National Youth Day Wishes : యువతలో శాశ్వతమైన శక్తిని సృష్టించి.. స్వామి వివేకానంద ఆలోచనా విధానం గురించి చెప్తూ.. దేశాభివృద్ధికి పెద్దపీట వేసేలా ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన నేషనల్ యూత్ డే నిర్వహిస్తున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. ఆయన ఆలోచనల పట్ల దేశంలోని యువకులందరినీ ప్రేరేపించడానికి జాతీయ యువజన దినోత్సవం చేస్తున్నారు. 


స్వామి వివేకానంద (Swamy Vivekananda) 1863లో జనవరి 12వ తేదీన కోల్​కతాలో జన్మించారు. ఆయన ఉపన్యాసాలు, రచనలు, లేఖలు, కవితలు భారతదేశంలోనే కాకుండా.. మొత్తం ప్రపంచంలోని యువతను ప్రేరేపించాయి. స్వామి వివేకానంద తత్వాలు, బోధనలు, ఆలోచనలు భారతదేశానికి ఆయన ఇచ్చిన గొప్ప సాంస్కృతిక సంపదగా చెప్పవచ్చు. అందుకే ఆయన జయంతిని పురస్కరించుకుని నేషనల్ యూత్ డే చేస్తున్నారు. 
జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా దేశంలోని విద్యాసంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వేడుకలు నిర్వహిస్తాయి. వినూత్న ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు రావడానికి ప్రేరణనిస్తూ ఈ కార్యక్రమాలు వేదిక అవుతున్నాయి. అయితే యూత్​ డే గురించి అవగాహన కల్పిస్తూ.. మీ కుటుంబం, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు వాట్సాప్​ ద్వారా ఎలాంటి సందేశాలు, కోట్స్, శుభాకాంక్షలు పంపవచ్చో ఇప్పుడు చుద్దాం.


"దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలోని యువతకు, దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వారి ఆలోచన విధానాలకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు."


"మీలోని శక్తి, ఆలోచనలు, పనులు రేపటి అభివృద్దిని చూపిస్తున్నాయి. మీరు ఇలాగే ప్రకాశవంతంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ.. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు." 


"యువత ఏదైనా పనిలో చేస్తూ.. దానిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తే.. ఉత్పత్తి మెరుగ్గా, మరింత క్రియేటివ్​గా ఉంటుంది. మీరు కూడా అలా నిమగ్నమవ్వాలని కోరుకుంటూ హ్యాపీ నేషనల్ యూత్ డే."


"మీ జీవితంలో రిస్క్​లు తీసుకోండి. మీరు గెలిస్తే మీరు నాయకత్వం వహించవచ్చు. ఓడిపోతే మార్గనిర్దేశం చేయవచ్చు. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు."


"మీ లక్ష్యాన్ని చేరుకునేవరకు మీ పోరాటాన్ని ఆపకండి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మీకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు."


"జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువ శక్తులకు, యువ మనస్సులకు చీర్స్ చెప్తూ.. హ్యాపీ నేషనల్ యూత్ డే."


"దేశంలోని యువశక్తికి ఎల్లప్పుడూ విలువనివ్వాలని గుర్తుచేస్తూ.. జాతీయ యువజన దినోత్సవం శుభాకాంక్షలు."


"యువకులరా మీ సమయాన్ని, శక్తిని, తెలివితేటలను సద్వినియోగం చేసుకోండి. జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు."


"సమస్యలు లేని రోజు కోసం కాకుండా.. సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. హ్యాపీ నేషనల్ యూత్ డే."


జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సింపుల్​గా కూడా మీరు విషెష్ చేయవచ్చు. ఇలాంటి కోట్స్, సందేశాలను మీరు మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు పంపి.. నేషనల్ యూత్ డే రోజున వారిని ప్రేరేపించవచ్చు. యువత లక్ష్యాలు గుర్తుచేస్తూ.. వారిలోని శక్తి స్థాయిలను బయటకు తెచ్చేందుకు ఈ విషెష్ హెల్ప్ చేస్తాయి. 


Also Read : ఎర్రని చీమలతో టేస్టీ చట్నీ.. ఈ దేశీ వంటకానికి GI ట్యాగ్ కూడా ఇచ్చేశారుగా