AC Maintenance Tips : వాతావరణం నెమ్మదిగా మారుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు మళ్లీ విరామం లేకుండా పనిచేయనున్నాయి. కానీ నెలల తరబడి వాడని ACని ఒక్కసారిగా ఆన్ చేయడం సరైన పద్ధతి కాదని చెప్తున్నారు నిపుణులు. దుమ్ము, తేమ, పేరుకుపోయిన ధూళి ఇవన్నీ యంత్రం పనితీరును దెబ్బతీస్తాయి. అలాగే ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. అందుకే సీజన్ ప్రారంభానికి ముందు సర్వీసింగ్ చేయించడం అవసరమని చెప్తున్నారు.

Continues below advertisement

ముందుగానే పూర్తి సర్వీసింగ్

ఏసీని చాలా కాలం ఉపయోగించకపోతే ఫిల్టర్లు, కాయిల్స్, అవుట్‌డోర్ యూనిట్‌పై దుమ్ము పేరుకుపోతుంది. దీంతో శీతలీకరణ తగ్గి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సాధ్యమైతే మీరు క్లీనింగ్ చేసుకోవచ్చు. కానీ పూర్తిస్థాయి తనిఖీ కోసం టెక్నీషియన్‌కి చూపించడం మంచిది.

ఫిల్టర్ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ

మురికి, దుమ్ము.. ఫిల్టర్ గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో ACపై అదనపు ఒత్తిడి పడుతుంది. క్రమం తప్పకుండా ఫిల్టర్ శుభ్రం చేస్తే యంత్రం ఆయుష్షు పెరుగుతుంది. విద్యుత్ బిల్లు కూడా నియంత్రణలో ఉంటుంది.

Continues below advertisement

లీకేజీలను చెక్ చేయించుకోండి

స్ప్లిట్ ACలో డ్రెయిన్ పైపు బ్లాక్ అయితే నీరు కారుతుంది. గ్యాస్ లీకేజీ ఉంటే శీతలీకరణ తగ్గిపోతుంది. కాబట్టి పైపులు, కనెక్షన్లు సరిగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేయాలి.

వైరింగ్ & స్టెబిలైజర్ 

ACలు అధిక విద్యుత్ వినియోగించే పరికరాలు. దీనివల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులు యంత్రాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వైర్లు వదులుగా ఉన్నాయా? స్టెబిలైజర్ సరిగా పనిచేస్తుందా? అనేవి చెక్ చేసుకోవాలి. ఇది షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మొదటిసారి స్టార్ట్ చేసేప్పుడు

సీజన్‌లో మొదటిసారి AC ఆన్ చేస్తే వెంటనే కూల్ మోడ్‌లో పెట్టవద్దు. ముందుగా కొన్ని నిమిషాలు ఫ్యాన్ మోడ్‌లో ఉంచాలి. ఇది పేరుకుపోయిన దుమ్ము, తేమను తొలగిస్తుంది. తర్వాత కూల్ మోడ్‌కి మార్చండి.

చిన్న జాగ్రత్తలు… భారీ సేవింగ్స్

సకాలంలో సర్వీస్ చేయించుకోవడం వల్ల భారీ మరమ్మతులు అవసరం ఉండదు. మెరుగైన శీతలీకరణతో పాటు.. విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది. ఏసీ ఎక్కువకాలం పనిచేస్తుంది.

ోఎ