Maha Shivaratri 2026 : ఉపవాసం చేస్తున్నారా? మహాశివరాత్రి వ్రత సమయంలో తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఫుడ్స్ ఇవే
Maha Shivaratri Fasting Tips : మహా శివరాత్రి సందర్భంగా చాలామంది ఉపవాసం చేస్తారు. ఆహారానికి దూరంగా ఉన్నప్పుడు గ్యాస్, ఎసిడిటీ ఇబ్బంది పెడుతుంది. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

Shivaratri Vrat Health Tips : మహా శివరాత్రి 2026 సందర్భంగా ఉపవాసం ఉంటున్నారా? అయితే వ్రత సమయంలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎక్కువసేపు ఆహారానికి దూరంగా ఉన్నప్పుడు కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు పెరిగి.. ఉపవాసంలో ఇబ్బందిని కలిగిస్తాయి. అలా ఇబ్బంది కలగకూడదంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలని చెప్తున్నారు డైటీషియన్ డాక్టర్ రిథిమా ఖమేస్రా.
రిథిమా ప్రకారం ఉపవాసం తప్పు కాదు. కానీ ఫాస్టింగ్ ఉండే విధానం తప్పుగా ఉంటే.. అప్పుడు జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. లేదంటే ఎసిడిటీ, కడుపులో ఉబ్బరం, ఛాతీలో మంట వంటి సమస్యలు దారితీస్తాయని చెప్తున్నారు. ఫుడ్ సమయం మారడం, పూజ కోసం చేసిన ప్రసాదాలు తీసుకోవడం వంటి వాటివల్ల కూడా ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.
ఉపవాసంలో ఎసిడిటీ ఎందుకు వస్తుంది?
ఆహారం తీసుకోవడం ఆపినంత మాత్రాన కడుపు ఆమ్ల ఉత్పత్తిని ఆపదు. ఆమ్ల స్రావం ఒక లయను అనుసరిస్తుంది. ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, పండ్లు, పాలు లేదా వేయించిన వ్రత ఆహారాలు తీసుకున్నప్పుడు.. ఆమ్లం పనిచేయడానికి ఘనమైనది ఏది దొరకదు. అప్పుడు మంట, వికారం, రిఫ్లక్స్ వస్తాయి.
ఫాస్టింగ్లో ఉబ్బరానికి కారణాలు..
పండ్లు, అరటిపండ్లు, చిలగడదుంపలు, సగ్గుబియ్యం, వేరుశనగలు ఇలా అన్ని ఆరోగ్యకరమైనవే అయినా.. పండుగ సమయంలో ఇవన్నీ కలిపి తీసుకుంటారు. ఖాళీ కడుపుతో ఇవి తీసుకున్నప్పుడు కిణ్వ ప్రక్రియకు గురై.. కడుపు ఉబ్బరం వస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఉపవాసం చేసేప్పుడు చేయవలసిన, చేయకూడని తప్పులు ఏంటంటే..
ఫాస్టింగ్ చేయడానికి చిట్కాలు
టీ, కాఫీ లేదా పండ్లతో మాత్రమే ఉపవాసం చేయడం తప్పు. కాబట్టి ప్రోటీన్ లేదా కొవ్వును తీసుకోవడం వల్ల తేడా వస్తుంది. ఒక గిన్నె పెరుగు లేదా ఒక గ్లాసు పలుచన చేసిన మజ్జిగ లేదా నానబెట్టిన బాదం కూడా యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ చురుగ్గా ఉన్నప్పుడు అంటే.. పగటిపూట పండ్లు తీసుకోవచ్చు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది.
సగ్గుబియ్యం కిచిడి, వేయించిన పట్టీలు, బంగాళదుంప వంటకాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. తేలికగా ఉడికించిన కూరగాయలు, లౌకి సబ్జీ, ఉడికించిన చిలగడదుంప లేదా తక్కువ నెయ్యితో చేసిన వ్రత కిచిడి మంచి ఎంపికలు. ఏదో ఒకటి ఎక్కువగా తినడం కంటే.. అన్ని కొంచెం కొంచెంగా తీసుకోవడం ఉత్తమం.
పాలు, పండ్ల కాంబినేషన్
ఉపవాస సమయంలో పాలు, అరటిపండ్లు, ఖర్జూరాలు తరచుగా కలిపి తీసుకుంటారు. ఈ కలయిక అధికంగా ఉండి గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. పాలు తీసుకుంటే వాటిని వెచ్చగా.. పండ్లతో కలిపి కాకుండా తీసుకోవచ్చు. అలాగే పండ్లు తీసుకున్నప్పుడు పాలు తర్వాత తీసుకుంటే మంచిది. పాలలో యాలకులు లేదా శొంఠి కలపడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది.
ఉపవాసం విరమించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గంటల తరబడి ఫాస్టింగ్ చేసిన తర్వాత.. అతిగా తినకపోవడమే మంచిది. లేదంటే ఎసిడిటీ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. తేలికపాటి, వెచ్చని భోజనంతో ఉపవాసం ముగించడం వల్ల ఆమ్ల స్థాయిలు సాధారణ స్థితికి వస్తాయి. సాధారణ రోజుల కంటే ఉపవాస రోజులలో నెమ్మదిగా తినడం చాలా ముఖ్యం.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
























