Continues below advertisement

Republic Day 2026 The History Behind January 26 : జనవరి 26వ తేదీన మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నాము. దీని కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతిచోటా దేశభక్తి గీతాలు వినిపిస్తాయి. అయితే గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన విషయం అని చాలా మందికి తెలియదు. వాస్తవానికి మన రాజ్యాంగం (Indian Constitution) జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. అయితే ఇది రెండు నెలల ముందుగానే పూర్తయింది. కానీ దీన్ని అమలు చేయడానికి రెండు నెలల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. రెండు నెలలు ఎందుక లేట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Continues below advertisement

నవంబర్ 26, 1949న రాజ్యాంగ ఆమోదం

భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం  పొందింది. అయితే జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని స్వీకరించి.. ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. భారతదేశ రాజ్యాంగం నవంబర్ 26, 1949న పూర్తయింది. కానీ అది అమలులోకి రావడానికి రెండు నెలలు పట్టింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాలు.. 11 నెలల 18 రోజులు పట్టింది. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్. భీమ్ రావ్ అంబేద్కర్ దీనిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

ప్రతి సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 26, 1930న భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ప్రకటించింది. ఈ చారిత్రక ప్రాముఖ్యతను గౌరవించటానికి డాక్టర్. బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ.. రాజ్యాంగం రూపొందించింది. తర్వాత భారతదేశంలో జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున భారత జాతీయ జెండాను ఎగురవేస్తూ భారత గణతంత్ర రాజ్యానికి సంబంధించిన చారిత్రక జననం ప్రకటించారు. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.

రెండు నెలల తర్వాత ఎందుకు అమలైంది?

భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత.. దానిని అమలు చేయడానికి రెండు నెలల సమయం పట్టింది. దీనికి కారణం మీకు తెలుసా? 1930లో జనవరి 26న లాహోర్ సమావేశంలో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ప్రకటించింది. అటువంటి పరిస్థితిలో నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఏర్పడినప్పటికీ.. జనవరి 26 కోసం ఎదురు చూశారు. ఎందుకంటే ఆ సమయంలో దీనిని లాహోర్ సమావేశ ప్రకటనతో అనుసంధానించాలని చూశారు. అందుకే నవంబర్ 29, 1949న రాజ్యాంగం ఏర్పడినా.. జనవరి 26, 1950న అమలులోకి తెచ్చారు.

గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత 

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి పండుగలా జరుపుకుంటారు. ఈ రోజున ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో గొప్ప కవాతు, శకటాలు, మూడు దళాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 21 తుపాకులతో సెల్యూట్ చేస్తారు. ఇది కేవలం సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాదు. ఇది జాతీయ ఆత్మవిశ్వాసానికి చిహ్నం. స్కూల్స్, ఆఫీస్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపిస్తారు.