Simple Tricks to Keep Pigeons Away : వేసవి వచ్చిందంటే అపార్ట్‌మెంట్స్‌లో ఉండేవారికి ఒక కామన్ సమస్య మొదలవుతుంది. అదే పావురాల బెడద. సిటీల్లో ఉండేవారికి ఇది సమ్మర్లో వచ్చే ఇష్యూల్లో ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే వేసవిలో పావురాలు బాల్కనీ, కిటికీలు, ఏసీ దగ్గర గూళ్లు పెట్టుకుంటాయి. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో ఇవి సేఫ్ ప్లేస్‌గా భావించి త్వరగా గూళ్లు కట్టేస్తాయి.
మొదట్లో ఇవి పెద్ద సమస్యలా అనిపించకపోయినా.. కొద్ది రోజుల్లోనే పావురాల మురికి, వాటి రెక్కలు, గూళ్లు ఇబ్బంది పెడతాయి. బ్యాడ్ స్మెల్ వస్తాయి. పావురాల విసర్జన వల్ల బ్యాక్టీరియా వ్యాపించి అలర్జీలు, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మరి పావురాలను హానిచేయకుండా.. ఇంట్లో గూళ్లు పెట్టకుండా దూరంగా ఉంచే సింపుల్ చిట్కాలు ఏమిటో చూసేద్దాం.
బర్డ్ నెట్
బాల్కనీకి నెట్ వేయడం చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్. దీనివల్ల పావురాలు లోపలికి రాకుండా ఉంటాయి. అన్ని ఓపెన్ ఏరియాలు కవర్ అయ్యేలా సెట్ చేసుకోండి.
రిఫ్లెక్టివ్ వస్తువులు
పావురాలు మెరిసే వస్తువులను చూసి భయపడతాయి కాబట్టి మీరు బాల్కనీలు, విండోల దగ్గర మెరిసే వస్తువులు ఉంచండి. పాత CDలు, అల్యూమినియం ఫాయిల్, రిఫ్లెక్టివ్ టేప్ వంటివి వేలాడదీయవచ్చు. ఇవి కదిలితే కాంతి ప్రతిబింబం ఏర్పడి పావురాలు దగ్గరకు రావు.
స్పైక్స్
విండో సిల్స్, రైలింగ్స్, ఏసీ యూనిట్స్‌పై బర్డ్ స్పైక్స్ పెట్టండి. ఇవి పావురాలకు హాని చేయవు. కానీ అక్కడ సెటిల్ అవ్వకుండా చేస్తాయి.
శుభ్రత
పావురాలు తరచుగా ఆహారం కోసం వస్తాయి. కాబట్టి బాల్కనీ ఎప్పుడూ క్లీన్‌గా ఉంచండి. ఆహారానికి సంబంధించినవి ఉండకండి. అలాగే పావురాలకు ఫుడ్ పెట్టకండి. ఒకసారి పెడితే అవి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
ఘాటైన వాసనలు
పావురాలు కొన్ని వాసనలను ఇష్టపడవు. కాబట్టి వెనిగర్, వెల్లుల్లి, ఎసెన్షియల్ ఆయిల్స్ మిక్స్ చేసి స్ప్రే చేయండి. తరచూ రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆ ప్రదేశాలు బ్లాక్ చేయండి
కార్నర్స్, కుండీలు, ఖాళీ ప్రదేశాలు లేకుండా చెక్ చేయండి. పావురాలు గూళ్లు కట్టే అవకాశాన్ని ముందే తొలగించండి.
పావురాలు నగర జీవనంలో భాగమే అయినా.. అవి మీ ఇంటిని ఆక్రమించాల్సిన అవసరం లేదని గుర్తించుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దలు ఉన్నప్పుడు వీటిని దగ్గరికి రానివ్వకూడదు. కాబట్టి ఈ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. వీటిని ఒక్కసారి చేస్తే సరిపోదు. రెగ్యులర్‌గా ఫాలో అయితే మీ ఇల్లు క్లీన్‌గా, హెల్తీగా ఉంటుంది.
