Hair Mask With Multani Mitti : చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టిని చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖంపై అదనపు నూనెను తొలగించడానికి, చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి దీనిని ఉపయోగిస్తుంటారు. అయితే ముల్తానీ మట్టిని తలకు, స్కాల్ప్‌కు కూడా అప్లై చేయవచ్చా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది.

Continues below advertisement

నిజానికి ముల్తానీ మట్టిని స్కాల్ప్‌కు అప్లై చేయవచ్చు. అయితే ఇది అందరికీ సెట్ కాకపోవచ్చు. ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు అప్పుడప్పుడు ముల్తానీ మట్టి అప్లై చేయడం వల్ల ప్రయోజనం ఉండొచ్చు. అలాగే పొడి లేదా సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి దీనివల్ల కలిగే లాభాలు ఏంటో.. ఎలా అప్లై చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?

Continues below advertisement

ముల్తానీ మట్టి తలకు అప్లై చేస్తే కలిగే ప్రయోజనాలు

ముల్తానీ మట్టికి నూనెను శోషించే లక్షణం ఉంటుంది. దీంతో స్కాల్ప్‌పై పేరుకున్న అదనపు సెబమ్‌ను కొంతవరకు తొలగించి.. జిడ్డుదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చెమట, దుమ్ము, నూనె వంటి పదార్థాలు స్కాల్ప్‌పై పేరుకుపోతే జుట్టు జిడ్డుగా, బరువుగా అనిపించవచ్చు. అలాంటివారు ముల్తానీ మట్టిని ఒక క్లెన్సింగ్ మాస్క్‌లా ఉపయోగించవచ్చు. ఇది స్కాల్ప్‌ను శుభ్రంగా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

హెయిర్ ప్రొడక్ట్ బిల్డప్‌ కంట్రోల్

జెల్స్, క్రీమ్స్, స్ప్రేలు వంటి హెయిర్ ప్రొడక్ట్స్‌ను తరచుగా ఉపయోగించే వారు ముల్తానీ మట్టి ఉపయోగించవచ్చు. ఎందుకంటే హెయిర్ ప్రొడక్ట్స్ స్కాల్ప్‌పై కొంత బిల్డప్ ఏర్పాటు చేస్తాయి. ముల్తానీ మట్టి దానిని తొలగించడంలో కొంత సహాయపడవచ్చు. ముల్తానీ మట్టి అప్లై చేసినప్పుడు చల్లగా అనిపించవచ్చు. ముఖ్యంగా వేడి వాతావరణంలో చెమట, ఆయిల్ వల్ల అసౌకర్యంగా ఉన్న స్కాల్ప్‌కు తాత్కాలికంగా ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వవచ్చు.

Also Read : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి

మరిన్ని బెనిఫిట్స్

స్కాల్ప్‌లో అధిక చెమట, నూనె పేరుకుపోవడం వల్ల కొన్నిసార్లు దుర్వాసన రావచ్చు. అదనపు నూనె, చెమటను తొలగించడం ద్వారా ఆ వాసన కొంత తగ్గే అవకాశం ఉంటుంది. స్కాల్ప్‌లోని అదనపు నూనె తొలగిన తర్వాత జుట్టు మరింత క్లీన్‌గా, తేలికగా అనిపించవచ్చు. 

ముల్తానీ మట్టి తలకు అప్లై చేస్తే కలిగే నష్టాలు

ముల్తానీ మట్టి సహజ పదార్థమే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని అనుకోకూడదు. అతిగా వినియోగించడం వల్ల స్కాల్ప్‌లో డ్రైనెస్ పెరిగే అవకాశం ఉంది. సహజ నూనెలు కూడా తగ్గి పొడిబారి.. బిగుతుగా మారుతుంది. స్కాల్ప్ చాలా పొడిగా మారితే దురద లేదా పొట్టు రాలడం పెరిగే అవకాశం ఉంటుంది. జుట్టు రఫ్‌గా కూడా మారవచ్చు. మరికొందరికి ఇర్రిటేషన్‌, మంట, ఎర్రదనం, దురద వంటివి కనిపిస్తాయి. 

Also Read : మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?

ముల్తానీ మట్టి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా?

ముల్తానీ మట్టి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అని చెప్పే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ స్కాల్ప్‌లోని అదనపు నూనె, మురికిని తొలగించడానికి ఉపయోగపడే క్లెన్సింగ్ మాస్క్‌గా వర్క్ చేస్తుంది. జుట్టు రాలడానికి హార్మోన్ల మార్పులు, పోషక లోపాలు, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు వంటి అనేక అంశాలు ఉండవచ్చు. వాటికి ముల్తానీ మట్టి పరిష్కారం కాదు.

తలకు ముల్తానీ మట్టిని ఎలా అప్లై చేయాలి?

ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు ముల్తానీ మట్టిని కొద్దిగా నీరు లేదా అలోవెరా జెల్‌తో కలిపి పలుచని పేస్ట్‌లా చేసుకోవచ్చు. ముందుగా స్కాల్ప్‌కు మాత్రమే పలుచగా అప్లై చేయాలి. దీనిని 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. పూర్తిగా ఎండిపోయి గట్టిగా మారే వరకు ఉంచకపోవడం మంచిది. తర్వాత నీటితో బాగా కడగాలి. జుట్టు పొడిగా అనిపిస్తే కండిషనర్ ఉపయోగించాలి. రెగ్యులర్​గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తే మంచిది. మొదటిసారి ట్రై చేస్తుంటే మాత్రం కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ వేసుకువాలి. 

జుట్టును సంరక్షించే చిట్కాలు, హెయిర్ టిప్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.