యూట్యూబ్ (YouTube)​ ద్వారా సంపాదించాలని కొత్తగా ఛానెల్(YouTube Income for Beginners) ప్రారంభించారా? అయితే మీరు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటంటే యూట్యూబ్ ఛానెల్ (New YouTube Channel) క్రియేట్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు కొందరు. కానీ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలంటే... ముందుగా మీ ఛానెల్​ను యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP-YouTube Partner Program) లో చేర్చాలి. దీని కోసం కొన్ని కండీషన్స్ ఉంటాయి. వాటిని పూర్తి చేస్తేనే మీరు YPPలో చేర్చగలుగుతారు. మరి ఆ కండీషన్స్ ఏంటో.. యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించవచ్చో చూసేద్దాం. 

Continues below advertisement

కొత్త యూట్యూబర్లు(New YouTubers) ఛానెల్ ప్రారంభించిన వెంటనే సంపాదన మొదలవుతుందని అనుకుంటారు. కానీ వాస్తవం కొంచెం భిన్నంగా ఉంటుంది. మానిటైజేషన్ మార్గం సులభతరం చేయడానికి, స్థిరంగా నాణ్యమైన కంటెంట్ను అందించడం ముఖ్యం. మీ వీడియోలు ఎంత ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉంటే.. ప్రేక్షకులు అంత వేగంగా పెరుగుతారు. వ్యూస్ పెరిగిన తర్వాత డబ్లులు సంపాదించేందుకు చేయాల్సిన ప్రక్రియ ఏంటో చూసేద్దాం. 

YPP కండీషన్స్ ఇవే

మీరు YPPలో అప్లై చేయడానికి మీ ఛానెల్​లో కనీసం 1,000 మంది సబ్ స్క్రైబర్లు ఉండాలి. దీనితో పాటు గత 12 నెలల్లో 4,000 గంటల వాచ్ టైమ్ కూడా పూర్తి చేయడం అవసరం. కొత్తగా యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్స్ కోసం కూడా నిబంధనలు వచ్చాయి. మీరు లాంగ్ వీడియోలకు బదులుగా షార్ట్స్ చేస్తే.. గత 90 రోజుల్లో కనీసం 1 కోటి (10 మిలియన్) వ్యూస్ తీసుకురావాలి. ఈ నిబంధనలు పూర్తి అయిన తర్వాత మీరు YPP కోసం అప్లై చేసుకోవచ్చు.

Continues below advertisement

సక్సెస్ చేసే కంటెంట్

వారానికి కనీసం 2–3 వీడియోలు అప్‌లోడ్ చేయాలి. క్రమం తప్పకుండా ఛానెల్‌లో ట్రాఫిక్ పెరుగుతుంది. సబ్‌స్క్రైబర్‌లు త్వరగా వస్తారు. ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై వీడియోలు చేయండి. దీనివల్ల వ్యూస్ పెరుగుతాయి. స్పష్టమైన వాయిస్, మంచి కెమెరా, ఎడిటింగ్ మీ కంటెంట్‌ను మరింత వృత్తిపరంగా చేస్తాయి. టైటిల్, వివరణ, టాగ్స్‌లో సరైన కీలక పదాలను చేర్చడం వల్ల వీడియోలు సెర్చ్​లో పైకి వస్తాయి. ఎక్కువ మంది చూడగలుగుతారు.

యాడ్స్ నుంచి సంపాదన..

మీ యూట్యూబ్ ఛానెల్ YPPలో చేరిన వెంటనే.. మీ వీడియోలలో ప్రకటనలు వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారు. దీనితో పాటు YouTube సూపర్ చాట్, సూపర్ థాంక్స్, ఛానెల్ సబ్​స్క్రిప్షన్, బ్రాండ్ సహకారాలు వంటి ఇతర ఆదాయ మార్గాలను కూడా అందిస్తుంది. మీ కంటెంట్ బాగుంటే, వ్యూస్ మంచిగా పెరుగుతుంటే.. కొంతకాలంలోనే మీ ఆదాయం కూడా పెరుగుతుంది.

యూట్యూబ్​లో మానిటైజేషన్ పొందడం కష్టం కాదు కానీ.. దానికి ఓపిక, కష్టం చాలా అవసరం. 1,000 మంది సబ్స్క్రైబర్లు, 4,000 గంటల వాచ్ టైమ్ నిబంధనను పూర్తి చేసిన తర్వాతే ఛానెల్ ద్వారా సంపాదన ప్రారంభమవుతుంది. మీరు ఎల్లప్పుడు మంచి కంటెంట్ ఇస్తూ.. ప్రేక్షకులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే.. మీ ఛానల్ త్వరలోనే మానిటైజ్ అవుతుంది. దీనివల్ల యూట్యూబ్ నుంచి మంచి ఆదాయం పొందగలుగుతారు.