Secret Santa Gift Ideas 2023 : క్రిస్మస్ సమీపించే సమయంలో మీ సహోద్యోగులకు సీక్రెట్ శాంటా బహుమతులు ఇచ్చే సంప్రదాయం మీ ఆఫీస్​లో ఉందా? కొన్ని కార్పోరేట్​ ఆఫీస్​లలో ఈ సీక్రెట్ శాంటా పేరుతో బహుమతులు ఇస్తుంటారు. మీ ఆఫీస్​లో కూడా ఇలాంటి రూల్ ఉంటే ఈ సంవత్సరం మీ కొలిగ్స్​కి మీరేమి గిఫ్ట్​లు ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఏమి గిఫ్ట్ వస్తుందనే దానికంటే.. ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారా?అయితే ఇక్కడ కొన్ని క్రియేటివ్, క్రేజీ గిఫ్ట్ ఐడియాలున్నాయి.


సీక్రెట్ శాంటాగా మీరు ఇచ్చే గిఫ్ట్స్ మీ కొలిగ్స్​కి ఉపయోగపడేవి అయితే బాగుంటుంది. కాబట్టి కాస్త కొత్తగా, క్రియేటివ్​గా, క్రేజీగా ఏదైనా ఇస్తే అది వారికి కూడా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా వారికి హాలిడే సమయంలో ఉపయోగపడే గిఫ్ట్​లను ఇస్తే.. వారు ఎక్కడికైనా వెళ్లినా తీసుకెళ్లగలిగే వాటిని ఇస్తే ఇంకా మంచిది. అయితే అలాంటి కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఇక్కడున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి. కొనేయండి. 


ఫ్రెంచ్ ప్రెస్


మీ కొలిగ్​కి కాఫీ అంటే ఇష్టమా? అయితే ఇంకెందుకు ఆలస్యం వారికోసం ఫ్రెంచ్ ప్రెస్​ కొనేయండి. ఇది వారి పని ఒత్తిడి నుంచి ఉపశమనం అందించే ఓ క్యూట్​ మిషన్ అవుతుంది. ఎందుకంటే ఇది సూపర్​ ఫంక్షనల్​, క్లాసీ కాఫీ గేర్​ అని చెప్పవచ్చు. దీనిని ఉపయోగించడం కూడా చాలా తేలిక. పైగా పని ఒత్తిడినుంచి రిలీఫ్​ కోసం దానిని ఆశ్రయించిన ప్రతీసారి మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. 


క్రిస్మస్ స్వెటర్లు


క్రిస్మస్​ సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి మీరు స్వెటర్ గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. అయితే దానిని కాస్త డిఫరెంట్​గా ఇవ్వాలనుకుంటే మీరు అగ్లీ క్రిస్మస్ స్వెటర్​ ఇవ్వొచ్చు. క్రిస్మస్ సమయంలో వీటికుండే డిమాండ్ అంతా ఇంతా కాదు. పాశ్చాత్య దేశాల్లో వీటిని బాగా ఎక్కువగా కొనగోలు చేస్తారు. అయితే క్రిస్మస్ సమయంలో మీరు మీ కొలిగ్​కి.. ఏమైనా ఫన్నీ కోట్స్​ ఉన్న స్వెటర్స్​ని గిఫ్ట్ చేయవచ్చు. వాటిని చూసినప్పుడు.. లేదా ఎవరైనా దాని గురించి అడిగినప్పుడు వారు మిమ్మల్ని తలచుకుంటారు. 


సెంటెండ్ క్యాండిల్స్


సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులు ఎప్పుడూ ట్రెండ్​కి తగ్గట్లు ఉంటాయి. అదే సమయంలో సంప్రదాయబద్ధంగా కూడా ఉంటాయి. కాబ్టటి వీటిని ఎవరూ విస్మరించలేరు. ఒత్తిడిని తగ్గించే ఫ్లేవర్​ కలిగిన క్యాండిల్స్​ని మీ కొలిగ్స్​కి గిఫ్ట్ చేయండి. అవి రోజంతా ఆఫీస్​ పనిలో అలసిపోయి.. ఇంటికి వెళ్లిన తర్వాత ఈ కొవ్వొత్తి వల్ల స్ట్రెస్​ రిలీఫ్​ అయితే అంతకంటే కావాల్సిందేముంది?


ప్రయాణ ఉపకరణాలు..


పండుగల సమయంలో లేదా లాంగ్​ వీకెండ్​ వస్తే కాస్త స్ట్రెస్​ రిలీఫ్​ కోసం చాలామంది బయట ప్రయాణాలు చేస్తారు. అలా ట్రావెల్​ చేయడానికి ఇష్టపడే కొలిగ్ మీకుంటే.. వారికోసం మంచి బ్యాగ్​ను కొనొచ్చు. లేదంటే జర్నీలో ఉపయోగించే దిండు, ఐ మాస్క్​ వంటి చిన్నచిన్న వస్తువులను గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఇది వారి హాలీడేకి ఉపయోగపడేదయ్యేలా చూసుకోండి. 


మీరు ఇలాంటి క్రియేటివ్ ఐడియాలతో గిఫ్ట్​లు ఇస్తే.. ఏ కొలిగ్​ మాత్రం నిరాశ చెందుతారు చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం మీ క్రియేటివిటీతో గిఫ్ట్స్​ కొనేసి.. మీ కొలిగ్​కి ఫేవరట్​ సీక్రెట్​ శాంటాగా మారిపోండి.


Also Read : క్రిస్మస్​ను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?