Miss World 2027 Eligibility and Selection Process : అత్యంత ఫేమస్ అయిన మిస్ వరల్డ్‌ పోటీలలో పాల్గొనాలని చాలా మంది యువతులు కలలు కంటారు. కానీ ఈ పోటీల్లో ముందుకు సాగడానికి అందమైన ముఖం మాత్రమే సరిపోదు. మీ వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ, ఆలోచనా విధానం, సమాజం పట్ల మీ దృక్పథం కూడా చాలా కీలకంగా ఉంటాయి. మీరు మిస్ వరల్డ్ వేదికను చేరుకోవాలని కలలు కంటున్నట్లయితే.. మొదటి నుంచే మీ సన్నాహాలను సరైన దిశలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మిస్ వరల్డ్ 2027కి అర్హత సాధించడానికి మీరు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రవేశం 

మిస్ వరల్డ్ పట్ల ఆసక్తి ఉన్న పోటీదారులు.. తమ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుని.. పోటీకి తమను తాము పరిచయం చేసుకోవచ్చు. దీని కోసం మిస్ వరల్డ్ యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత తమ దేశాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ప్రొఫైల్‌లో పేరు, ఫోటో, తమ గురించిన అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, తమ గుర్తింపు, లక్ష్యాలను స్పష్టంగా ప్రతిబింబించే ఇంట్రో క్రియేట్ చేసుకోవాలి. దీని తర్వాత పోటీదారులు ఒక వీడియో ద్వారా తమ స్టోరీ, విజయాలు, ప్రతిభ, మిస్ వరల్డ్ కావాలనే తమ ఆకాంక్షను ప్రదర్శించే అవకాశం పొందుతారు. దీని ద్వారా నిర్వాహకులకు, ప్రేక్షకులకు మీ గురించి తెలిసే అవకాశం లభిస్తుంది.

Also Read : మిస్ వరల్డ్ 2026 టైటిల్ గెలుచుకున్న జోహెరీ మోలా.. భారత్ నుంచి పోటీ చేసిన నికితా పోర్వాల్‌కు ఎంతవరకు అవకాశం దక్కిందంటే..

Continues below advertisement

జాతీయ అందాల పోటీలో గెలవాలి..

మిస్ వరల్డ్ అంతర్జాతీయ వేదికకు చేరుకోవాలంటే.. ఏ అభ్యర్థి అయినా ముందుగా తమ దేశపు ఎంపిక ప్రక్రియలో ఉత్తీర్ణత సాధించాలి. అంటే భారతదేశం నుంచి మీరు మిస్ వరల్డ్‌లో పాల్గొనడానికి అత్యంత ముఖ్యమైన దశ జాతీయ స్థాయి పోటీ. జాతీయ పోటీలో పాల్గొని.. గెలిస్తేనే మీరు మిస్ వరల్డ్‌లో మీ దేశానికి ప్రాతినిధ్యం వహించగలరు. భారతదేశపు జాతీయ పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి అభ్యర్థులు పాల్గొంటారు. జాతీయ ఎంపిక తర్వాత, విజేత మిస్ వరల్డ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించే హక్కును పొందుతారు. 

ఏ విషయాలపై దృష్టి పెట్టాలంటే..

మిస్ వరల్డ్ కోసం సిద్ధమవుతున్నప్పుడు ఆత్మవిశ్వాసం చాలా కీలకం. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన కూడా అవసరం. మీ ఆలోచనలను సమర్థవంతంగా తెలియజేయగలిగే వ్యక్తిత్వం ఉండాలి. ప్రతిభ కూడా మీ గుర్తింపును బలపరుస్తుంది. నృత్యం, సంగీతం, ప్రసంగ నైపుణ్యం, గేమ్స్, కళలు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టడంలో సహాయపడతాయని గుర్తించుకోండి. 

Also Read : మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలంటే కావాల్సిన అర్హతలివే.. వయసు, హైట్ ఎంత ఉండాలంటే