Monsoon Health Alert for Diabetics : డయాబెటిస్ ఉన్నవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పాటు.. ఫుడ్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ మధుమేహాన్ని పెంచుతాయి. కాబట్టి కొన్ని కామన్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటూ.. షుగర్‌ని కంట్రోల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వాటిని తినడం వల్ల మధుమేహం ఉన్నవారికి కలిగే నష్టాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహంపై మాన్సూన్ ప్రభావం..
వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. హ్యుమిడిటీ ఎక్కువగా ఉండి.. జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. అంతేకాకుండా మెటబాలీజం నెమ్మదిస్తుంది. ఇది గట్ హెల్త్‌ని నెగిటివ్‌గా ఇంపాక్ట్ చేసి.. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. బ్లోటింగ్ సమస్యలు పెంచుతుంది. ''జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ'' ప్రకారం.. గట్ హెల్త్ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
స్ట్రీట్ ఫుడ్స్..
వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ క్రేవింగ్స్ చాలామందికి ఉంటాయి. పకోడి, సమోస, బజ్జీలు వంటి డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ తింటూ ఉంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి.. షుగర్ లెవెల్స్‌ను పెంచేస్తాయి. అలాగే నూనె వల్ల కూడా ఆరోగ్య ప్రమాదాలు రెట్టింపు అవుతాయి. ఇన్ఫెక్షన్లు సోకుతాయి.
శుభ్రత
వర్షాకాలంలో వాటర్, ఫుడ్ వల్ల టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజినింగ్ వంటి వ్యాధులు కామన్‌గా వస్తాయి. ఇవి కూడా మధుమైహాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరిగినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుందని హార్వార్డ్ మెడికల్ స్కూల్ స్టడీ తేల్చి చెప్పింది. కాబట్టి శుభ్రమైన ఫుడ్, నీటిని తీసుకోవాలి.
రైస్ ఫుడ్స్
వర్షాలు పడే సమయంలో అన్నం.. బియ్యంతో తయారు చేసే ఇడ్లీ, దోశ, పుట్టు వంటివి తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్‌ని పెంచుతుందని ''అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్'' తెలిపింది. ఇన్సులిన్ రెసిస్టెన్సీపై ప్రభావం పడి.. మధుమేహంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. శరీరంలో షుగర్లెవెల్స్ని ఒకేసారి పెంచేస్తాయి.
స్వీట్ డ్రింక్స్..
వెచ్చదనం కోసం టీలు, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడం కూడా మంచిది కాదు. వీటిలో హిడెన్ షుగర్స్, బ్లడ్ షుగర్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వీటివల్ల టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ సమస్యలను రెట్టింపు చేస్తుంది. అయితే వర్షాకాలంలో కూడా నీటిని తరచుగా తీసుకోవాలి. డీహైడ్రేషన్‌ను తగ్గించుకునేందుకు హెర్బల్ టీలు, ఇన్ఫ్యూజ్ చేసిన నీటిని తాగాలి. "Dehydration is a hidden trigger for blood sugar imbalance." అని మాయో క్లినిక్ తెలిపింది.
మిగిలిన పోయిన ఫుడ్స్, పులిసిన వాటిని కూడా తినకూడదు. వాటివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల డయాబెటిక్ కెటోయాసిడోసిస్ (DKA) సమస్యలు వస్తాయి. ఫెర్మెంట్ చేసిన ఫుడ్స్‌లో సహజమైన షుగర్స్ ఉంటాయి. బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది.
సీజనల్ ఫ్రూట్స్ అయిన నేరేడు పండ్లు, జామకాయ, పియర్స్, స్ప్రౌట్స్ సలాడ్, ఉడికించిన మొక్కజొన్న వంటివి స్నాక్‌గా తీసుకోవచ్చు. పసుపు, అల్లం, మెంతులు వంటివి సహజంగా షుగర్‌ను అదుపులో ఉంచుతాయి కాబట్టి.. వాటిని తీసుకుంటే మంచిది. అలాగే వైద్యుల సలహాలు కూడా షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి.