Protein-Rich Paneer Vegetable Rice : బరువు తగ్గాలి.. అలాగే నోరూరించే ఫుడ్ తినాలి. డైట్లో క్రేవింగ్స్ తట్టుకోలేక ఒకేసారి ఎక్కువ తినేసి చాలామంది రిగ్రేట్ అవుతుంటారు. కానీ కరెక్ట్​గా ప్లాన్ చేసేకుంటే డైట్​కి తగ్గట్లు నోరూరించే టేస్టీ రెసిపీలు ఎన్నో చేసుకోవచ్చు. అలాంటి వాటిలో పనీర్, వెజిటెబుల్స్ రైస్ ఒకటి. దీనిని చాలా తక్కువ సమయంలో.. బ్యాలెన్స్ డైట్​లో భాగంగా కుక్ చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేసుకోవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

పనీర్ వెజిటెబుల్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం - 70 గ్రాములు

క్యారెట్ - 2

Continues below advertisement

పనీర్ - 200 గ్రాములు

పచ్చి బఠాణీ - 100 గ్రాములు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్ 

Also Read : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!

ఉప్పు - రుచికి తగినంత

బ్లాక్ పెప్పర్ - చిటికెడు

పచ్చిమిర్చి - 1

నీళ్లు - 150 ml

నెయ్యి - 1 టీస్పూన్

రైతా కోసం

పెరుగు - 150 గ్రాములు

కీరదోస - 30 గ్రాములు

సాల్ట్, పెప్పర్, కారం, జీలకర్ర పొడి

దానిమ్మ - 30 గ్రాములు

పచ్చిమిర్చి - 1

పుదీనా ఆకులు - కొన్ని

Also Read : కరివేపాకు రైస్ రెసిపీ.. మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా టేస్టీగా చేసేయండి

తయారీ విధానం

ముందుగా కాసేపు బియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె లేదా కుక్కర్లో బియ్యం వేసి దానిలో క్యారెట్ ముక్కలు, పనీర్, పచ్చి బఠాణీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్, పచ్చిమిర్చి ముక్కలు, నీళ్లు, నెయ్యి వేసి బాగా కలిపి.. మూత పెట్టి ఉడికించాలి. కుక్కర్ విజిల్ వచ్చాక తీస్తే నోరూరించే వెజిటేబుల్, పనీర్ రైస్ రెడీ. దీనిలోకి కూర చేసుకోవాలని లేకపోతే.. పెరుగుతో టేస్టీగా రైతా చేసుకోవచ్చు. 

పెరుగు తీసుకుని బాగా కలిపి దానిలో కీరదోస ముక్కలు, సాల్ట్, పెప్పర్, కారం, జీలకర్ర పొడి, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులు వేసి కలపాలి. అంతే టేస్టీ, సింపుల్ రైతా రెడీ. దీనిని రైస్తో కలిపి తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. దీనిని లంచ్ బాక్స్​లో పెట్టుకుని తీసుకుని వెళ్లేందుకు బెస్ట్ ఆప్షన్. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలామంది ఫుడ్ అవుతుంది. అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని హాయిగా తీసుకోవచ్చు.  

Also Read : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే

పనీర్​తో ప్రోటీన్, బఠాణీలు, కూరగాయలతో ఫైబర్ అందుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఇతర ఫుడ్స్ డైట్లో చేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా దీనిని చేయడానికి ఎక్కువ సమయం అవసరం ఉండదు. తక్కువ సమయంలో ఈజీగా, డైట్​కి తగ్గట్లు రైస్ ప్రిపేర్ చేసుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 

Also Read : క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది