Single Life vs Relationship Life : నవంబర్ 11వ తేదీని చాలామంది సింగిల్స్​ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది చైనాలో మొదలై.. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఫన్నీ ట్రెడీషన్​గా మారింది. ఇండియాలో ఈ సింగిల్స్ డేని సెలబ్రేట్ చేసుకోరు కానీ.. మీమ్స్ షేర్ చేసుకుంటూ.. మనం అప్పుడూ సింగిలే.. ఇప్పుడు సింగిలే అనుకుంటూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంతకీ సింగిల్​గా ఉండేవాళ్లు హ్యాపీగా ఉంటారా? రిలేషన్​లో ఉండేవారి మెంటల్ హెల్త్ బాగుంటుందా? 

Continues below advertisement

సింగిల్​గా ఉంటే.. 

Being single అనేది ఈ రోజుల్లో కొందరికి సింపతీ కార్డ్ అయిపోయింది. కానీ రియాలటీ ఏంటంటే.. సింగిల్​గా ఉండడమనేది మనకి మనం ఇచ్చుకునే ప్రయారిటీ. ఆ జర్నీలో వేరేవాళ్లు వస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తామో.. సింగిల్​గా ఉన్నంతవరకు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ సెల్ఫ్​ లవ్​ పెంచుకోవాలి. 

సింగిల్​గా ఉంటే బెనిఫిట్స్ ఏంటి?

సింగిల్​గా ఉంటే ఎక్కువ సమయం దొరుకుతుంది. మీ పనులకు, మీ హాబీలకు, మీ గోల్స్​కి మీరు ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం. మిమ్మల్ని మీరు ఫిజికల్​గా, మెంటల్​గా కూడా స్ట్రాంగ్​ మార్చుకునే వీలు ఉంటుంది. ఎమోషనల్​గా స్ట్రాంగ్ అవుతారు. ఎవరిమీద డిపెండ్ అవ్వాల్సిన పని కూడా ఉండదు. 

Continues below advertisement

మరి సోలోగా ఉంటే ఇబ్బందులు ఉండవా?

సోలో లైఫ్ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. కొన్నిసార్లు, కొన్ని పరిస్థితుల కారణంగా ఒంటరిగా అనిపించవచ్చు. సొసైటీలో పెళ్లి, రిలేషన్ గురించిన ప్రెజర్ ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు ఇన్​సెక్యూరిటీ వచ్చేస్తుంది. కానీ వాటిని మనసుకు తీసుకోకుంటే ఈజీగా ఓవర్​కామ్ చేసేయవచ్చు. 

రిలేషన్​షిప్​లో ఉంటే.. 

హెల్తీ రిలేషన్​ షిప్​లో ఉంటే ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పార్టనర్ దొరుకుతారు. ప్రేమ, కంఫర్ట్​ ఇచ్చే పర్సన్ మీ లైఫ్​లో ఉంటారు. మీకు అవసరమైనప్పుడు తోడుగా ఉంటారు. ఒత్తిడి తగ్గుతుంది. ఇద్దరూ కలిసి లైఫ్​ని ముందుకు తీసుకెళ్లవచ్చు.

మింగిల్ అయితే ఇబ్బందులు ఉండవా?

రిలేషన్​షిప్​ మంచిగా ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. కానీ టాక్సిక్ పార్టనర్ దొరికితే మాత్రం లైఫ్ నరకంగా మారుతుంది. యాంగ్జైటీ పెరుగుతుంది. చిన్నపనులకు కూడా పార్టనర్ ​మీద ఆధారపడిపోవాల్సి వస్తాది. సెల్ఫ్​ ఐడింటెటీ దూరమవ్వవచ్చు. బ్రేకప్ భయాలు, ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతాయి. 

మరి ఎవరి లైఫ్ బెటర్.. సింగిల్? మింగిల్?

అయితే ఈ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఉండదు. ఎందుకంటే ఎవరైనా రిలేషన్​లో ఉంటే చూసి సింగిల్​గా ఉన్నామని మీరు ఎలా ఫీల్ అవుతారో.. టాక్సిక్ రిలేషన్​లో ఉండి.. మిమ్మల్ని చూసిన వాళ్లు అబ్బా సింగిల్​గా ఉన్నా అయిపోయేదిరా బాబు అనుకునేవాళ్లు కూడా ఉంటారు. మంచి పార్టనర్ ఉంటే మింగిల్​ లైఫ్​ చాలా బాగుంటుంది. అలాగే సెల్ఫ్​ లవ్​కి, మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకున్నప్పుడు సింగిల్​ లైఫ్​ కూడా జాయ్​ ఫుల్​గా ఉంటుంది. ఏదైనా మీరు యాక్సెప్ట్ చేసే పద్ధతి, ఆలోచించే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సింగిల్​గా ఉన్నామని ఏడ్వకండి. మింగిల్ అయిపోయామని బాధపడకండి.