తడికి ఇంకా పెళ్లి కాలేదు. సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్దగా బాధ్యతలు లేకపోవడం వల్ల.. పనులు కూడా ఏమీలేవు. అదే అతడికి శాపమైంది. సింగిల్‌గా ఉండటం వల్ల తోటి ఉద్యోగులకే కాదు.. బాస్‌కు కూడా లోకువయ్యాడు. ఇంకేముంది.. ఆ ఆఫీసులో అతడే ఆటబొమ్మయ్యాడు. చివరికి అక్కడి పరిస్థితులు అతడు తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికి దారితీశాయి. 


ఇటీవల రెడ్డిట్‌లో Feggy_JVS అనే ఓ యూజర్ (ఫెగ్గీ) తన బాస్‌తో జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. తన బాస్ నిత్యం ఎలా వేదిస్తున్నాడో చూడండని తెలిపాడు. ఓ రోజు తన బాస్ మార్నింగ్ 7 గంటల షిఫ్ట్‌కు రావాలని కోరాడు. అయితే, ఆ షిఫ్ట్‌కు ప్రిపేర్ అవ్వడం కోసం 6.15 గంటలకే ఆఫీసులో ఉండాలని చెప్పాడు. దీంతో ఫెగ్గి తనకు ఆ రోజ్ డే ఆఫ్ అని, తనకు బదులు బ్రాన్‌(మరో ఉద్యోగి)కి ఆ షిఫ్ట్ వేయగలరా? అని అడిగాడు. అయితే, బ్రాన్‌కు పెళ్లై, పిల్లలు ఉన్నారని.. ఇప్పటికిప్పుడు అతడిని ఆ షిఫ్ట్‌లో పనిచేయమని చెప్పడం కుదరదని బాస్ తెలిపాడు. 


‘‘నువ్వు సింగిలే కదా? నువ్వు ఎందుకు ఆ షిఫ్ట్‌కు రాలేవు?’’ అని బాస్ అడిగాడు. ఇందుకు ఫెగ్గీ సమాధానమిస్తూ.. ‘‘నాకు వారంలో ఒకే డే ఆఫ్ దొరుకుతుంది. నాకు కొన్ని పనులు ఉన్నాయి. నా ఫ్రెండ్ ఇల్లు మారుతున్నాడు. వాడికి సాయం చేయడానికి వెళ్తున్నా’’ అని చెప్పాడు. ఈ సమాధానం విని బాస్‌ మరింత రెట్టించాడు.. రావల్సిందేనని పట్టుబట్టాడు. ‘‘నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో మీకు తెలుసు. కాబట్టి, నా పనికి, నాకు విలువను ఇవ్వండి’’ అని ఫెగ్గి సమాధానం ఇచ్చాడు. 


దీంతో అతని బాస్ మాటలు కాస్త సరిగ్గా రానివ్వు అని ఘాటుగా హెచ్చరించాడు. నువ్వు డబ్బుకోసమే పనిచేస్తున్నావని నాకు తెలుసంటూ మరింత రెచ్చగొట్టాడు. దీంతో ఆ ఫెగ్గీకి చిర్రెత్తుకొచ్చింది. నేను రాజీనామా చేస్తున్నా, ఈ మెసేజ్‌ను మీరు రెండు వారాల నోటీసుగా పరిగణించాలని రిప్లై ఇచ్చాడు. తన రాజీనామాను అంగీకరించకపోతే.. సోమవారం ఆఫీసుకు వచ్చి కలుస్తానని చెప్పాడు.


ఫెగ్గీ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో 


ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలవు రోజుల్లో ఉద్యోగిని ఆఫీసుకు పిలవడం రూల్స్‌కు వ్యతిరేకమని, ఆ రోజు పనిచేయడాని ఉద్యోగిని రిక్వెస్ట్ చేయాలేగానీ.. ఆర్డర్ వేయకూడదని అంటున్నారు. పైగా సింగిల్స్ అంటే మరీ అంత చులకనా? వాళ్లు మనుషులు కాదా? వారికి తల్లిదండ్రులంటూ.. ఇంటి పనులంటూ ఉండవని అనుకుంటున్నారా? అని మండిపడుతున్నారు. సింగిల్స్‌ను, పెళ్లయినవారిని విడదీసి చూడకూడదని.. పని విషయంలో ఎవరైనా ఒకటేనని అంటున్నారు. ప్రతి ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని.. మీరు వారం మొత్తం శ్రమిస్తున్నందుకు సంస్థ ఒక్క రోజైనా మీకు విశ్రాంతి ఇవ్వాలని అంటున్నారు. మరి, దీనిపై మీరు ఏమంటారు? మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా?


Also Read: అబ్బాయిలూ ఈ పనులు చేస్తున్నారా? మీ మగతనం మటాషే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial