Whatsapp Chat Backup : ప్రపంచవ్యాప్తంగా WhatsAppని ఉపయోగించే వినియోగదారులు బిలియన్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ ఈ ప్లాట్‌ఫారమ్‌లో చాలామంది చాట్ చేస్తారు. చాటింగ్ సమయంలో వ్యక్తిగతం నుంచి వ్యాపారం వరకు ఎన్నో విషయాలు చర్చిస్తారు. దీనితో పాటు క్షణాల్లో ఎక్కడో ఉన్న వ్యక్తికి ఫోటోలు, వీడియోలు షేర్ చేయడానికి కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తారు.

Continues below advertisement

రెగ్యులర్​గా ఇలా వినియోగించేవారి డేటా అంటే.. WhatsApp చాట్‌లో ముఖ్యమైన విషయాలు చర్చించడం నుంచి ఫోటోలు-వీడియోల వరకు అన్ని స్టోర్ అవుతాయి. ఆ సమయంలో పొరపాటున ఏదైనా సందేశం లేదా చాట్ పోయిందంటే.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు కూడా అనుకోకుండా ఏదైనా సందేశం లేదా చాట్‌ను తొలగిస్తే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ డేటాను తిరిగి పొందడానికి ఒక మార్గం కూడా ఉంది. 

WhatsApp చాట్‌ను ఎలా తిరిగి పొందాలంటే..

మీరు వినియోగించే ఆండ్రాయిడ్, యాపిల్ పరికరాలను బట్టి WhatsApp చాట్‌ను వివిధ మార్గాల్లో తిరిగి పొందవచ్చు. మీరు Android పరికరాన్ని ఉపయోగిస్తే.. Google Drive, iPhone వినియోగదారులు iCloud నుంచి బ్యాకప్ తీసుకోవడం ద్వారా పోయిన డేటాను పొందవచ్చు.

Continues below advertisement

Android వినియోగదారులు ఏమి చేయాలంటే (WhatsApp backup Android)

మొదట WhatsAppని ఓపెన్ చేసి.. సెట్టింగ్‌లకు వెళ్లి.. అక్కడ కనిపించే చాట్ ఎంపికపై నొక్కండి. ఆ తర్వాత చాట్ బ్యాకప్‌లో Google Driveని సెర్చ్ చేయండి. ఆ తర్వాత ఫోన్ నుంచి WhatsAppని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. WhatsAppని మళ్లీ ఇన్‌స్టాల్ చేసి.. నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు చాట్ పునరుద్ధరణ ఎంపిక అనే బటన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి. WhatsAppని అన్‌ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ అన్ని చాట్‌లను బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. మీరు బ్యాకప్ తీసుకోకపోతే అన్ని చాట్‌లు తిరిగి పొందలేరు.

iPhone వినియోగించేవారైతే..(WhatsApp backup iPhone)

iPhone వినియోగదారులు కూడా Android లాగానే చాట్‌ను తిరిగి పొందవచ్చు. దీని కోసం WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లి చాట్‌ను తెరవండి. ఇక్కడ iCloud బ్యాకప్‌ను తనిఖీ చేయండి. చాట్ బ్యాకప్ తీసుకోకపోతే.. ఈ పని చేయకండి. ఆ తర్వాత WhatsAppని అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేయాలి. నంబర్‌ను ధృవీకరించిన తర్వాత మీరు చాట్ హిస్టరీని పునరుద్ధరించుకోవచ్చు. 

మీరు కూడా డిలేట్ అయిన చాట్ తిరిగి రీస్టోర్ చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. అయితే ముందుగా బ్యాకప్ పెట్టుకుంటే ఫ్యూచర్​లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది.