నువ్వుల లడ్డూ
నువ్వుల లడ్డూ అనేది వేయించిన నువ్వులు, బెల్లంతో తయారు చేస్తారు. ఇది ఒక సాంప్రదాయ తీపి వంటకం. ఈ పోషకమైన స్నాక్ మకర సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువగా చేసుకుంటారు. రుచికరమైన, కరకరలాడే, తియ్యని స్నాక్ ఇది. ఇది చలికాలంలో తినడం వల్ల శరీరానికి లోపలి నుంచి వేడి అందుతుంది. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
నువ్వుల బర్ఫీ
దీనినే తిల్ బర్ఫీ అని కూడా అంటారు. వీటిని నువ్వులు, బెల్లం, నెయ్యితో తయారు చేసుకుంటారు. ఇది ఆరోగ్యకరమైనదే కాదు.. పోషకమైనది కూడా. ఇది తీపి, ఆరోగ్య ప్రయోజనాల ఉత్తమ కలయిక. ఇది మకర సంక్రాంతి సమయంలో ఒక ప్రసిద్ధ ఎంపికగా మారుతుంది.
తిల్‌కుట్
తిల్‌కుట్ అనేది మకర సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువమంది ఆనందించే ఒక ప్రసిద్ధ తీపి వంటకం. దీనిని నార్త్ వాళ్లు ఎక్కువగా చేసుకుంటారు. ఈ పోషకమైన వంటకం ఐరన్తో సమృద్ధిగా ఉంటుంది. అనేక ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకంగా చెప్పవచ్చు.
నువ్వుల పోలి
తిల్ పోలి అనేది స్వీట్ ఫ్లాట్‌బ్రెడ్. ఇది దాని టేస్టీ, నట్టి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది కూడా అనేక పోషక ప్రయోజనాలను కలిగి ఉంది. తీపి, శక్తి పరిపూర్ణ మిశ్రమాన్ని అందిస్తుంది. నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ఈ వంటకం మకర సంక్రాంతి సమయంలో ఎక్కువగా చేసుకుంటారు.
నువ్వుల కిచిడి
తిల్ కిచిడి అనేది బియ్యం, పెసరపప్పు, నువ్వులతో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యకరమైన, పోషకమైన వంటకం. సాంప్రదాయకంగా మకర సంక్రాంతి సమయంలో తయారు చేసుకుంటారు. ఈ కిచిడి గొప్ప, నట్టి రుచితో రుచుల సమతుల్యతను కలిగి ఉంటుంది. ఇది చలికాలంలో వెచ్చదనం, బలాన్ని అందిస్తుంది.