Zero Day RAT Spyware : ఇటీవల ఒక కొత్త స్పైవేర్ మొబైల్ వినియోగదారుల నిద్రను దూరం చేసింది. గత కొన్ని సంవత్సరాలలో ఇది అత్యంత ప్రమాదకరమైన స్పైవేర్‌గా పరిగణిస్తున్నారు. దీని సహాయంతో పరికరం ప్రతి విషయాన్ని ట్రాక్ చేయవచ్చు. ZeroDayRAT అనే ఈ స్పైవేర్ హ్యాకర్లకు వినియోగదారుడి ఫోన్ కెమెరా, మైక్రోఫోన్‌తో పాటు నోటిఫికేషన్‌లు, సందేశాలతో సహా ఇతర విషయాలను కూడా యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. దీనికంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. Android వినియోగదారులు సురక్షితంగా లేరు. అలాగే iPhone వినియోగదారులు కూడా సురక్షితంగా లేరు. అన్ని మొబైల్ పరికరాలకు ఇది ప్రమాదంగా చెప్తున్నారు.
హ్యాకర్ వద్దకు మొత్తం డేటాను పంపేస్తుందట
ఈ స్పైవేర్ చాలా ప్రమాదకరమైనది. ఇది యూజర్ మొత్తం డేటాను హ్యాకర్లకు పంపుతుంది. ఫోన్లో ఇన్‌స్టాల్ చేయగానే.. ఇది డేటాను ప్రసారం చేయడం ప్రారంభిస్తుంది. దీని ద్వారా హ్యాకర్లు మీ ఫోన్‌లో వస్తున్న నోటిఫికేషన్‌లు, GPS లొకేషన్, ఇన్‌బాక్స్ సందేశాలు, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ, లాక్ అన్నింటినీ చూడగలరు. ప్రసారం అవుతున్న డేటా సహాయంతో.. మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారో, ఏ నెట్‌వర్క్‌లో యాక్టివ్‌గా ఉన్నారో కూడా అటాకర్లు చూడగలరు.
Telegramలో అమ్ముడవుతోన్న స్పైవేర్
ఈ స్పైవేర్ దాని సామర్థ్యాలతో పాటు అనేక ఇతర కారణాల వల్ల ఆందోళన కలిగిస్తుంది. మొదటిది ఏమిటంటే.. దీన్ని ఉపయోగించడానికి సాంకేతిక నైపుణ్యం అవసరం లేదు. రెండవది ఈ స్పైవేర్‌ను Telegram వంటి ప్లాట్‌ఫారమ్‌లలో బహిరంగంగా విక్రయిస్తున్నట్లు కూడా నివేదికలు ఉన్నాయి. ఇది దాని పరిధిని మరింత పెంచుతుంది. ఎవరైనా దీన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నారు.
స్పైవేర్ నుంచి తప్పించుకోవడానికి ఏమి చేయాలి?
ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో స్పైవేర్, మాల్వేర్ చాలానే వచ్చాయి. దీని నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. అటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి.. తెలియని సైట్ నుంచి వచ్చిన లింక్‌పై క్లిక్ చేయవద్దు. అదేవిధంగా ఏదైనా Third Party యాప్, లింక్లు డౌన్‌లోడ్ చేయవద్దు. ఎల్లప్పుడూ Google Play Store లేదా Apple App Store నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి.
