Organic Pomegranate Growing : మొక్కల్ని పెంచుకోవాలనుకుంటే అపార్ట్​మెంట్​లో కూడా పెంచుకోవచ్చు. ఇవి చాలామంది చేసేవే. ఇంటిదగ్గర ఆవరణలో లేదా టెర్రస్ గార్డెన్ అంటూ చాలామంది మొక్కలు పెంచుకుంటారు. ఇండోర్​లో కూడా మొక్కలు పెంచుకునేవారు ఉన్నారు. మరి దానిమ్మ వంటి మొక్కను ఇలాంటి ప్లేస్​లో పెంచుతారా అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. ఎందుకంటే దానిని భూమిలోనే వేస్తే బాగా పెరుగుతుందని అనుకుంటారు. కానీ మీకు తెలుసా? కుండీలో కూడా దానిమ్మను బాగా పెంచి.. ఫ్రూట్స్ పొందవచ్చని. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. 

దానిమ్మ పండ్లు మీరు ఇంట్లోనే పెంచుకోవాలనుకుంటే.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. స్మార్ట్​గా కొన్ని స్టెప్స్ ఫాలో అయితే దానిమ్మ మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు. ఇంట్లోనే దానిమ్మను ఎలా పెంచుకోవాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మొక్క పెరుగుదల బాగుంటుందో.. కుండీలో పెంచుకోవడం సాధ్యమో కాదో తెలుసుకుందాం. 

ఎలాంటి మొక్కను ఎంచుకోవాలంటే.. 

దానిమ్మను ఇంట్లో లేదా గార్డెన్​లో పెంచుకోవాలనుకుంటే మంచి బ్రీడ్​ని ఎంచుకోవాలి. పునికా గ్రానటం ఎల్ అనే దానిమ్మ సాగుకు మంచిదని చెప్తారు. బోన్సాయి రకాల్లో దానిమ్మను చెట్టును ఎంచుకుంటే కుండీలకు అవి పర్​ఫెక్ట్​గా ఉంటాయి. వాటిని పెంచుకోవడం కూడా మీకు సులభంగా ఉంటుంది. చిన్న ప్లేస్​ ఉండేవారికి ఇది బాగా కలిసివస్తుంది. 

కుండీ పెద్దదే ఉండాలి 

నార్మల్​గా ఇంట్లో పెంచుకునే మొక్కలకు చిన్న కుండీలు సరిపోతాయి. దానిమ్మ కోసం కాస్త పెద్దగా ఉండే కంటైనర్ ఎంచుకుంటే మంచిది. అలాగే డ్రైనేజ్ వెళ్లేందుకు ఖాళీ ఉండేలా చూసుకోండి. దీనివల్ల వేరు బాగా పెరుగుతుంది. ఓ కుండీలో పెంచిన తర్వాత మరో కుండీలో మొక్కను మార్చడాన్ని నిరోధించాలి. 

ఎరువు..

కుండీలో మట్టిని, కంపోస్ట్, సహజమైన ఎరువును ఉంచాలి. ఇది వేరును బలిష్టంగా ఉంచుతుంది. లేయర్ పద్ధతిలో కుండీలో మట్టిని వేయాలి. మధ్యలో ఎండిన ఆకులను వేసుకుని.. మళ్లీ ఎరువు, మట్టి వేసుకోవాలి. దీనివల్ల వేరు దృఢంగా పెరుగుతుంది. ఇప్పుడు దానిమ్మ మొక్కను ప్లేస్ చేయాలి. 

సన్​ లైట్

సూర్యరశ్మి మొక్కకు అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దానిమ్మ చెట్టు సూర్యరశ్మికి బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ కుండీని ఎండ వచ్చే ప్రదేశంలో ఉంచాలి. మొక్కకు ఎండ తగిలితే పండు సైజ్, స్వీట్​నెస్ పెరుగుతుంది. 6 నుంచి 8 గంటల సన్​లైట్ మొక్కపై పడేలా చూసుకుంటే మంచిది. 

ఎలా శ్రద్ధ తీసుకోవాలంటే.. 

రోజూ మొక్కకి నీరు పోయండి. ఎండిన ఆకులు, కొబ్బరి పీచు, ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్​ను వేసుకోవచ్చు. ఆవు పేడ, వంటింట్లోని కూరగాయల వ్యర్థాలు మొక్కకి వేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్క పెరుగుతున్నప్పుడు ఎండిన కొమ్మలుంటే కట్ చేసేయాలి. మొక్క పైభాగాన్ని ట్రిమ్ చేయడం వల్ల దానిమ్మ మొక్క ఏపుగా పెరుగుతుంది. 

పురుగులు రాకుండా.. 

దానిమ్మ చెట్టుకి పురుగులు సోకకుండా.. వేప నూనె స్ప్రే చేయవచ్చు. 5 మిల్లీ లీటర్ల వేప నూనెను లీటర్ నీటిలో వేసి బాగా కలిపి.. దానిని మొక్కకి స్ప్రే చేయాలి. బియ్యం కడిగిన నీటిని పులియబెట్టి కూడా మొక్కకు వేయొచ్చు. ఇది కూడా పురుగులు దరిచేరుకుండా చేస్తుంది. 

ఇదే విధంగా మీరు మొక్కని హెల్తీగా పెంచగలిగితే 5 లేదా 6 నెలలకు దానిమ్మలు రెడీ అయిపోతాయి. దానిమ్మ తొక్కను బట్టి మీరు వాటిని కట్​ చేసుకోవచ్చు. మరి ఇంకేం ఆలస్యం. ఇంట్లోనే ఇలా ఈజీగా దానిమ్మ మొక్కలను పెంచేసి.. జ్యూసీ దానిమ్మలను ఆస్వాదించేయండి.