టీకి చాలా మంది ప్రియులు ఉన్నారు. బ్లాక్ టీ, మసాలా టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ ఇలా అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ఎక్కువగా లెమన్ టీ తాగుతారు. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఒక కప్పు లెమన్ టీ తాగితే ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటారు. కానీ అదే కప్పు లెమన్ టీ మీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుందనే విషయం మీకు తెలుసా?


లెమన్ టీ హానికరమా?


నిమ్మకాయ సహజంగానే ఆమ్లత్వం కలిగి ఉంటుంది. టీ కూడా అదే విధంగా ఆమ్లంగా ఉంటుంది. రెండు ఆమ్ల పదార్థాలు కలిస్తే అది మరింత ప్రభావవంతంగా మారుతుంది. అధిక ఆమ్ల కంటెంట్ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. లెమన్ టీ అధిక మొత్తంలో తీసుకుంటే పళ్ల మీద ఉండే ఏనామిల్ కోల్పోతారు. దంతాలు కూడా సెన్సిటివ్ గా మారతాయి. గుండెల్లో మంట, జీర్ణ అసౌకర్యానికి కారణమవుతుంది.


పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారు?


నిమ్మకాయలోని ఆక్సలెట్లు మూత్రపిండాల్లో రాళ్లకు దోహద పడతాయి. ఇందులోని కెఫీన్ నిద్రలేమి, హృదయ స్పందన రేటు అధికంగా మారడానికి తీస్తుంది. ఇందులోని విటమిన్ సి కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలర్జీ కూడా వచ్చే అవకాశం ఉంది.


జీర్ణ సమస్యలు


టీలో నిమ్మరసం కలవడం వల్ల దాని యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియని నెమ్మదించేలా చేస్తుంది. గుండెల్లో మంట, యాసిడ్ రీఫ్లక్స్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యని కలిగిస్తుంది.


డీహైడ్రేషన్


శరీరంలో ఆమ్ల స్థాయి పెరగడం వల్ల జీవక్రియ ప్రభావితం చేస్తుంది. శరీరంలోని నీటి స్థాయిలో అసమతుల్యత ఏర్పడుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. లెమన్ టీ తాగిన తర్వాత తలనొప్పి కూడా రావచ్చు.


నోటి ఆరోగ్యం


నిమ్మకాయలో ఉండే యాసిడ్ స్థాయి దంతాల మీద ఉండే ఏనామిల్ ని దెబ్బతీస్తుంది. టీ, నిమ్మకాయ కలపడం ద్వారా ఆమ్లత్వం పెరుగుతుంది. దంతాల నష్టానికి దారి తీస్తుంది. లెమన్ టీ తాగిన తర్వాత పళ్ళు తీవ్రమైన నొప్పి, సున్నితత్వం అనుభవించవచ్చు.


ఎముకలు బలహీనం


నిమ్మకాయ మూత్రం ద్వారా కాల్షియంని బయటకి పంపిస్తుంది. దీన్ని టీలో కలుపుకుని దాగినప్పుడు శరీరం గ్రహించలేని అల్యూమినియంని టీ గ్రహించేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిలని పెంచుతాయి. ఇది నేరుగా ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.


ఎన్ని కప్పులు తాగాలి?


లెమన్ టీ రోజుకి 1 లేదా 2 కప్పులకు పరిమితం చేయడం ఉత్తమం. అప్పుడే దీని వల్ల కలిగే ప్రయోజనాలను పొందుతారు. మీకు ఇప్పటికే దంతాల సున్నితత్వం ఉంటే మాత్రం దీన్ని నివారించడమే మంచిది. నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు తీసుకుంటే జీర్ణక్రియతో సంబంధం కలిగిన పిత్త దోషాల్ని పెంచుతుంది. లెమన్ టీ సాయంత్ర లేదా రాత్రి వేళ అసలు తీసుకోకూడదు. ఈ సమయంలో లెమన్ టీ తీసుకోవడం వల్ల శరీర సహజ సమతుల్యత దెబ్బతింటుంది. దీని ప్రభావం నిద్ర నాణ్యత మీద చూపుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ సుషీ తినాలనుకుంటే మీ నాలుగైదు నెలల జీతం పక్కన పెట్టుకోవాల్సిందే!