French Kiss with Braces : ఈ రోజుల్లో పళ్ల సమస్యలు చాలామందికి ఉంటున్నాయి. అలాగే కొందరు బ్యూటీ కోసం బ్రేసెస్ వేయించుకుంటారు. అలా బ్రేసెస్ పెట్టించుకున్నప్పుడు లిప్ కిస్ లేదా ఫ్రెంచ్ కిస్ చేయవచ్చా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. మరి దీనిగురించి నిపుణులు ఏమంటున్నారు. బ్రేసెస్ పెట్టుకుని కిస్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

బ్రేసెస్ పెట్టుకుని కిస్ చేయడం సేఫ్‌నా?

ఈ ప్రశ్నకు నిపుణులు ఇస్తోన్న సమాధానం అవును సేఫే. బ్రేసెస్ ఉన్నవాళ్లు కూడా సేఫ్‌గా కిస్ చేసుకోవచ్చట. ఇది ఆరోగ్యానికి హానికరం కాదు. కానీ కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరమని చెప్తున్నారు. ఎందుకంటే..

బ్రేసెస్ ఉన్నప్పుడు కిస్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పళ్లకు బ్రేసెస్ ఉన్నప్పుడు కిస్ నెమ్మదిగా చేసుకోవాలి. మెటల్ బ్రేసిస్ వేసుకున్నప్పుడు నాలుక తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి.. స్లోగా కిస్ చేసుకోవడం మంచిది. అలాగే కొత్తగా బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు పెదవులు, చెంప లోపల భాగం సెన్సిటివ్‌గా ఉంటుంది. అందుకే తొందరపడకుండా స్లోగా కిస్ చేయడం ముఖ్యం. అలాగే బ్రేసెస్‌లో వైర్లు లూజ్‌గా లేదా బయటకు వచ్చి ఉంటే గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అసౌకర్యంగా అనిపిస్తే ముందుగా డెంటిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

నొప్పి ఉన్న రోజుల్లో దూరంగా ఉండాలి. బ్రేసెస్ టైట్ చేసిన తర్వాత 1–2 రోజులు పళ్లలో నొప్పి ఉంటుంది. అప్పుడు కిస్ చేయడం ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగే బ్రేసెస్ ఉన్నప్పుడు నోటి శుభ్రత చాలా ముఖ్యం. ఆహారం ఇరుక్కుపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. నోటిలో పుండ్లు, ఇన్ఫెక్షన్, జలుబు ఉన్నప్పుడు కిస్ చేయకపోవడం మంచిది.

సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

సాధారణంగా ఎటువంటి పెద్దగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ జాగ్రత్తలు పాటించకపోతే ఈ సమస్యలు రావచ్చు. పెదవులకు, నాలుకకు చిన్న గాయాలు కావచ్చు. చెంప లోపల భాగం గుచ్చుకోవడం, నోటి ఇన్ఫెక్షన్ల రిస్క్ పెరగడం జరగవచ్చు. కానీ ఇవన్నీ చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి.

బ్రేసెస్ ఉన్నా లేకపోయినా కిస్‌లో కంఫర్ట్, అంగీకారం (Consent) కచ్చితంగా అవసరం. నెమ్మదిగా, ఇబ్బంది లేకుండా కిస్ చేసుకుంటే బ్రేసెస్ ప్రేమకు ఎలాంటి అడ్డంకి కాదు.