Quick & Budget Friendly Diwali Home Decor Ideas :  దీపావళి (Diwali 2025) ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభానికి గుర్తుగా చెప్తారు. ఈ పండుగ స్పెషాలిటీ ఏంటంటే చీకటిని దూరం చేస్తూ.. సెలబ్రేషన్స్​కి గుర్తుగా దీపాలు వెలిగిస్తారు. లక్ష్మీ పూజ చేసి.. స్వీట్లు పంచుకుంటారు. దీనిలో భాగంగా ఇంటిని అందంగా అలంకరిస్తారు. అయితే మీరు బిజీగా ఉండి.. ఆఫీస్​కి వెళ్లి.. తక్కువ టైమ్ ఉన్నవారు అయితే ఇంటిని సర్దుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. అలాంటివారు తక్కువ సమయంలో కొన్ని సింపుల్ టిప్స్​ ఫాలో అవుతూ ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి మీ హోమ్​లుక్​ని మెరుగుపరిచి.. పండుగ వైబ్​ని పెంచుతాయి. మరి సింపుల్ DIY దీపావళి డెకర్ టిప్స్ ఏంటో చూసేద్దాం. 

దిండు కవర్లు

 

(Image Source: Canva)

రంగురంగుల ఎథ్నిక్ కుషన్ కవర్లతో మీ గదికి పండుగ రూపాన్ని ఇవ్వవచ్చు. సోఫాపై ఉండే దిండ్లపై కుషన్స్​ని మీరు ఇలాంటి ట్రెడీషనల్ లుక్​ ఇచ్చే వాటితో రిప్లేస్ చేయవచ్చు. ఇది చిన్న మార్పే కానీ.. గ్రేట్ లుక్ ఇస్తుంది. అలాగే మంచపై కూడా ప్లెయిన్ బెడ్​ షీట్ వేసి.. ఇలాంటి కలర్​ఫుల్ కవర్స్ పిల్లోలకు వేయడం వల్ల లుక్ మారిపోతుంది. ఈజీగా ఫెస్టివ్ వైబ్‌ ఇస్తాయి. సింపుల్​గా రూమ్​ని అట్రాక్టివ్​గా మార్చేయవచ్చు.

ఫ్లోరల్ రంగోలి

(Image Source: Canva)

ఎలాంటి అలంకరణ చేయకపోయినా.. ఇంటి గుమ్మం ముందు పూలతో అందమైన రంగోలి వేసేయండి. అసలు దీనికి మించిన డెకరేషన్ ఇంకోటి ఉండదని చెప్పవచ్చు. మధ్యలో దీపాలు పెట్టారంటే.. అది నెక్స్ట్ లెవెల్ ఫెస్టివల్ వైబ్ ఇస్తుంది. కాబట్టి బంతి, గులాబీ రేకులతో లేదా రంగులతో మీరు ఇంటిముందు అందమైన ముగ్గు వేసి డెకరేట్ చేసేయండి. ఇంటిలోపల ఎలాంటి డెకరేషన్ చేయకున్నా ఇది అందమైన లుక్ ఇస్తుంది. 

దీపాలతో డెకరేషన్

 

(Image Source: Canva)

ఇంట్లో ఎలాంటి డెకరేషన్ చేయనప్పుడు సింపుల్​గా ఇంటిని క్లీన్ చేసి.. ఓ పది పదిహేను దీపాలు లేదా క్యాండిల్స్ తీసుకుండి. టేబుల్స్​పై, అల్మారాలలో, ట్రేలపై, గుమ్మం దగ్గర పెట్టండి చాలు. ఇవన్నీ సింపుల్​గా దీపావళి లుక్​ని రెట్టింపు చేస్తాయి. లేదా ముగ్గుపై కూడా వీటిని ఉంచవచ్చు.  ఇవి మీ మూడ్‌ను రెట్టింపు చేస్తాయి. అలాగే సువాసనతో కూడిన క్యాండిల్స్ మంచి స్మెల్ ఇస్తాయి. మొత్తం రూమ్​ని వైబ్రైట్ చేస్తాయి. మనసుకు కూడా హాయిగా ఉంటుంది.

పేపర్ లైట్స్

(Image Source: Canva)

చేతితో చేసిన కాగితపు లాంతర్లు కూడా ఇంటికి మంచి లుక్ ఇస్తాయి. ఇవి పర్యావరణానికి కూడా అనుకూలమైనవి. ఈ లైట్లు కిటికీలు, బాల్కనీల దగ్గర వేలాడదీస్తే అద్భుతంగా కనిపిస్తాయి. ఇవి మీ ఇంటిని ప్రకాశవంతంగా చేయడానికి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్.

వాల్ హ్యాంగింగ్‌లు

(Image Source: Canva)

ఆధునిక శైలితో సంప్రదాయాన్ని మిళితం చేసే అద్భుతమైన వాల్ హ్యాంగింగ్‌లు గోడలకు మంచి లుక్ ఇస్తాయి. ఈ అలంకరణ వస్తువులు ఈ దీపావళికి మీ ఇంటికి చక్కదనమైన లుక్స్ ఇస్తాయి. 

కొవ్వొత్తులతో

(Image Source: Canva)

వివిధ ఆకారాలు, పరిమాణాలలో డెకరేట్ చేయడానికి క్యాండిల్స్ ఉంటాయి. ఇవి ఇంటిలోని ప్రతి మూలను హైలెట్ చేస్తాయి. వీటిని ఇంట్లోని  అల్మారాలలో, కిటికీలలో చెప్పవచ్చు. ఇవి మంచి వెలుగు ఇవ్వడంతో పాటు.. సువాసన మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

కాబట్టి మీకు ఎక్కువ సమయం లేనప్పుడు ఇలాంటి టిప్స్ ఫాలో అయి దీపావళికి ఇంటిని సిద్ధం చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా డెకరేట్ చేసుకోండి.