Multani Mitti Face Pack in Summer : వేసవిలో అధిక వేడి, చెమట, దుమ్ము కారణంగా చర్మంపై ఆయిల్ ఎక్కువగా పేరుకుపోతుంది. దీనివల్ల మొటిమలు, టాన్, చర్మం మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో సహజసిద్ధమైన చర్మ సంరక్షణకు ముల్తానీ మట్టి (Multani Mitti) చాలా ఉపయోగపడుతుంది. ఇది చర్మంపై ఉన్న అదనపు ఆయిల్‌ను తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే వేసవిలో చాలామంది దీన్ని ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తారు. మరి దీని వల్ల కలిగే లాభాలు ఏంటో.. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలివే

  • ఆయిల్ కంట్రోల్ 

ముల్తానీ మట్టి చర్మంపై ఉండే ఆయిల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో ముఖం తాజాగా కనిపిస్తుంది. 

  • మొటిమలు తగ్గించడానికై.. 

ముల్తానీ మట్టిలోని ఖనిజాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో మొటిమలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

  • టాన్ దూరం చేసుకోవడానికై..

ఎండలో ఎక్కువసేపు తిరిగితే చర్మం టాన్ అవుతుంది. ముల్తానీ మట్టి ప్యాక్ వాడితే టాన్ తగ్గడానికి సహాయపడుతుంది.

  • చల్లదనానికై.. 

వేసవిలో ముఖానికి చల్లదనం ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. దీనివల్ల చర్మం తాజాగా అనిపిస్తుంది.

  • చర్మ శుభ్రతకై..

ముఖంపై ఉన్న దుమ్ము, మలినాలను తొలగించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. కాబట్టి పొల్యూషన్​లో తిరిగినప్పుడు స్కిన్ కేర్ కోసం ఉపయోగించవచ్చు. 

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలంటే..

ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు

రోజ్ వాటర్ లేదా సాధారణ నీరు – అవసరమైనంత

నిమ్మరసం – కొన్ని చుక్కలు (ఆప్షనల్)

తయారీ విధానం

ఒక బౌల్‌లో ముల్తానీ మట్టి తీసుకోవాలి. దానిలో రోజ్ వాటర్ లేదా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. కావాలంటే కొన్ని చుక్కల నిమ్మరసం కలపవచ్చు. ఈ ప్యాక్‌ను ముఖానికి సమంగా అప్లై చేయాలి. 15–20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

ముల్తానీ మిట్టి ఎక్కువగా వాడకూడదు. వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే వాడాలి. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ప్యాక్ పూర్తిగా ఎండిపోయే వరకు ఉంచకూడదు. వాడిన తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది. 

ఎవరు వాడకూడదంటే..

చాలా డ్రై స్కిన్ ఉన్నవారు ముల్తానీ మట్టి ఎక్కువగా వాడకూడదు. గాయాలు లేదా ఇన్‌ఫెక్షన్లు ఉంటే వాడకపోవడం మంచిది. అలర్జీ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.

సమ్మర్‌లో వాడితే..

ముల్తానీ మట్టి చర్మానికి చల్లదనం ఇస్తుంది. అలాగే ఆయిల్‌ను తగ్గిస్తుంది. అందుకే వేసవిలో ఇది వాడటం చాలా మందికి ఉపయోగపడుతుంది. అయితే చర్మ రకాన్ని బట్టి పరిమితంగా మాత్రమే వాడాలి. సరైన విధంగా ఉపయోగిస్తే చర్మాన్ని తాజాగా, శుభ్రంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.