Maharashtrian Khairi Chutney : వేసవి వచ్చిందంటే చాలు వివిధ రకాలు పచ్చళ్లు పడుతుంటారు. ముఖ్యంగా మామిడికాయలతో డిఫరెంట్ చట్నీలు, పికిల్స్ చేసుకుంటారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన రెసిపీలు ఫేమస్ అవుతాయి. అలాంటి వాటిలో ఖైరీ చట్నీ ఒకటి. ఇది మహారాష్ట్రలో బాగా ఫేమస్. దీనిని ఇంట్లోనే చాలా సింపుల్​గా, టేస్టీగా చేసుకోగలుగుతారు. మరి దీనిని ఎలా చేయాలో.. దానికి సంబంధించిన పదార్థాలు ఏంటో.. టేస్టీ రెసిపీ విధానం చూసేద్దాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

మామిడి కాయలు - 3

ఎండుమిర్చి - 15 నుంచి 20 (మీ రుచికి తగ్గట్లు)

Continues below advertisement

ధనియాల పొడి - 1 టీస్పూన్

ఉప్పు - సరిపడేంత

పసుపు - చిటికెడు

వెల్లుల్లి - 5 రెబ్బలు

జీలకర్ర - 1 టీస్పూన్

ఆవాలు - 1 టీస్పూన్

జీలకర్ర పొడి - 1 టీస్పూన్

కారం - 1 టీస్పూన్

నూనె - ఫ్రైకి సరిపడా

తయారీ విధానం

ముందుగా ఎండుమిర్చిని మజ్జిగలో వేసి నానబెట్టాలి. ఓ అరగంట ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామిడి కాయలను కడిగి.. దానిపై తడి లేకుండా తుడవండి. ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోలు తీసుకుని దానిలో మామిడికాయ ముక్కలు, ఎండుమిర్చి వేసి దంచుకోవాలి. ధనియాల పొడితో పాటు ఉప్పు వేసుకుని దంచుకోవాలి. 

మీ దగ్గర రోలు లేకుంటే.. మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా తయారు చేసుకున్న పేస్ట్​ను పక్కన పెట్టుకోవాలి. దానిలో చిన్నగా తురిమిన మామిడి ముక్కలు, కాస్త కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో పచ్చడి నూనె వేసి.. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి తాలింపు పెట్టుకోవాలి. 

ఈ తాలింపులో మామిడి పేస్ట్ వేసి.. కలిపి ఉడికించాలి. నీరు పోయేవిధంగా ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ ఖైరీ చట్నీ రెడీ. దీనిని మీరు రోటీలతో, వేడి వేడి అన్నంతో హాయిగా లాగించవచ్చు. మరీ కారంగా ఉంటుందనుకునేవాళ్లు కాస్త బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది కారం తగ్గించి.. రుచిని ఇంకాస్త మెరుగుపరుస్తుంది.