Glowing Skin and Glossy Hair for Festivals : పండుగలు వచ్చాయంటే కొత్త బట్టలు, ఆభరణాలతో పాటు ముఖం కాంతివంతంగా కనిపించాలని.. జుట్టు మెరుస్తూ ఉండాలని చాలామంది కోరుకుంటారు. దీనికోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా వాడుతారు. అలాగే గ్లోయింగ్ స్కిన్ కోసం ఇంట్లో దొరికే పదార్థాలతో కూడా సహజమైన చిట్కాలను కూడా ప్రయత్నిస్తారు. అలాంటి వాటిలో రైస్ వాటర్ కూడా ఒకటి.

Continues below advertisement

బ్యూటీ రొటీన్‌లో రైస్ వాటర్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. ఇది చర్మానికి హైడ్రేషన్ అందించడంతో పాటు జుట్టు స్మూత్‌గా, షైనీగా కనిపించడానికి కొంతవరకు సహాయపడుతుంది. మరి పండుగల ముందు దీన్ని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో చూసేద్దాం. 

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Continues below advertisement

జుట్టుకు రైస్ వాటర్

బియ్యాన్ని కొద్దిసేపు నీటిలో నానబెట్టిన తర్వాత వచ్చే నీటిని తీసుకుని జుట్టుకు ఉపయోగించవచ్చు. షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు ఈ నీటిని అప్లై చేసి కొద్దిసేపు ఉంచి.. ఆ తర్వాత సాధారణ నీటితో బాగా కడగాలి. బియ్యంలో ఉండే స్టార్చ్ జుట్టు వెంట్రుకలపై తేలికపాటి పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల జుట్టు స్మూత్‌గా, సాఫ్ట్‌గా, కొంత మెరుపుతో కనిపించవచ్చు. చిక్కులు కూడా సులభంగా విడిపోతాయి. అయితే రైస్ వాటర్ వాడటం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందని లేదా హెయిర్ ఫాల్ పూర్తిగా ఆగిపోతుందని చెప్పే సరైన ఆధారాలు లేవు.

చర్మానికి ఎలా వాడాలంటే..

రైస్ వాటర్‌ను కొందరు చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కొంతవరకు హైడ్రేట్ చేసి సాఫ్ట్‌గా అనిపించేలా చేయవచ్చు. బియ్యం నుంచి లభించే కొన్ని పదార్థాలు చర్మంలోని తేమను, చర్మ రక్షణ పొరను కాపాడటంలో ఉపయోగపడవచ్చని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి. 

Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి

బియ్యం నుంచి తయారుచేసిన ప్రత్యేకమైన సెరమైడ్ ఉత్పత్తులపై జరిగిన పరిశోధనలను ఇంట్లో తయారుచేసుకునే సాధారణ రైస్ వాటర్‌తో కంపేర్ చేయలేము కాబట్టి.. రైస్ వాటర్‌తో డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ పూర్తిగా పోతాయని లేదా కొద్ది రోజుల్లోనే గ్లాస్ స్కిన్ వస్తుందని చెప్పలేము.

పండుగల ముందు ఇలా ట్రై చేయండి..

పండుగకు కొన్ని రోజుల ముందు మీ బ్యూటీ రొటీన్‌లో రైస్ వాటర్‌ను ఒక అదనపు స్టెప్‌గా ప్రయత్నించవచ్చు. అయితే కొత్తగా ఏదైనా చర్మంపై ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. జుట్టుకు ఉపయోగించాలనుకుంటే తాజాగా తయారుచేసుకున్న రైస్ వాటర్‌ను ఉపయోగించండి. ఎందుకంటే ఎక్కువసేపు పులియబెట్టి, సరిగ్గా నిల్వ చేయని రైస్ వాటర్‌లో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

రైస్ వాటర్ ఉపయోగించిన తర్వాత చర్మం లేదా తలపై దురద, ఎర్రబడటం, వాపు, మంట లేదా పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉపయోగించడం ఆపేయాలి. సెన్సిటివ్ స్కిన్ లేదా సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

గ్లో కోసం ఇలా చేయండి..

పండుగ రోజున ముఖం, జుట్టు అందంగా కనిపించడానికి రైస్ వాటర్‌ను ఉపయోగించడం మంచిదే కానీ.. పూర్తిగా దానిపై ఆధారపడకూడదు. దానిని ఒక చిన్న బ్యూటీ రొటీన్‌గా మాత్రమే చూడాలి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్యమైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర, సరైన స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోవడం కూడా ముఖ్యమే.

Also Read : యవ్వనంగా, మెరిసే చర్మం కోసం తినాల్సిన ఫుడ్స్ ఇవే.. స్కిన్​ కలర్ కూడా బ్రైట్ అవుతుందట