Hydrogen Cooking Stove : అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. కేంద్రం ఇబ్బంది లేదని చెప్తోన్నా.. చాలామంది గ్యాస్ అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండక్షన్, ఒవెన్ అంటూ కొన్ని పరికరాలకు డిమాండ్ పెరిగింది. అలాగే కొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి వాటిలో ఒక భారతీయ సంస్థ.. విప్లవాత్మకంగా హైడ్రోజన్ కుకింగ్ స్టౌవ్‌ను డెవెలప్ చేసింది. ఈ స్టౌవ్ గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండానే.. నీరు, కరెంట్​తో పని చేస్తుంది. 

Continues below advertisement

హైడ్రోజన్ స్టౌవ్ ప్రత్యేకత?

ఈ హైడ్రోజన్ కుకింగ్ స్టౌవ్‌ను ప్లగ్ అండ్ ప్లే మోడల్‌గా రూపొందించారు. అంటే సాధారణంగా మనం స్టౌవ్ ఉపయోగించే విధంగానే దీనిని కూడా సులభంగా వాడుకోవచ్చు. ఇది 100% గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో టేబుల్‌టాప్ యూనిట్ తయారు చేయగా.. రెండు బర్నర్లతో వస్తుంది. మాన్యువల్ ఇగ్నిషన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ క్రేజీ, యునిక్ స్టౌవ్‌ను భారతీయ సంస్థ Greenvize అభివృద్ధి చేసింది.

హైడ్రోజన్ స్టౌవ్ ఎలా పనిచేస్తుందంటే..

ఈ స్టౌవ్‌లో ప్రత్యేకంగా PEM (Proton Exchange Membrane) ఎలక్ట్రోలైజర్ అమర్చారు. ఇది నీటిని అక్కడికక్కడే విడగొట్టి హైడ్రోజన్‌ను తయారు చేస్తుంది. అలాగే ఒక్క యూనిట్‌కు కేవలం 100 ml డిస్టిల్ లేదా RO నీరు, సుమారు 1 kWh విద్యుత్ అవసరం అవుతుంది. ఇవి ఉపయోగించి దాదాపు 6 గంటల పాటు వంట చేసుకోవచ్చు.

Continues below advertisement

ఇండక్షన్ స్టౌవ్‌తో పోలిస్తే..

ఇండక్షన్ స్టౌవ్ ఒక్క బర్నర్‌కు 1.5–2 kW విద్యుత్ ఉపయోగిస్తుంది. హైడ్రోజన్ స్టౌవ్ మాత్రం తక్కువ విద్యుత్తుతో ఎక్కువ సమయం పనిచేస్తుంది. ఇండక్షన్‌కు ప్రత్యేక పాత్రలు అవసరం. హైడ్రోజన్ స్టౌవ్‌ ఉపయోగిస్తే.. ఏ పాత్రలైనా పర్లేదు. 

పర్యావరణానికి మంచిదేనా?

ఈ స్టౌవ్ ప్రధాన USP ఏంటంటే.. దీనినుంచి ఎలాంటి కార్బన్ ఉద్గారాలు ఉండవు. కార్బన్ మోనాక్సైడ్, పొగ ఉండదు. కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. అంటే ఇది పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీ కుకింగ్ సొల్యూషన్ అనమాట. ప్రస్తుతం ఈ స్టౌవ్‌ను కమ్యూనిటీ కిచెన్స్, క్యాంటీన్లు, గవర్నమెంట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కిచెన్స్​లో టెస్ట్ చేస్తున్నారు. ఇంటి వాడకానికి కూడా అనుకూలమే కానీ ఇంకా అది ప్రారంభ దశలోనే ఉంది.

హైడ్రోజన్ కుకింగ్ స్టౌవ్ ధర

ఈ హైడ్రోజన్ స్టౌవ్ సుమారు 1,50,000. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, కొత్త ఎనర్జీ సిస్టమ్ ఉపయోగించడం వల్ల ప్రొడక్షన్ ఇంకా పెద్ద స్థాయిలో ప్రారంభం కాలేదు. అందుకే ప్రస్తుతం ఇది సాధారణ కుటుంబాలకు కాకుండా కమర్షియల్ యూజ్‌కే ఎక్కువగా ప్రాధన్యత ఇస్తున్నారు. టెస్ట్​ల్లో సక్సెస్ అయితే.. ఇది వంట ప్రపంచంలో ఒక పెద్ద మార్పుకు నాంది అవుతుంది.