Lionel Messi is Richest Athletes in the World : ఫుట్‌బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ ఇండియా టూర్లో ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండియాకి వచ్చారు. 2011లో మెస్సీ అర్జెంటీనా కెప్టెన్‌గా సాల్ట్ లేక్ స్టేడియంలో ఆడాడు. ఆ తర్వాత ఇండియాకి రావడం ఇదే మొదటిసారి కావడంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పర్యటించారు. ఇండియాలో ఆయన టూర్ (Football Legend Messi in India) డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15 వరకు ఉండగా.. ఆయన కోసం అనేక క్రీడా స్థాయి కార్యక్రమాలు చేపట్టారు.
ఫుట్‌బాల్ కింగ్ సంపాదన
లియోనెల్ మెస్సీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన అథ్లెట్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. నివేదికల ప్రకారం.. అతని నికర విలువ సుమారు $850 మిలియన్లు లేదా దాదాపు 7,700 కోట్లు. అతని ప్రధాన ఆదాయ వనరులలో ఫుట్‌బాల్ అగ్రిమెంట్స్, ఎండార్స్‌మెంట్‌లు, వివిధ వ్యాపారాలు ఉన్నాయి.
ఎండార్స్‌మెంట్‌లు, బ్రాండ్ డీల్స్
లియోనెల్ మెస్సీ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా సంవత్సరానికి సుమారు $70 మిలియన్లు సంపాదిస్తారని సమాచారం. అతను అడిడాస్‌తో బిలియన్ డాలర్లకు పైగా విలువైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాడు. Apple, Pepsi, Mastercard, Konami వంటి ప్రధాన గ్లోబల్ బ్రాండ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
విలాసవంతమైన ఆస్తులు, జీవనశైలి
లియోనెల్ మెస్సీ బార్సిలోనా, మియామి, అండోరా, లండన్లలో అనేక లగ్జరీ ప్రాపర్టీలను కలిగి ఉన్నాడు. అతని ఇబిజా ఇంటి విలువ సుమారు 100 కోట్లు. అతను తన దుస్తుల లైన్, "మెస్సీ స్టోర్"ను కూడా కలిగి ఉన్నాడు. వీటి మొత్తం విలువ $150–200 మిలియన్లు.
ప్రైవేట్ జెట్‌తో పాటు మరెన్నో
అతని విలాసవంతమైన జీవనశైలికి తగ్గట్లు.. లియోనెల్ మెస్సీ దాదాపు 100 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్నాడు. అలాగే హై-ఎండ్ కార్లు, లగ్జరీ హోటళ్ల సముదాయాన్ని కలిగి ఉన్నాడు. ఇవి ఫుట్‌బాల్ లెజెండ్ సంపదకు ప్రపంచ చిహ్నంగా అతని హోదాను మరింత పెంచుతుంది.