Christmas Gifts for Colleagues : క్రిస్మస్ సమయంలో ఆఫీసుల్లో సీక్రెట్ శాంటాను చేస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీ యూనైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఈ ట్రెడీషన్‌ని ఇండియాలో కూడా ఫాలో అయ్యేవారు ఉన్నారు. క్రిస్మస్ సమయంలో మీ ఆఫీస్‌లో కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అయితే మీరు కూడా మీ కొలిగ్స్కి గిఫ్ట్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.
సీక్రెట్ శాంటా అంటే..
క్రిస్మస్ సెలబ్రేషన్స్ సీక్రెట్ శాంటాలో భాగంగా కొలిగ్స్ అందరూ గిఫ్ట్‌లు కొని ఓ చోట పెడతారు. అలా పెట్టిన గిఫ్ట్‌లను వేరొకరు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏ కొలిగ్ ఎవరికి ఏ గిఫ్ట్ ఇచ్చారో తెలీదు. ఇలా సీక్రెట్‌గా గిఫ్ట్‌లను ఇచ్చే ప్రక్రియనే సీక్రెట్ శాంటాగా చెప్తారు. అయితే సీక్రెట్ శాంటాగా ఎలాంటి గిఫ్ట్‌లు కొలిగ్స్కి ఇవ్వాలో కొందరికి తెలీదు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే తక్కువ బడ్జెట్లో వచ్చే, కొలిగ్స్కి ఉపయోగపడే గిఫ్ట్‌లు ఎలా ఎంచుకోవాలో? ఎలాంటి గిఫ్ట్‌లు.. ఎంత ధరలో వచ్చే అవకాశముందో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.500 లోపు
మీ బడ్జెట్ రూ. 500 అయితే.. కాఫీ మగ్ లేదా పెన్ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇండియన్ స్వీట్స్, లేదా చాక్లెట్స్ కూడా బెస్ట్ ఆప్షన్. పైగా క్రిస్మస్ సమయంలో చాక్లెట్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. పేపర్ వైయిట్స్ లేదా స్ట్రెస్ బాల్ని కూడా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. యూనిక్ కీ చైన్స్, ఇండోర్ మొక్కను కూడా ఈ బడ్జెట్లో గిఫ్ట్ చేయవచ్చు.
రూ. 500 నుంచి రూ.1000లోపు
కస్టమైజ్ చేయించిన నోట్ బుక్ లేదా జర్నల్‌ని సీక్రెట్ శాంటాగా ఇవ్వొచ్చు. ఇది న్యూఇయర్‌లో వారికి హెల్ప్ చేస్తుంది. లగ్జరీ క్యాండిల్స్ లేదా సెంటెడ్ ఆయిల్స్ ఇవ్వొచ్చు. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. పైగా మనసుకు హాయిని కూడా ఇస్తాయి. మీరు ఓకే అనుకుంటే వైన్ బాటిల్‌ని కూడా గిఫ్ట్ చేయవచ్చు. బుక్ లేదా నవలను ఇవ్వొచ్చు. పెన్ హోల్డర్, పేపర్ ట్రేను డెస్క్ యాక్ససరీల్లో భాగంగా ఇవ్వొచ్చు. అమ్మాయిలు ఉంటే మీరు శారీని లేదా అబ్బాయిలకు షర్ట్‌ని మీరు గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
Also Read : మొదటి ప్రపంచ యుద్ధంలో క్రిస్మస్ బ్రేక్.. ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకున్న శత్రుసైన్యం
రూ. 1000 నుంచి రూ. 2000 లోపు
మీ దగ్గర బడ్జెట్ కాస్త బెటర్‌గా ఉంటే టోట్ బ్యాగ్ లేదా కస్టమైజ్డ్ ఫోన్ కేస్ ఇవ్వొచ్చు. మూవీ టికెట్స్ లేదా డిన్నర్ వోచర్‌ని ఇస్తే రిలాక్సింగ్‌గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ప్యాక్ లేదా టీ లేదా కాఫీ గిఫ్ట్ బాస్కెట్ ఇవ్వొచ్చు. కస్టమైజ్ చేసిన పెయింటింగ్, ఫోటోను కూడా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
మీ బడ్జెట్ ఏది అయితే.. దానికి తగ్గట్లు ఈ గిఫ్ట్స్ తీసుకోవచ్చు. పైగా ఇప్పుడు మనం చదువుకున్న గిఫ్ట్స్ అన్ని ఏదొకరకంగా మీ కొలిగ్స్కి బాగా హెల్ప్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పటినుంచే ఏమి గిఫ్ట్‌ని, ఎంత బడ్జెట్లో ఇవ్వాలో డిసైడ్ అయిపోండి.
Also Read : పిల్లలు మంచిగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలివే