Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ ఒక చిత్రం మాత్రమే, కానీ దాన్ని చేధించడానికి గంటలు గంటలు గడిపేవారు కూడా ఉన్నారు. అదొక అందమైన వ్యసనం. అందులోనూ మెదడుకు పదును పెట్టే అలవాటు. ఏకాగ్రతను, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక్కడ ఇచ్చింది ఒక జపనీస్ ఆర్టిస్టు క్రియేట్ చేశాడు. అది ఇప్పటిది కాదు. 1975లో దీన్ని షీగో ఫుకుడా అనే చిత్రకారుడు వేశాడు.ఇది జపాన్లో చాలా ఫేమస్ అయింది. ఈ చిత్రం ఒక పర్సనాలిటీ టెస్టును సూచిస్తుంది. ఈ చిత్రాన్ని బట్టి ఒక వ్యక్తి మంచి కమ్యూనికేటరో కాదో చెప్పేయచ్చు. అంటే ఆ వ్యక్తి ఎదుటివారితో తన భావాలను స్పష్టంగా చెప్పేయగల సామర్థ్యం ఉన్నవాడో కాదో తెలుసుకోవచ్చు. 


ఈ చిత్రాన్ని చూడగానే మీకు మొదట ఏది కనిపించిందో అదే గుర్తు పెట్టుకోండి. ఎక్కువసేపు చూస్తే మిగతా అంశాలే కనిపిస్తాయి. మొదట ఏం కనిపించిందో అదే ముఖ్యం. ఈ చిత్రంలో ఆడవారి కాళ్లు, మగవారి కాళ్లు రెండూ ఉన్నాయి. దీన్ని చూడగానే మహిళల కాళ్లు కనిపిస్తే మీరెలాంటి వారో, అదే మగవారి కాళ్లు కనిపిస్తే ఎలాంటి వారో చెప్పేయచ్చు. 


పురుషుల కాళ్లు కనిపిస్తే
 నల్లటి ప్యాంటు వేసుకుని నల్లటి షూ వేసుకున్న కాళ్లను మీరు మొదట గుర్తిస్తే అవి మగవారివి. అంటే మీరు ఎదుటివారితో బాగా కమ్యూనికేట్ చేసే వ్యక్తి.  మీ ఆలోచనలను, విషయాలను చాలా సులువుగా బయటపెట్టేస్తారు. అయితే మీలో విషయాల పట్ల సున్నితత్వం తక్కువ. మొండిగా ఉంటారు. భావోద్వేగాల లోతు మీకు తెలియదు. అందుకే అందరి విషయాలు, అన్ని అంశాలు బయటికి మాట్లాడేస్తూ ఉంటారు. 


మహిళ కాళ్లు కనిపిస్తే...
హైహీల్స్ వేసుకున్న తెల్లటి కాళ్లు మీకు గుర్తించనట్లయితే అవి మహిళలవి. వీటిని మొదట గమనించిన వ్యక్తులు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోరు. వీరు మాట్లాడేవి నిజాలకు విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకుని మాట్లాడాలి.


రెండూ ఒకేసారి కనిపిస్తే...
కొందరి కళ్లు, మెదడు ఆడవారి కాళ్లు, మగవారి కాళ్లు ఒకేసారి గుర్తిస్తాయి. అలాంటి వారు చాలా చమత్కారంగా మాట్లాడేవారని అర్థం. సాధారణంగా సాగుతున్న చర్చలను మీరు మరింత రసవత్తరంగా మారుస్తారు. జోకులు పేలుస్తారు. కానీ కొన్ని వ్యాఖ్యల ద్వారా ఇతరులను హర్ట్ చేసి మీరు ఇబ్బందుల్లో పడతారు. 


ఆప్టికల్ ఇల్యూషన్లు ఎప్పట్నించో ప్రపంచంలో తమ ఉనికిని చాటుతున్నాయి. వేల ఏళ్ల క్రితమే ఇవి ఉండేవని చెప్పే ఆధారాలు దొరికాయి. ఒకప్పుడు ఎలాంటి వినోద సాధనాలు లేని సమయంలో ప్రజలను ఉత్సాహపరచడం, వినోదాన్ని పంచడంలో ఇవి ముందుండేవని చెబుతారు చరిత్రకారులు. ఇప్పటికి ఇవి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇవి మెదడు, చూపు సమన్వయాన్ని పెంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే అప్పుడప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు చూడడం మంచిదే.


Also read: విటమిన్ డి లోపంతో ఆయుష్షు తగ్గిపోయే అవకాశం- పద్నాలుగేళ్ల పాటూ సాగిన అధ్యయన ఫలితం ఇదే