Beauty Tips : కొబ్బరి నీళ్లు రుచికరంగా, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు, డీహైడ్రేట్ అయినప్పుడు చాలామంది ఈ సహజమైన పానీయాన్ని ఆశ్రయిస్తారు. అయితే దీనితో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. చర్మం, జుట్టు కూడా ఎన్నో బెనిఫిట్స్ పొందుతుంది అంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి లోపలి నుంచి మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. అలాగే స్కిన్, హెయిర్‌కి కూడా బెనిఫిట్స్ అందుతాయి.
ఈ సహజమైన హైడ్రేటింగ్ పదార్థాన్ని మీరు చర్మ, జుట్టు సంరక్షణలో ఉపయోగించవచ్చు. రోజూ వారి దీనచర్యలలో మీరు కొబ్బరినీళ్లను ఎలా ఉపయోగించవచ్చో? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. వీటితో ఎలాంటి బ్యూటీహ్యాక్స్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు దీనిని ప్రారంభించే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. అయితే దీనిని చర్మానికి, జుట్టుకి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేషియల్ మిస్ట్
మీకు పొడి చర్మం ఉందా? కెమికల్స్ వాడితో చర్మం ఇబ్బంది పెడుతుందా? ఒకవేళ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే మీరు కొబ్బరి నీరును ఫేషియల్ మిస్ట్‌గా ఉపయోగించవచ్చు. ఇది మీ సెన్సిటివ్ స్కిన్‌కి ఓదార్పునిస్తుంది. పొడిబారడాన్ని దూరం చేసి చర్మాన్ని తేమగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలోని బహుళ సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మానికి రక్షణ అందిస్తాయి. కొబ్బరి నీటిని, రోజ్ వాటర్‌ను బాగా కలిపి.. స్ప్రే బాటిల్లో వేయండి. చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం మీరు మీకు నచ్చిన ప్రొడెక్ట్స్‌లో కలిపి అప్లై చేసుకోవచ్చు.
ఫేస్ ప్యాక్
కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, అమినో యాసిడ్స్ వంటి చర్మాన్ని ప్రకాశవంతం చేసే గుణాలు ఉంటాయి. వీటిలో యాంటీ మైక్రోబయాల్ గుణాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవన్నీ మొటిమలతో పోరాడడంలో సహాయం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో పసుపు, చందనం కలిపి మీరు ఫేస్ ప్యాక్‌గా అప్లై చేయవచ్చు. ఇది మొటిమలు తగ్గించడమే కాకుండా మీకు మంచి గ్లో కూడా ఇస్తుంది.
హెయిర్ ఫాల్ కంట్రోల్
కొబ్బరి నీరు తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా తలకు మంచి పోషణను అందిస్తుంది. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. హెయిర్ వాష్ చేసే ముందు కొబ్బరి నీళ్లతో స్కాల్ప్ మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ పగిలిపోకుండా, జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా మంచి కండీషనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనివల్ల జుట్టు మృదువుగా, చిక్కులు లేకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లతో మసాజ్ చేయడం వల్ల జిడ్డుగా కూడా ఉండదు కాబట్టి కేవలం ఒక రౌండ్ షాంపూతో హెయిర్ వాష్ చేయవచ్చు.
చుండ్రు ఇబ్బంది పెడుతుంటే..
కొబ్బరి నీళ్లలో సహజమైన యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టు రాలడానికి, పెరగడానికి ఆటంకం కలిగించే దురద, చుండ్రు, ఇతర ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. చుండ్రు సమస్య వేధిస్తున్నప్పుడు దీనిని హెయిర్‌కి ఎలా అప్లై చేయాలంటే.. కొబ్బరి నీళ్లు తీసుకుని దానిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. షాంపూ, కండీషనర్‌తో కడిగిన తర్వాత.. ఈ మిశ్రమంతో జుట్టును కడగండి. ఒక నిమిషం అలాగే ఉంచి.. చల్లని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇది మీకు మెరిసే, చిక్కులు లేని జుట్టును అందిస్తుంది. చుండ్రును కూడా దూరం చేస్తుంది.
Also Read : మీకు ఎల్లో టీ గురించి తెలుసా? ఇది హెల్త్ బెనిఫిట్స్‌కి పెట్టింది పేరు