Mobile Addiction in Kids During Summer : వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. ఈ సమయంలో పేరెంట్స్ బిజీగా ఉండడం లేదా పిల్లల అల్లరిని దూరం చేసేందుకు వారికి మొబైల్స్ ఇస్తూ ఉంటారు. దీంతో వారు తినేందుకు, ఆడుకునేందుకు, టైమ్ పాస్ చేసేందుకు మొబైల్ చూస్తూ ఉంటారు. అవి క్రమేణా వారికి అడిక్షన్​గా మారిపోతాయి. తర్వాత ఈ అలవాటు తగ్గించడం కష్టంగా మారుతుంది. అంతేకాకుండా పిల్లల్లో కంటి సమస్యలు, నిద్రలేమి, అలసటం, ఫోకస్ చేయలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పిల్లలు ఫోన్స్, టాబ్లెట్స్, టీవీకి అలవాటు పడకుండా తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో.. ఆ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

పిల్లల్లో ఫోన్ అడిక్షన్ వల్ల వచ్చే సమస్యలు

పిల్లలకు ఫోన్ ఎక్కువగా అలవాటు అయితే శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తాయి. కంటి చూపు తగ్గడం నుంచి నిద్ర సమస్యలు పెరుగుతాయి. చిరాకు, కోపంతో పాటు.. చదువుపై దృష్టి పూర్తిగా తగ్గుతుంది. శారీరకంగా చురుకుగా ఉండరు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ అలవాటు కాకుండా కొన్ని ముఖ్యమైన టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే..

స్క్రీన్ టైమ్‌కు లిమిట్ 

పిల్లలను పూర్తిగా స్క్రీన్​కు దూరం చేయడం కాకుండా.. రోజుకు 1 లేదా 2 గంటలకంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇవ్వకుండా కంట్రోల్ చేయాలి. ఈ స్క్రీన్ టైమ్ కావాలంటే వారు కొన్ని టాస్క్​లు కంప్లీట్ చేయాలని చెప్పండి. రివార్డ్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. అలాగే ఫోన్ వాడే సమయాన్ని ఫిక్స్ చేయండి. నిర్దిష్ట సమయంలో మాత్రమే ఫోన్ ఇస్తామని చెప్పండి. 

Continues below advertisement

రోల్ మోడల్ మీరే.. 

మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడకుండా ఉండాలంటే.. ముందుగా మీరు దానిని వినియోగించడం తగ్గించండి. పిల్లల్ని ఫోన్ వాడొద్దని.. మీరు వాడుతూ ఉంటే.. పిల్లలకి కూడా వాడాలనే కోరిక పెరుగుతుంది. కాబట్టి మీరు పిల్లల ముందు ఫోన్ వాడడం తగ్గిస్తే మంచిది. 

ఫ్యామిలీ టైమ్ 

పిల్లలతో వీలైనంత టైమ్ స్పెండ్ చేయండి. కలిసి గేమ్స్ ఆడటం, మాట్లాడటం, కథలు చెప్పడం వంటివి చేయాలి. ఫ్యామిలీ టైమ్ అనేది స్క్రీన్​ టైమ్​ని దూరం చేయడంతో పాటు.. మీ మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. 

బెస్ట్ యాక్టివిటీలు

సమ్మర్లో పిల్లలను అవుట్‌డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సాహించండి. దీంతో వారికి మంచి యాక్టివిటీ ఉండడంతో పాటు.. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురికాకుండా చేస్తుంది. క్రికెట్, సైక్లింగ్, బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడిస్తే మంచిది. డ్యాన్స్, మ్యూజిక్, యోగా వంటివి కూడా చేయించవచ్చు.

క్రియేటివ్ యాక్టివిటీస్

పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీలతో పాటు.. బ్రెయిన్​ని పదును చేసే యాక్టివిటీలు చేయించాలి. డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ వర్క్ వంటివి పిల్లల్లో క్రియేటివిటీని పెంచుతాయి. అలాగే కథల పుస్తకాలు చదివించండి.

ఇంటి పనులు.. 

మీరు ఇంటి పనులు చేస్తుంటే పిల్లలు కూడా ఆ పనుల్లో ఇన్​వాల్వ్ అయ్యేలా ప్రోత్సాహించండి. కిచెన్​లో హెల్ప్ చేయడం, గార్డెనింగ్ చేయించడం వంటివి చేయాలి. 

పిల్లలను పూర్తిగా ఫోన్ వినియోగాని​కి దూరంగా ఉంచకుండా స్మార్ట్ యూజ్ నేర్పాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం టైమ్ స్పెండ్ చేస్తే.. అడిక్షన్ తగ్గుతుంది. స్మార్ట్​గా ప్లాన్ చేస్తే.. పిల్లలు ఫోన్​ వినియోగానికి కచ్చితంగా దూరమవుతారు.