National Sleepover Day 2024 Date : ఇంటి నుంచి బయటకు వెళ్తే చీకటి పడేసరికి ఇంటికి వచ్చేయడం అందరికీ అలవాటు ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు రాత్రి అయితే ఇంటికి వచ్చేయాలనే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు స్లీప్ ఓవర్ డే రోజు మాత్రం మీ ఫ్రెండ్ ఇంట్లో హాయిగా టైమ్ స్పెండ్ చేసి పడుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్​తో కలిసి బయటకు వెళ్లి నైట్ వేరే ప్రదేశంలో స్టే చేయొచ్చు. దీనిని స్లీప్ ఓవర్ డే అంటారు. సాధారణంగా స్లీప్ ​ఓవర్ అనేది గ్రూప్ స్టడీ చేసినప్పుడో.. ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడో చేస్తూ ఉంటారు. అయితే ఈ స్లీప్ ఓవర్ డే రోజు ఎలాంటి అకేషన్​ లేకున్నా.. దానినే ఓ అకేషన్​గా చేసుకుంటూ స్లీప్ ఓవర్​ డే సెలబ్రేట్ చేసుకుంటారు. 


ఇవి ఫాలో అవ్వాలి


స్లీప్ ఓవర్​కి మీకు ఇన్విటేషన్ వచ్చిందనుకో మీరు కొన్ని విషయాలు ఫాలో అవ్వాలి. ముందుగా స్లీపింగ్ బ్యాగ్ సిద్ధం చేసుకోవాలి. దానిలో టూత్ బ్రష్.. నైట్ డ్రెస్​, మేకప్ ప్రొడెక్ట్స్ ప్యాక్ చేసుకోవాలి. పిల్లలు, టీనేజర్లకు ఎక్కువగా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ సొంత ప్లేస్​ నుంచి వారికి గ్యాప్ వస్తుంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు లేదా ఇతరుల దగ్గరికి వెళ్లినప్పుడు తమని తాము ఏ విధంగా సిద్ధం చేసుకుంటారనే అంశాన్ని ఇది హైలైట్ చేస్తుంది. అయితే ఈ స్లీప్​ ఓవర్​ డేలో ఫ్రెండ్స్ గ్యాంగ్ వస్తే దానిని స్లంబర్ పార్టీ లేదా పైజామా పార్టీ అని కూడా అంటారు. 


స్లీప్ ఓవర్ డే చరిత్ర..


స్లీప్ ఓవర్ డేని 1930 నుంచి జరుపుకుంటున్నారు. అయితే వివిధ దేశాల్లో దీనిని ఫాలో అవుతారు. అయితే రెండు బ్రాండ్స్ తమ ప్రమోషన్​లో భాగాంగా ఈ స్లీప్​ ఓవర్​ డేని తెరపైకి తీసుకొచ్చాయి. న్యూ లుక్​.. మేకప్ సో ప్యూర్ యూ కెన్ స్లీప్ ఇన్​ ఇట్​ అనే ట్యాగ్​ లైన్​ తీసుకొచ్చారు. మహిళలు తమ సౌందర్య రహస్యాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడానికి ఈ స్లీప్ ఓవర్​ డేని ఎంచుకుంటారు. #Sleepinthebare అనే హ్యాష్​టాగ్​తో ఫ్రెండ్స్​తో టైమ్ స్పెండ్ చేస్తారు. అయితే 2017లో మే 9వ తేదీని జాతీయ దినోత్సవ క్యాలెండర్​లో.. స్లీప్ ఓవర్ డేగా రిజిస్టర్ చేశారు. 



ఉమెన్స్​ డే వీక్​లో ఈ స్లీప్​ ఓవర్ డే వస్తుంది. కాబట్టి దీనిని అమ్మాయిలకు స్ఫూర్తిధాయకంగా డిజైన్ చేశారు. ఈడే వారిలో విశ్వాసాన్ని కాన్ఫిడెన్స్​ని పెంచుతుందని భావిస్తారు. అంతే కాకుండా ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ పెరగడానికి.. ఇన్​ఫర్​మేషన్​ను పంచుకోవడానికి హెల్ప్ చేస్తుందని చెప్తారు. ఒకరి బాధలు, సంతోషాలు మనస్ఫూర్తిగా షేర్ చేసుకోవడంలో ఇవి హెల్ప్ అవతాయని భావిస్తారు. ముఖ్యంగా ఓ ట్రూ ఫ్రెండ్​తో టైమ్ స్పెండ్ చేస్తే లోపలున్న స్ట్రెస్​ తగ్గి మరింత హెల్తీగా ఉంటారని ఈ డే సూచిస్తుంది.


Also Read : ఎముక విరిగినప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది.. ఆ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదట