బరువు తగ్గాలనుకున్న, జీర్ణక్రియ మెరుగుపడాలన్న, డయాబెటిస్ అదుపులో ఉండాలన్న మనం సాధారణంగా తీసుకునే పండు బొప్పాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. అందుకే దీన్ని తినడానికి అందరూ ఇష్టపడతారు. బొప్పాయితో ఎన్నో లాభాలు ఉన్నాయి. దీని ద్వారా మనకి విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. కానీ ఒక్కోసారి మనం తినే ఫ్రూట్ విషంగా కూడా మారుతుందని మీకు తెలుసా?


బొప్పాయిలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, ఎ, ఇ, బి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజు మనం తీసుకునే ఆహారంలో బొప్పాయి ఉండేలా చూసుకుంటే చాలా మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే పపైన్  అనే ఎంజైమ్ మనకి వచ్చే ఎలర్జీలతో పోరాడేందుకు, గాయాలు నయం కావడానికి  సహాయపడుతుంది. కానీ వేరే పదార్థాలతో కలిపి ఈ బొప్పాయిని తీసుకుంటే అది విషపూరితంగా కూడా మారుతుంది.


నిమ్మరసంతో డేంజర్..


బొప్పాయి సలాడ్ తీసుకునేటప్పుడు దాంట్లో లెమన్ జ్యూస్ కలిపారంటే అది ఆరోగ్యానికి చాలా హానికరం. అవి రెండు కలిస్తే విషంగా మారుతుంది. లెమన్, బొప్పాయి కలిపి తీసుకోవడం వల్ల అనీమియాతో పాటు హిమోగ్లోబిన్ అసమతుల్యత ఏర్పడుతుంది. అది పెద్దవాళ్ళకే కాదు పిల్లలకి కూడా ప్రమాదం. ఇటువంటి కాంబినేషన్ తీసుకోకపోవడమే ఉత్తమం.


మూడు ముక్కలే మేలు....


మితంగా తింటే ఆరోగ్యం.. అది అమితంగా తింటే హానికరం అని పెద్దలు ఊరికే అనరు. అది బొప్పాయి విషయంలో నూటికి నూరు శాతం నిజం. ఒక చిన్న కప్పు లేదా మూడు చిన్న ముక్కలు బొప్పాయి తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. మోతాదుకు మించి తీసుకుంటే  అది ఆరోగ్యానికి చెడు చేస్తుంది. అందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ వల్ల తల తిరగడం, తలనొప్పి, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అందుకని బొప్పాయి తినేముందు తప్పనిసరిగా ఈ విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలి.


గర్భవతులు తినకూడదు..


పచ్చి బొప్పాయి గర్భవతులు అస్సలు తినకూడదు. దాని వల్ల గర్భస్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ బాగా పండిన బొప్పాయి గర్బిణిలు తీసుకుంటే  వారి ఆరోగ్యానికి చాలా మంచిది.


హృద్రోగులు దూరం


గుండె సంబందించిన సమస్యలు ఉన్నవాళ్ళు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది. ఇందులో ఉండే పపైన ఎంజైమ్ హార్ట్ బీట్ మందగించేలా చేస్తుంది. గుండె ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు వైద్యులను సంప్రదించకుండా బొప్పాయి తినకూడదు.