Romantic Destinations in India : వాలెంటైన్స్ డే సమయంలో మీ ప్రేయసి లేదా ప్రియుడితో కలిసి ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇండియాలోనే టాప్ 8 రొమాంటిక్ డెస్టినేషన్స్​ లిస్ట్ ఇక్కడున్నాయి. మంచుతో కప్పబడిన పర్వతాల నుంచి.. తెల్లటి ఇసుక బీచ్​ల వరకు మీ పార్టనర్​తో కలిసి చూడగలిగే రొమాంటిక్ డెస్టినేషన్​లు ఎన్నో ఇండియాలో ఉన్నాయి. వాలెంటైన్స్​ డే 2025 సందర్భంగా ఇండియాలో వెళ్లగలిగే బెస్ట్ ప్లేస్​లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కొడైకెనాల్ (Kodaikanal)

తమిళనాడులోని కొడైకెనాల్​లో వాలెంటైన్స్​ డేకి వెళ్లగలిగే బెస్ట్ రొమాంటిక్ డెస్టినేషన్. ప్రిన్సెస్ ఆఫ్ హిల్స్​ అని పిలిచే ఈ హిల్​ స్టేషన్​ మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 7వేలకు పైగా అడుగుల ఎత్తులో పశ్చిమ కనుమల గుండా ఇది విస్తరించి.. టూరిస్ట్​లను ఆకట్టుకుంటుంది. 

గుల్మార్గ్ (Gulmarg)

రొమాంటిక్ డెస్టినేషన్స్​లో జమ్మూ కశ్మీర్​లోని గుల్మార్గ్ ఒకటి. దీనిని మేడో ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. సముద్ర మట్టానికి 2650 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోల్ఫ్​ కోర్స్​ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్ఫాథర్ సరస్సు మీకు బ్యూటీఫుల్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. గొండోలా రైడ్స్ విజువల్ వండర్స్​ ఇస్తుంది. 

జైసల్మేర్ (Jaisalmer)

రాజస్థాన్​లోని జైసల్మేర్​ను గోల్డెన్ సిటీగా పిలుస్తారు. ఇక్కడ వారసత్వ సంపద, సంస్కృతి నిండి ఉంటుంది. ఎడారి, కోటలు, రాజభవనాలు మొదలైనవి ఎన్నో ఇక్కడ విజిట్ చేయవచ్చు. రాత్రుళ్లు ఎడారిలో క్యాంప్స్ వేసుకోవడం.. ఒంటె సవారీలు చేస్తూ మీరు వాలెంటైన్స్​ డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. 

లక్షద్వీప్ (Lakshadweep)

భారతదేశంలో బెస్ట్ రొమాంటిక్ డెస్టినేషన్​లో లక్షద్వీప్ ఒకటి. ఇక్కడ చెట్లతో నిండిన బీచ్​లు మీ మనసును కట్టిపడేస్తాయి. పగడపు దిబ్బలతో కూడిన ఈ ద్వీపం మీ వాలెంటైన్స్​ డేకి బ్యూటీఫుల్ మెమోరీ ఇస్తుంది. 

మినీ స్విట్జర్లాండ్ (Dalhousie)

హిమాచల్​ ప్రదేశ్​లోని డల్హౌసీని మినీ స్విట్జర్లాండ్ అంటారు. చంబా పట్టణానికి ఇది దగ్గర్లో ఉంటుంది. ఇక్కడ మీరు మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, పచ్చికభూములు, దేవాలయాలు, కొండలు, లోయలు చూడవచ్చు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం మీ మనసును కట్టిపడేస్తుంది. 

వార్కల (Varkala)

మీరు బీచ్​కి వెళ్లే మూడ్​లో ఉంటే కేరళలో వార్కలకి వెళ్లొచ్చు. బ్యూటీఫుల్​ హోమ్​ స్టేలు, లగ్జరీ హోటల్స్​ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఫోటోలకు, వీడియోలకు ఇక్కడ లొకేషన్లు చాలా బాగుంటాయి. మీ వాలెంటైన్​తో వెళ్తే మీరు రొమాంటిక్​ డెస్టినేషన్​కు ఇది బెస్ట్. 

హేవ్​లాక్ ద్వీపం (Havelock Island)

అండమాన్ నికోబార్​లోని హేవ్​లాక్ ద్వీపం అద్భుతమైన బీచ్​లు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడ 572 ద్వీపాలు ఉంటాయి. హేవ్​లాక్​, నీల్​ ద్వీపాలు ఉత్తమ స్నార్కెలింగ్, డైవింగ్ ఆప్షన్స్ ఉంటాయి. 

గోకర్ణ (Gokarna)

కర్ణాటకలోని గోకర్ణ కూడా వాలెంటైన్స్​ డేకి బెస్ట్ డెస్టినేషన్​ అవుతుంది. మహాబలేశ్వర్​ వంటి ఆలయాలు కూడా సందర్శించవచ్చు. ట్రెడీషనల్, రొమాంటిక్ ట్రిప్​ కోసం మీరు ఇక్కడికి వెళ్లొచ్చు. 

ఈ వాలెంటైన్​ వీక్ సమయంలో మీరు కూడా ఈ ప్రదేశాలకు ప్రేయసి లేదా ప్రియుడితో వెళ్లి చిల్ అవ్వొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ రొమాంటిక్ డెస్టినేషన్స్​కి చెక్కేయండి. 

Also Read : కిస్ డే స్పెషల్, ముద్దులు ఎన్ని రకాలో తెలుసా? ఒక్కో ముద్దుకి ఒక్కో అర్థం