Love or Love Bombing : కొన్నిబంధాలు చాలా వేగంగా మొదలవుతాయి. తెలియకుండానే ఓ వ్యక్తి బాగా స్పెషల్ అయిపోవచ్చు. అయితే దాని అర్థం ప్రేమ? లేదా ఇంకేదైనా కాదు. ఎందుకంటే ప్రారంభంలో ఏ రిలేషన్ అయినా అంతా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. కొత్త పరిచయం కాబట్టి ఎక్కువ మెసేజ్​లు, అటెన్షన్​ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు లేదా అవతలి వాళ్లు ప్రత్యేకంగా భావించే సందర్భాలు వస్తాయి. కానీ తక్కువ సమయంలో ఇలా ఎక్కువ అఫెక్షన్ చూపిస్తున్నారంటే.. చాలామంది అది లవ్ అనుకుంటారు. కానీ మేజర్​గా జరిగేది ఏంటంటే అది లవ్ బాంబింగ్. మరి మీది నిజమైన ప్రేమనా? లవ్ బాంబ్? అసలు లవ్ బాంబింగ్ అంటే ఏంటి?

Continues below advertisement

లవ్ బాంబింగ్ అంటే ఏమిటి?

లవ్ బాంబింగ్ అనేది ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మడానికి వీలుగా.. అవసరమైన దానికంటే ఎక్కువ ప్రేమ, శ్రద్ధ, బహుమతులు ఇచ్చే పరిస్థితి. మొదట్లో ఇదంతా బాగానే ఉంటుంది. కానీ అసలు ఉద్దేశ్యం మిమ్మల్ని తమ కంట్రోల్​లోకి తెచ్చుకోవడమేనని అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఈ లవ్ బాంబింగ్.. మానసిక, భావోద్వేగ దుర్వినియోగానికి ఒక రూపమని.. అందుకే ఇది మొదట్లో చాలా ఇంట్రెస్టింగ్​గా ఉండి.. ప్రేమ అనే భావనను తీసుకువస్తుందని చెప్తున్నారు.

ప్రారంభంలో లవ్ బాంబర్ మిమ్మల్ని పదేపదే ప్రశంసలతో ముంచెత్తుతారు. తర్వాత మీపై చాలా శ్రద్ధ చూపిస్తారు. నిరంతరం మెసేజ్​లు చేయడం, కాల్స్ చేయడం వంటివి చేస్తారు. మీతో టైమ్ స్పెండ్ చేసేందుకు.. మీ అటెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. పరిచయం అయిన కొన్ని వారాల్లోనే పెళ్లి, కలిసి జీవించడం లేదా ఒకరికొకరు పుట్టామనే విధంగా ఫ్యూచర్ గురించి మాట్లాడేస్తారు. స్టార్టింగ్​లో ఇది రొమాంటిక్​గా అనిపిస్తుంది కానీ.. కాలక్రమేణా ప్రెజర్​గా మారుతుంది.

Continues below advertisement

లవ్ బాంబింగ్ దశలు ఇవే..

క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. లవ్ బాంబింగ్‌లో మూడు స్పష్టమైన దశలు ఉంటాయి. మొదటి దశలో మీకు చాలా ప్రేమ, ప్రాముఖ్యత ఇస్తారు. ఆ సమయంలో మీరు వారితో పూర్తి సురక్షితంగా భావిస్తారు. రెండవ దశలో కంట్రోల్ చేయడం నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మీరు ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలని ఆశిస్తారు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచేందుకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారు. అలాగే మీ పనుల గురించి ఆరాలు తీస్తారు. కొన్నిసార్లు ఇది గ్యాస్‌లైటింగ్‌కు చేరుకుంటుంది. అప్పుడు మీ ఎమోషన్స్​ను కూడా అనుమానించడం ప్రారంభిస్తారు. మూడవ దశలో మీరు బౌండరీలు పెట్టి.. వారిని దూరంగా ఉంచినట్లు అనిపిస్తే.. అదే వ్యక్తి మిమ్మల్ని నిందిస్తారు. లేదా సంబంధాన్ని వదిలివేస్తారు.

ప్రేమ, లవ్ బాంబింగ్‌ మధ్య తేడా

ప్రేమ, లవ్ బాంబింగ్‌కు మధ్య తేడా ఏమిటో గుర్తించడం చాలా ముఖ్యం. నిజమైన సంబంధం మీ సమయం, బౌండరీలు, సౌకర్యాన్ని గౌరవిస్తుంది. కానీ లవ్ బాంబర్ మీరు చెప్పే 'నో'ని అంగీకరించరు. మీ బౌండరీ గురించి ఎదుటి వ్యక్తి వాదించినా.. లేదా తిరస్కరించినా అది ప్రేమ కాదు. మీ పర్సనల్ టైమ్ కూడా వారు డిసైడ్ చేసేందే ఉంటే.. అది అన్​హెల్తీ బాండ్​లోకి వెళ్తుంది. లవ్ బాంబింగ్​లో ఎలా అయినా మిమ్మల్ని దక్కించుకోవాలని.. మొదట్లోనే ఖరీదైన బహుమతులు ఇచ్చేస్తారు. సంబంధాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లుందుకు చూస్తారు. కానీ చాలామంది అదే ప్రేమ అనుకుని అట్రాక్ట్ అవుతారు. కాబట్టి కొత్త రిలేషన్​లోకి వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.