Situationship Relastionshp : రిలేషన్షిప్స్ రోజురోజుకి మారిపోతున్నాయి. మనుషుల స్వభావాలు మారేకొద్ది కొత్త కొత్త రిలేషన్షిప్స్ తెరపైకి వస్తున్నాయి. అలాంటి వాటిలో సిచ్యుయేషన్(Situationship) కూడా ఒకటి. ఒకప్పుడు దీనిని సీరియస్ రిలేషన్ వద్దనుకునేవారు ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పడు అసలైన రిలేషన్‌షిప్‌ని పక్కకు నెట్టేసి.. దీనిపైనే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అసలు ఈ Situationship కల్చర్ ఏంటి? దీనిలో రూల్స్ ఉంటాయా? ఈ షిప్కి డిమాండ్ ఎందుకు పెరుగుతుందో ఇప్పుడు చూసేద్దాం.
సిచ్యుయేషన్‌షిప్ అంటే ఏమిటి?
సింపుల్‌గా చెప్పాలంటే సిచ్యుయేషన్‌షిప్ అంటే రొమాంటిక్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు. సాధారణంగా రిలేషన్షిప్లో ఉంటే రొమాంటిక్ రిలేషన్‌తో పాటు.. కమిట్మెంట్, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కానీ సిచ్యుయేషన్షిప్లో ఆ కమిట్మెంట్, ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. ఆమె లేదా అతనిని మీ బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ అని చెప్పలేరు. జస్ట్ రొమాంటిక్ డిజైర్స్ని ఎలాంటి కమిట్మెంట్ లేకుండా తీర్చుకోవడాన్నే సిచ్యుయేషన్‌షిప్ అంటారు.
బౌండరీలు ఇవే..
సిచ్యుయేషన్షిప్లో మీతో ఉండే పార్టనర్‌ని.. పార్టనర్‌గా చెప్పుకోలేరు. వారితో మీకు ఎలాంటి గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ ట్యాగ్ ఉండదు. వారితో మీకు ఎలాంటి ఎమోషనల్ రిలేషన్ ఉండదు. ఎలాంటి లేబుల్స్ లేకుండా సిచ్యుయేషన్ షిప్‌లోకి వెళ్లి.. వచ్చేయాలి అంతే.
ఒప్పందం ఉన్నట్టా? లేనట్టా?
సిచ్యుయేషన్షిప్లో మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఏమి ఉండవనే అంగ్రిమెంట్ ఉంటుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి కమిట్మెంట్ ఉండదు. ఎలాంటి కమిట్మెంట్ ఉండదనేదానిపై అగ్రిమెంట్ ఉంటుంది. వాడుకబాషలో చెప్పాలంటే.. మీరు శారీరకంగా కలిసి ఉన్నా.. వారితో మీకు ఎలాంటి ఫ్యూచర్ ఉండదు. ఈ ఉండదు అనే ఒప్పందాన్నే మీరు ఒప్పుకొని సిచ్యుయేషన్ షిప్‌లోకి వెళ్తారు.
ఆ లైన్ క్రాస్ చేయొద్దు..
సిచ్యుయేషన్షిప్లో అవతలి వ్యక్తిని తమ పర్సనల్, ఫిజికల్ విషయాల్లో కొన్ని బౌండరీలు పెడతారు. వారు మిమ్మల్ని అవి దాటొద్దని చెప్తే.. మీరు వాటికి కచ్చితంగా కట్టుబడి ఉండాలి. వారి అవసరాలను, పరిస్థితిని అర్థం చేసుకుని.. బౌండరీలు మెయింటైన్ చేయాలి.
మిక్స్డ్ సిగ్నల్స్
కొన్నిసార్లు మీ పార్టనర్ ఇచ్చే సంకేతాలను మీరు ఎలా తీసుకోవాలో అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు లేదా అవతలి వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు మీరు వారితో ఆ విషయాలపై చర్చించుకోవాలి. దీనివల్ల మీ సిచ్యుయేషన్‌షిప్ సీరియస్ కాకుండా ఉంటుంది.
ఎమోషనల్‌గా
సాధారణంగా ఫిజికల్‌గా ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ఎమోషనల్‌గా ఎక్కువగా కనెక్ట్ అవుతారంటారు. కానీ ఈ సిచ్యుయేషన్షిప్లో మీరు అవతలి వారిపై ఎలాంటి ఎమోషన్ని పెంచుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి చెప్పకూడదు. వాటిని పెంచుకోకూడదనే ఉద్దేశమే ఈ సిచ్యుయేషన్ షిప్. ఈ రిలేషన్లో మీ ఫీలింగ్స్‌ని అవతలి వ్యక్తికి చెప్పినా.. వారు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా వారు మీతో కమిట్మెంట్కి సిద్ధంగా ఉండకపోవచ్చు.
ఇలాంటి కమిట్మెంట్స్ లేకుండా.. శారీరకంగా ఎంజాయ్ చేయాలనుకునేవారు, శారీరక అవసరాలను తీర్చుకోవాలనుకునేవారు సిచ్యుయేషన్షిప్కే ఓటేస్తున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గ్రోత్‌కి ఇది చాలా మంచిదని భావిస్తున్నారు. అందుకే సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లలేకపోతున్నారట.
సిచ్యుయేషన్‌షిప్ అనేది చాలా కన్ఫ్యూజింగ్, మానసికంగా మిమ్మల్ని కొన్నిసార్లు హిట్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ తరహ రిలేషన్లోకి వెళ్లేముందు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫీలింగ్స్, బౌండరీలు, అంచనాలు ఏంటో అవతలివారితో చర్చింకుని.. వారి అవసరాలను అర్థం చేసుకుని.. ఇద్దరూ వాటిని క్రాస్ చేయరు అనుకున్నప్పుడే ఈ రొమాంటిక్ రిలేషన్లోకి వెళ్లొచ్చు. లేదంటే లైట్ తీసుకోవడమే.
Also Read : ఫస్ట్ నైట్ రోజు భర్తను బీర్, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త