Malaria Precautions: వర్షాకాలం ప్రారంభం అయ్యిందంటే చాలు.. దోమల సీజన్ షురూ అయ్యిందని అర్థం. సాయంత్రం అయ్యిందంటే.. మనపై దండయాత్రకు రెడీగా ఉంటాయి. మనల్ని కుట్టి కుట్టి రక్తాన్నీ జలగల్లా పీల్చేస్తుంటాయి. అవి అంతటితో ఆగిపోవు.. లేనిపోని రోగాలను అంటించి జారుకుంటాయి. దోమలు కుట్టడం వల్ల మలేరియా, మెదడువాపు, చికున్ గున్యా, డెంగీ వంటి విషజ్వరాలు మనకు వ్యాపిస్తాయి. కొన్ని రకాల దోమలు కుడితే శరీరంలో ఎర్రటి దద్దుర్లు వచ్చి విపరీతమైన మంట వస్తుంది. దోమలను తరిమికొట్టేందుకు లివ్విడ్లు, మస్కిటో కాయిన్స్ ఎన్నో వాడుతుంటారు. అయితే దోమకాటు నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు మలేరియాను ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


మలేరియా అంటే ఏమిటి?


మలేరియా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది ప్రాణాంతక వ్యాధి. మన దేశంలో మలేరియా సర్వసాధారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉండే పిల్లలు, గర్భిణీలు, ప్రయాణీకులు, హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ ఉన్న వ్యక్తులు మలేరియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఐదు పరాన్న జీవి జాతులకు చెందిన దోమలు మానవులలో మలేరియాకు కారణం అవుతాయి. ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం వైవాక్స్ ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఆఫ్రికా, ఆగ్నేయాసియా, తూర్పు మధ్యధరా, పశ్చిమ పసిఫిక్, అమెరికాలో మలేరియా కేసులు భారీగా పెరగడంతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 


మలేరియా ఎలా వ్యాపిస్తుంది?


మలేరియా అంటువ్యాధి కాదు. ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించదు. మలేరియాను నివారించడానికి ఏకైక మార్గం దోమలను నివారించడం. ఆడ అనాఫిలిస్ దోమ కాటు మలేరియాకు దారితీస్తుందని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. అలాగే, మలేరియా సోకిన రోగి నుంచి రక్తం ఎక్కించడం లేదా కలుషితమైన సూదులు లేదా సిరంజిలను ఉపయోగించడం వల్ల మలేరియా వస్తుంది. మలేరియా సోకిన వ్యక్తికి సరిగ్గా చేయనట్లయితే.. ఆ వ్యక్తిని కుట్టిన దోమకు మలేరియా వ్యాపిస్తుంది. ఈ దోమ మరో వ్యక్తి కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. 


మలేరియా లక్షణాలు:


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జ్వరం, చలి, చెమట, తలనొప్పి, బలహీనతను మలేరియా లక్షణాలుగా పేర్కొంది. ఇది వైరల్ ఫీవర్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇది అసాధారణ స్థాయికి చేరి స్పృహ, తీవ్రమైన రక్తహీనత, మూత్రపిండ వైఫల్యం, బహుళ వ్యవస్థ వైఫల్యానికి దారి తీస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, దగ్గు కూడా ఇతర మలేరియా లక్షణాలతో పాటుగా ఉంటుందని పేర్కొంది.  


మలేరియాను ఎలా నివారించాలి?


మలేరియాను అరికట్టడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 


1. మలేరియా మందులు లేదా యాంటీమలేరియల్ మందులు:


మీరు ఇతర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నట్లయితే మీ వెంట మలేరియా మందులను తీసుకెళ్లడం వ్యాధిని నివారించడానికి ఒక మార్గమని సీడీసీ పేర్కొంది. డాక్టర్ సూచించిన మందులను వాడటం మంచిది. 


2. శరీరాన్ని కవర్ చేసే దుస్తులు:


వర్షాకాలంలో శరీరాన్ని కవర్ చేసే దుస్తువులను వేసుకోవడం బెటర్. ఎందుకంటే శరీరం బయటకు కనిపిస్తే దోమలు అటాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లాంగ్ స్లీవ్స్, ప్యాంట్స్ దోమల బారి నుంచి కాపాడుతాయి. బీఏంజే ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం ప్యాంటు, పొడవాటి చేతులున్న చొక్కాలు ధరించే వారికి మలేరియా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉంటుందని పేర్కొంది. 


3. దుస్తులు, వస్తువులను పెర్మెత్రిన్‌తో స్ప్రే చేయడం:


సిడిసి ప్రకారం , 0.5 శాతం పెర్‌మెత్రిన్‌ని దుస్తులతో పాటు బూట్‌లు, టెంట్లు వంటి ఇతర వస్తువులను చికిత్స చేయడానికి ఉపయోగించడం వల్ల మలేరియాను నిరోధించవచ్చు. పెర్మెత్రిన్ అనేది దోమలను తిప్పికొట్టి, చంపే ఒక పురుగు మందు. బట్టలపై పెర్మెత్రిన్‌తో పదేపదే స్ప్రే చేసినప్పుడు, అవి రక్షణగా ఉంటాయి. దీన్ని నేరుగా చర్మంపై ఉపయోగించకుండా చూసుకోండి.



5. ఈ విషయం తప్పనిసరి:


 మీరు ప్రయాణాలు చేస్తుంటే, మలేరియా ఎలా వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ కిటికీలు,తలుపులు మూసి ఉంచడం వలన దోమలు మీవైపు రావు.  దోమతెర కింద పడుకోవడం కూడా సురక్షితం. 


Also Read: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి