Jamun Health Rrisks : నేరేడు పండు ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. నోటికి రుచిగా ఉండి.. హెల్త్​కి బెనిఫిట్స్ ఇచ్చే ఈ పండ్లు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఇస్తాయట. కొందరిలో గట్ సమస్యలు పెంచడంతో పాటు వివిధ దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుందని చెప్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? అధికంగా తింటే కలిగే నష్టాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement


జీర్ణ సమస్యలు 


నేరేడు పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. ఎక్కువగా తింటే సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావొచ్చు. ఎందుకంటే నేరేడు పండ్లలో ఫైబర్, టానిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తినడం వల్ల గట్ లైనింగ్ దెబ్బతిని కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి. 


చర్మ సమస్యలు


నేరేడు పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి స్కిన్ హెల్త్​కి మంచివి. అయితే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొందరికి పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి యాక్నే వంటి స్కిన్ సమస్యలను పెంచుతాయి. 


డయాబెటిస్


నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్​ని కంట్రోల్​లో ఉంచుతుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల బెనిఫిట్స్​ కాస్త సైడ్ ఎఫెక్ట్స్​గా మారుతాయట. కాబట్టి ఎక్కువగా తినడం కంట్రోల్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. 


బీపీ


జామున్ ఎక్కువగా తింటే హైపోటెన్షన్ పెరిగి.. బీపీ రాపిడ్​గా తగ్గిపోతుంది. ఇది కళ్లు తిరగడం వంటి సమస్యలను పెంచుతుంది. 


కిడ్నీ సమస్యలు


జామున్​లోని యాసిడ్స్ దంతాలపై ఉండే ఎనామిల్​ను క్షీణింపజేస్తాయి. నోటి శుభ్రత పాటించకపోతే దంత సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా నేరేడు పండ్లలోని ఆక్సలేట్.. కాల్షియంతో చర్య జరిపి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పడేలా చేస్తుంది. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


నేరేడు పండ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువ మోతాదులో అస్సలు తీసుకోకూడదు. అలాగే నేరేడు పండ్లు తిన్నవెంటనే నీటిని తాగకూడదు. అలాగే పాలు తాగే ముందు తర్వాత కూడా నేరేడు పండ్లు తినకూడదు. జామున్స్ తిన్న వెంటనే పచ్చళ్లు తినకపోవడమే మంచిది.


జామున్​ రోజులో ఒకటి లేదా రెండు సార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి. పండని వాటిని తినకపోవడమే మంచిది. లేదంటే అలెర్జీలు వస్తాయి. ప్రెగ్నెన్సీతో ఉండేవారు అస్సలు తినకూడదు. జామున్​లోని పోషకాలు శరీరానికి కావాలనుకుంటే డైట్​లో చేర్చుకుని తక్కువ మోతాదులో తీసుకోవాలి. 



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.