మూత్రపిండ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్లలో ఒకటి. ఏటా 1.5 లక్షల మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ఒక్క యూఎస్ లోనే 81,800 కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి సాధారణంగా స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపించే ఎనిమిదో అత్యంత సాధారణ క్యాన్సర్. చికిత్స ఉన్నప్పటికీ ఎక్కువ మంచి చనిపోవడానికి కారణం రోగ నిర్థారణ సరైన టైమ్ కి తెలుసుకోకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. అలాగే వ్యాధికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం కొన్ని అపోహలు నిజమని నమ్ముతున్నారు. దీని వల్ల కిడ్నీ క్యాన్సర్ కి సంబంధించి గందరగోళం ఏర్పడుతుంది. ఎక్కువ మంది నమ్మే కొన్ని అపోహలు, వాస్తవాలు ఏమిటనేది చూద్దాం..


అపోహ: క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి


వాస్తవం: కిడ్నీ క్యాన్సర్ ని పరీక్షించడానికి మోమోగ్రామ్ పరీక్షకు సమానమైన పరీక్ష లేదని వైద్యులు చెబుతున్నారు. ఇక జన్యుపరంగా వచ్చే వారికి ఇమేజింగ్ పరీక్షల ద్వారా పర్యవేక్షిస్తారు.


అపోహ: మూత్రంలో రక్తం మూత్రపిండ క్యాన్సర్ కు ఖచ్చితమైన సూచిక


వాస్తవం: మూత్రంలో రక్తం మూత్రపిండ క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. కానీ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వంటి ఇతర సమస్యల వల్ల కూడా అలా జరగవచ్చు


అపోహ: కిడ్నీ క్యాన్సర్ చాలా అరుదు


వాస్తవం: ఈ రోజుల్లో ఏ క్యాన్సర్ అరుదైనది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని చంపుతుంది. ఎక్కువగా మహిళలు దీని బారిన పడుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయి.


అపోహ: ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ రాడు


వాస్తవం: కిడ్నీ క్యాన్సర్ కి అతిపెద్ద ప్రమాద కారకాల్లో ధూమపానం ఒకటని వైద్యులు చెబుతున్నారు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం ధూమపానం మూత్రపిండ కం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది క్యాన్సర్ అత్యంత సాధారణ రూపాల్లో ఒకటి.


అపోహ: కిడ్నీ క్యాన్సర్ వంశపారపర్యం కాదు


వాస్తవం: కుటుంబంలో ఎవరికీ కిడ్నీ క్యాన్సర్ లేదు కాబట్టి మనం దాని బారిన పడమని చాలా మంది అనుకుంటారు. అయితే కొన్ని గణాంకాల ప్రకారం కిడ్నీ క్యాన్సర్ కేసుల్లో 2-3 శాతం వంశపారపర్యంగా వచ్చినవే.


అపోహ: కిడ్నీ క్యాన్సర్ శస్త్ర చికిత్స ఫలితంగా కిడ్నీ కోల్పోతాం


వాస్తవం: ఏ క్యాన్సర్ కి అయినా సకాలంలో గుర్తించి విజయవంతంగా చికిత్స చేస్తే అది నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. శస్త్ర చికిత్స చేసినప్పటికీ మొత్తం మూత్రపిండాన్ని కాకుండా కణితిని తొలగించడం జరుగుతుంది.


అపోహ: కిడ్నీ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది


వాస్తవం: అధ్యయనం ప్రకారం స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా మూత్రపిండ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.


కిడ్నీ క్యాన్సర్ వల్ల ఏం జరుగుతుంది?


బీన్స్ ఆకారంలో ఉండే మూత్రపిండాలు పక్కటెముకల కింద ఉంటాయి. ఇందులోని చిన్న ఫిల్టర్లు సుమారు 200 క్వార్ట్స్ రక్తాన్ని  ప్రాసెస్ చేస్తాయి. టాక్సిన్స్, అదనపు ఖనిజాలు, నీటిని మూత్రం రూపంలో బయటకి పంపిస్తుంది. కిడ్నీలో వచ్చే క్యాన్సర్ ఈ ఫిల్టర్లలోనే వస్తుంది. చికిత్స చేయించుకోకుండా వదిలేస్తే అది ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఆమె మొహం నిండా మొటిమలే కానీ అది స్కిన్ డీసీజ్ కాదు