వర్షాకాలంలో ఎక్కువగా దొరికే చిరుతిండి మొక్కజొన్న. కాల్చుకుని లేదంటే ఉదకబెట్టుకుని ఉప్పు, కారం, మసాలా కొద్దిగా అద్దుకుని తింటుంటే సూపర్ గా ఉంటుంది. చల్లని సాయంత్రం వేళ ఇంతకుమించి అద్భుతమైన స్నాక్స్ ఇంకొకటి ఉండదు. మరి దీన్ని మధుమేహులు తినొచ్చా? ఇన్సులిన్ సెన్సిటివిటీతో బాధపడే వ్యక్తులు ఏది తినాలి, ఏది తినకూడదు అనే దాని గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయేలా చేస్తుంది. మొక్కజొన్న తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే..
తినే విధానం ముఖ్యం..
మొక్కజొన్నలు కనిపిస్తే తినకుండా అసలు ఆగలేరు. వీటిని ఉడికించుకుని తింటే మధుమేహులు కూడా ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. ఉడికించిన మొక్కజొన్న గ్లైసిమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. ఇది మనం తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది.
కార్బోహైడ్రేట్లు ఉన్నాయ్
మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ని కలిగి ఉంటాయి. అందుకే ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల మధుమేహం ఉన్న వ్యక్తులు వీటిని తీసుకునే పరిమాణం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సుమారు 10 గ్రాములు తింటే చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. ఒకవేళ అంతకుమించి ఎక్కువ తింటే మాత్రం అకస్మాత్తుగా లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.
మొక్కజొన్నలో డైటరీ ఫైబర్ మంచి మూలం. రక్తప్రవాహంలో కార్బోహైడ్రేట్ల శోషణని నెమ్మదించేలా చేస్తుంది. మెరుగైన ఇన్సులిన్ నిర్వహణకు సహాయపడుతుంది. మొక్కజొన్న గింజలు ప్రాసెస్ చేయని రూపంలో ఎంచుకోవడం ఉత్తమం.
మొక్కజొన్న తయారీ విధానం కేలరీలు పెంచడం తగ్గించడం, చక్కెర స్థాయిల్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్యాక్ చేసిన మొక్కజొన్న తినడం లేదా చీజ్, తియ్యటి మొక్క తింటే కేలరీలు పెరుగుతాయి. ఇది అధిక కార్బ్, కొవ్వు పదార్థాల కారణంగా చక్కెర స్థాయిలని పెంచుతాయి. వీటి కంటే కాల్చిన తాజా మొక్కజొన్న కోబ్స్ తినడం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా మొక్కజొన్న ముందుంటుంది. ఈ గింజల్లో థియామిన్, విటమిన్ బి6, ఇనుము, విటమిన్ ఎ, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలకు పెడితే చాలా మేలు. కరోనా వంటి మహమ్మారులను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని ఇవి అందిస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు కూడా స్వీట్ కార్న్ తినవచ్చు. ఆ సమస్యను అధిగమించేందుకు స్వీట్ కార్న్ సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు స్వీట్ కార్న్ ను మెనూలో చేర్చుకోవాలి. అయితే మితంగానే తినాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ 'Eris'- లక్షణాలు ఎలా ఉంటాయంటే?