మీరు తీసుకుంటున్న ఆహారం, జీర్ణవ్యవస్థ పనితీరు, జీర్ణవ్యవస్థలోని అవయవాల ఆరోగ్యం ఇలా అనేక అంశాలను గురించి అది వివరిస్తుంది. మల విసర్జన ప్రక్రియ కానీ లేదా రంగు కానీ సాధారణంగా లేదు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.


ఏ రంగులో ఉండాలి?


ఆరోగ్యవంతుల మలం గోధుమ రంగులో ఉంటుంది. కానీ కొన్ని సార్లు తీసుకున్న ఆహారం, అది జీర్ణమయ్యేందుకు పట్టిన సమయాన్ని బట్టి రంగులో చిన్నచిన్న తేడాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు బీట్ రూట్ తిన్నపుడు మలం కూడా కొద్దిపాటి ఎరుపు లేదా గులాబి రంగులో ఉండొచ్చు. ఇలాంటి సందర్భాలను మినహాయించవచ్చు.


ముదురు రంగు లేదా నలుపులో మల విసర్జన ఉంటే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. మల విసర్జన నల్లపు రంగులో ఉంటే జీర్ణవ్యవస్థలోపల ఏదో ఒక భాగంలో రక్త స్రావం అవుతున్నట్టు భావించాలి. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.


మల విసర్జన పసుపు రంగులో అవుతుంటే ఆహారంలో ఏదైన పసుపు పచ్చని ఆహారం ఉండి ఉండవచ్చు. లేదా సియోలియాక్ డిసీజ్ వల్ల కూడా కావచ్చు. ఈ వ్యాధి ఉన్నపుడు గోధుమలు, బార్లీ వంటి వాటిలో ఉండే గ్లుటేన్ సరిగ్గా జీర్ణం చేసుకోలేదు. ఈ సమస్య ఉన్నవారిలో రొటి, పాస్తా, కుకీల వంటి గ్లుటేన్ కలిగిన ఆహారాన్ని తీసుకున్నపుడు జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచెయ్యదు. ఇలాంటి ఆహారం తీసుకున్నపుడు పసుపురంగు మల విసర్జన అవుతుంటే డాక్టర్ ను సంప్రదించడం అవసరం.


జీర్ణవ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ కు కారణమయ్యే వ్యాధి పేరు క్రోన్స్ డిసీజ్. చాలామందిలో ఐబిడీ అనే ఇన్ఫ్లమేటరీ బవేల్ డిసీజ్ అనే పరిస్థితికి క్రోన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కోలైటిస్ కారణం. దీని వల్ల కూడా మల విసర్జన పసుపు రంగులో అవుతుంది.


మల విసర్జన ఆకుపచ్చగా కావడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇది ప్రతిసారీ అంత ప్రమాదకరం కాకపోవచ్చు. ఆహారంలో బ్రొకోలి, బచ్చలి, తోటకూర వంటి ఆకుకూరల వల్ల కూడా కావచ్చు. లేదా బ్లూబెర్రీ వంటి ముదురు రంగు ఆహారపదార్థాల వల్ల కూడా కావచ్చు. ఇది మీ లివర్, పాంక్రియాస్ బాగా పనిచేస్తున్నాయని అనేందుకు నిదర్శనం కూడా.


అయితే ఒక్కోసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మలవిసర్జన ఆకుపచ్చగా ఉండొచ్చు. విరేచనాలు అవుతుంటే అప్పుడు మల విసర్జన ఆకుపచ్చగా ఉంటే గియార్డియా లదా నోరోవైరస్ వంటి గట్ బగ్ కారణం కావచ్చు. కొన్ని యాంటీ బయాటిక్స్, కాంట్రాసెప్టివ్ పిల్స్, ఐరన్ సప్లిమెంట్ల వల్ల కూడా ఇలా జరగవచ్చు.


ముదురు ఎరుపు రంగులో మల విసర్జన జరుగుతుంటే మలంలో రక్తం పడుతోందని అర్థం. ఇది క్యాన్సర్ కు కారణం కావచ్చు. ఎలాంటి సంకేతం లేకుండా మలంలో రక్తం పడితే తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఒక్కోసారి హెమరాయిడ్స్, పైల్స్ వంటి సాధారణ కారణాలతో కూడా మలంలో రక్తం పడవచ్చు. ఈ సమస్యల్లో మలద్వారం వద్ద ఉన్న రక్తనాళాల్లో వాపు రావడం, దురద వంటి లక్షణాలు ఉంటాయి. వీటి వల్ల ప్రతి సారీ నొప్పి ఉండకపోవచ్చు. కానీ చాలా అసౌకర్యంగా ఉంటాయి. ఇది కొనసాగితే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.


Also read: ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీళ్లను తాగుతున్నారా? గుండెపై అది చూపే ప్రభావం ఎక్కువ


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.