)
- డిసెంబర్ 25 (శుక్రవారం): క్రిస్మస్
- డిసెంబర్ 26–27 (శనివారం–ఆదివారం): వారాంతం
కొన్ని సెలవు దినాలను తెలివిగా ఉపయోగించుకుంటే.. 2026లో మీకు 50+ రోజుల పాటు సెలవులు లభించే అవకాశం ఉంది. ఇది ఇటీవలి సంవత్సరాలలో ప్రయాణానికి అత్యంత అనుకూలమైన క్యాలెండర్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ముందుగానే సెలవులు తెలిశాయి కాబట్టి వాటికి అనువుగా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా టికెట్స్ బుక్ చేసుకుంటే తక్కువ ఖర్చులో అన్ని దొరుకుతాయి.