Parenting Tips to Bridge the Gap : ఒక వయసు వచ్చాక పేరెంట్స్​కి, పిల్లలకి తెలియకుండానే గ్యాప్ వచ్చేస్తుంది. కాలేజ్ వయసుకు వచ్చేసరికి పిల్లలు తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు. పేరెంట్స్ ఏమైనా సూచిస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే పిల్లలు పేరెంట్స్ మాటకి ఎదురు చెప్తున్నారు. పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో స్కూలింగ్ నుంచే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. 

పేరెంట్స్, పిల్లల మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే ఓ సింపుల్ టెక్నిక్ ఫాలో అయిపోండి. అదేంటంటే.. మీ పిల్లల వయసును బట్టి మీరు వారికి అనుగుణంగా మౌల్డ్ అయ్యేలా చూసుకోండి. చిన్న వయసునుంచి.. పిల్లలకు ఒక వయసు వచ్చేవరకు తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలకు 7 ఏళ్లు వచ్చేవరకు.. 

పిల్లలు పుట్టినప్పటినుంచి 7 ఏళ్లు వచ్చేవరకు తల్లిదండ్రులు వారికి పనివారిలా పని చేయాలట. వారికి అవసరమైనవన్నీ దగ్గరుండి చూసుకోవాలి. వారికి దగ్గరగా ఉంటూ వారి అవసరాలు తెలుసుకోవాలి. వారికి కావాల్సినవి చేసి పెడుతూ వారిని జాగ్రత్తగా పెంచాలి.

7 నుంచి 14 ఏళ్ల వరకు.. 

ఈ వయసు పిల్లలకు పేరెంట్స్ పనులు చెప్తూ ఉండాలట. అంటే గారాభం చేయకుండా.. వారితో చిన్న చిన్న ఇంటి పనులు నేర్పిస్తూ ఉండాలట. బేసిక్ కుకింగ్ స్కిల్స్, రూమ్ నీట్​గా ఉంచుకోవడం, వారి బుక్స్ వాళ్లే సర్దుకోవడం, బట్టలు మడతపెట్టుకోవడం, ఫుడ్ సర్వ్ చేయడం, డిషెష్ క్లీన్ చేయడం వంటివి అమ్మాయి, అబ్బాయి తేడా లేకుండా వారికి ఒక్కొక్కటిగా అలవాటు చేస్తూ ఉండాలి. 

14 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు.. 

టీనేజ్​ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో వారిని బుజ్జగిస్తూనో.. తిడుతూనే కాకుండా వారికి పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్​గా ఉండాలి. అవును ఈ ఏజ్​లో పిల్లలకు పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్​లా ఉంటే కిడ్స్​ కెరీర్​కు, పర్సనల్​ గ్రోత్​కు మంచిది. వారు తప్పు చేసినా మీ దగ్గరకొచ్చి చెప్పుకునేలా మీరు బిహేవ్ చేస్తే మంచిది. వారు ఏది చెప్పినా ఫస్ట్ వాళ్లని జడ్జ్ చేయకుండా దానిలోని తప్పులు ఏంటో వివరించి చెప్పడం మంచిది. అప్పుడే వారు మీ దగ్గర ఏదైనా ఓపెన్​గా చెప్తారు. 

అతిపెద్ద మిస్టేక్.. 

పిల్లలు ఏదైనా తమకి నచ్చని పని చేసినా.. తమ మాటకు ఎదురు చెప్పినా.. పేరెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి అంటే సైలెంట్ ట్రీట్​మెంట్. ఇది పెద్దలమధ్య మంచిది కానీ.. పిల్లలకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు పిల్లలే వచ్చి మాట్లాడాలని.. తప్పు ఒప్పుకోవాలని ఎలా కోరుకుంటారో.. పిల్లల్లో కూడా అదే తరహా కోపం పెరిగిపోయే అవకాశం ఎక్కువ. 

అంతేకాకుండా ఇది వారిలో ఒకరకమైన ట్రోమాను క్రియేట్ చేస్తుంది. పైగా ఇలా వచ్చిన గ్యాప్​ వల్ల పిల్లలు మీతో పూర్తిగా తమ విషయాలు చెప్పడం మానేస్తారు లేదా చెప్పడానికి భయపడతారు. అది ఇంకా ఇబ్బందులకు దారి తీస్తుంది. కాబట్టి పిల్లలతో మీరు మాట్లాడేందుకు.. వారికి అందుబాటులో ఉండేందుకు ట్రై చేయండి. మీ బిజీ లైఫ్​లో వారికి కాస్త టైమ్​ని ఇవ్వండి. పిల్లలతో మీరు ఎంత దగ్గరగా ఉంటే మీతో బాండింగ్ అంత మంచిగా ఉంటుంది. అలాగని వారికి ఊపిరి ఆడనివ్వంత కాదు.. ఫ్రీడమ్​ని ఇస్తూనే దగ్గరగా ఉండాలి.