Nagarjuna Hair Care Routine : జుట్టు రాలిపోయే సమస్య చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా మగవారు తమకు జుట్టు ఊడిపోతుందని.. బట్టతల వచ్చేస్తుందని ఎక్కువ భయపడుతుంటారు. టెన్షన్​ని రెట్టింపు చేసుకుంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు కింగ్ నాగార్జున రొటీన్​ ఫాలో అయిపోండి. ఎందుకంటే 66 ఏళ్లల్లో కూడా ఒత్తైన జుట్టు కలిగి ఉన్నాడు నాగ్ మామ. దీనికోసం కింగ్ ప్రతీరోజూ ఓ ప్రత్యేకమైన డ్రింక్ తీసుకుంటారట. ఆ విషయాన్ని ఆయన మేకప్ అసిస్టెంట్ తెలిపారు. 

Continues below advertisement

అరవై ఏళ్ల సంగతి పక్కన పెడితే.. 26 ఏళ్లకే జుట్టు రాలిపోతున్న అబ్బాయులు, తీవ్రమైన జుట్టు సమస్యలతో బాధపడే అమ్మాయిలు ఉన్నారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే అది ఏ రీజన్​ వల్ల రాలుతుందో గుర్తించడం అవసరం. అప్పుడే సమస్యను కంట్రోల్ చేయవచ్చు. కొంతమందికి జెనిటికల్​గా కూడా బట్టతల సమస్య ఉండవచ్చు. అయితే జుట్టు రాలకుండా ఉండేందుకు నాగార్జున ఫాలో అయ్యే రొటీన్​ ఏంటో చూసేద్దాం. 

జుట్టుకోసం స్పెషల్ డ్రింక్.. రెసిపీ ఇదే

నాగార్జున ఉదయాన్నే ఓ స్పెషల్ డ్రింక్ తాగుతారట. నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్​ రూట్, పటిక బెల్లం లేదా తేనెతో చేసిన డ్రింక్​ని పరగడుపునే రోజూ ఓ గ్లాస్ తాగుతారట. అది కూడా తక్కువ మోతాదులో కాకుండా పెద్ద గ్లాస్ డ్రింక్ తాగుతారని చెప్పారు నాగార్జున మేకప్ అసిస్టెంట్. అందువల్లే నాగార్జున జుట్టు అంత స్ట్రాంగ్​గా ఉంటుందని చెప్పారు. వాస్తవానికి, ఉసిరికాయ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యారెట్, బీట్​రూట్, నిమ్మకాయ లోపలి నుంచి పోషణ అందిస్తుంది.

Continues below advertisement

నాగార్జున లైఫ్​స్టైల్.. 

ఇదే కాకుండా నాగార్జున డైట్​ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఎప్పుడూ లిమిటెడ్​గానే ఫుడ్ తింటారట. అలాగే ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేస్తారు నాగ్. దీనివల్ల కూడా నాగార్జున స్ట్రాంగ్​గా ఉండడంతో పాటు.. జుట్టు కూడా హెల్తీగా ఉండగలుగుతుంది. అలాగే జుట్టు ఉంటే సరిపోదు.. దానికి సరైన మెయింటెనెన్స్ ఉండాలని.. ఈ విషయంలో నాగార్జున అస్సలు రాజీపడరని చెప్పుకొచ్చారు. డైట్​లో వెజిటెబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారట. 

ఇవన్నీ మీరు ఫాలో అయితే మీ జుట్టు స్ట్రాంగ్ అవ్వచ్చు. కానీ కొందరికి ఇది సాధ్యం కాకపోయినా.. కనీసం ఉన్న జుట్టును కాపాడుకోవాలనుకుంటే సరిగ్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవన్నీ చేస్తే కొందరికి మంచి ఫలితాలు రావచ్చు. మరికొందరికి లేట్​గా రిజల్ట్స్ రావచ్చు. కాబట్టి ఓపికతో ఒక మంచి రొటీన్ ఫాలో అవ్వగలిగితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. బట్టతల దూరమవుతుంది.