సాధారణంగా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది నోటి పూత. అది వచ్చిందంటే చాలు ఏమి తినలేం, తాగలేము. నోట్లో పొక్కులు వచ్చిన చోట ఏదైనా తగిలిందా అబ్బా.. ఆ నొప్పి అసశాలి తట్టుకోలేరు. నోటి పూత రావడానికి అనేక కారణాలు ఉంటాయి. హార్మోన్లు అసమతుల్యత, శరీరంలో అధిక వేడి వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్లో వివిధ రకాల మందులు ఉన్నప్పటికీ మన వంటింట్లో దొరికే వాటితో చాలా సులభంగా దాన్ని తగ్గించుకోవచ్చు. అవేంటో ఓ సారి చూసేద్దాం. 


పసుపు పొడి 


పసుపు అన్నీ గాయాలని నయం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని రక్షించడంలో పసుపు గొప్ప ఔషధంగా పని చేస్తుంది. కొద్దిగా నీటిలో పసుపు వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని నోట్లో పూసిన దగ్గర అప్లై చేసుకోవాలి. ఇలా రోజుకి మూడు సార్లు చేస్తే నోటి పూట నుంచి త్వరగా బయట పడొచ్చు. 


యాపిల్ సైడర్ వెనిగర్ 


నోట్లో ఉండే క్రిముల మీద పోరాడేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. దీనిలో  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ వెనిగర్ని తీసుకోవాలి. దాన్ని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఆ తర్వాత మంచి నీటితో మరో సారి నోరు శుభ్రం చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే, పడుకునే ముందు ఇలా చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 


కొబ్బరి పాలు  


కొబ్బరి పాలు తాగడం వల్ల నోటి పూత నుంచి వచ్చే మంట తగ్గుతుంది. రోజుకి రెండు లేదా మూడు సార్లు కొబ్బరి పాలతో పుక్కిలించాలి. అలా చెయ్యడం వల్ల నోటి పూత వల్ల వచ్చే నొప్పి తగ్గిపోతుంది. వీటిని నోటిలో సుమారు 5 నిమిషాల పాటు ఉంచుకుని పుక్కిలించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 


Also Read: వెదురు బొంగు కొనుక్కోండి, ఇంట్లోనే ఇలా బొంగులో చికెన్ వండేయండి


కొబ్బరి నూనె 


కొబ్బరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది నోటి అల్సర్, ఇన్ఫెక్షన్స్ నుంచి బయట పడేందుకు మంచి మందు లాగా పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి పూత త్వరగా తగ్గేలాగా చేస్తుంది. రాత్రి నిద్ర పోయే ముందు నోట్లో పొక్కులు వచ్చిన దగ్గర కొబ్బరి నూనె రాసుకుని పడుకోవాలి. ఇది మెడికల్ స్టోర్ లో దొరికే మందుల కంటే వేగంగా తగ్గిపోయేలాగా చేస్తుంది. అందుకే నోరు పూసిందంటే చాలా మంది కాస్త కొబ్బరి నవిలి ఆ పిప్పి పూసిన చోట కాసేపు ఉంచుకోమని చెప్తారు. 


తేనె 


తేనెలోని ఔషధ, యాంటీ మైక్రోబియల్  గుణాలు గాయాలను తక్షణమే నయం అయ్యేలాగా పని చేస్తుంది. నోటి పూట మీద తేనె రాసుకోవాలి. ఇది పక్కన ఉన్న ఇతర భాగాన్ని ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. లాలాజలంతో కలిపి దాన్ని మింగిన ఏమి కాదు. ఇలా ప్రతి రెండు గంటలకి ఒకసారి చేసిన మంచి ఫలితం లభిస్తుంది.  


Also read: మొటిమలు తగ్గాలన్నా, చుండ్రు పోవాలన్నా ఈ నూనె అద్భుతంగా పనిచేస్తుంది