Good Friday and Easter Celebrations : ప్రతి సంవత్సరం మార్చి–ఏప్రిల్ నెలల్లో క్రిస్టియన్స్ లెంట్ డేలు చేస్తారు. దీనిని వారు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈస్టర్తో ముగిసే ఈ లెంట్ డేలలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి. బస్మ బుధవారం, మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటివి ఈ లెంట్ డేస్లలోనే చేస్తారు. ఏసు క్రీస్తు మరణాన్ని సూచించే ఫ్రైడే గుడ్ ఫ్రైడ్ ఎందుకు అయింది.. ఈస్టర్తో లెంట్ డేస్ ఎందుకు ముగుస్తాయి వంటి ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియవు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గుడ్ ఫ్రైడేలో
గుడ్ ఫ్రైడేలో గుడ్ అంటే ఆనందాన్ని సూచించదు. ఇది చాలామందికి తెలియక గుడ్ ఫ్రైడే అంటే మంచిదని అనుకుంటారు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అనేది యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజును గుర్తు చేసే రోజు. ఈ సమయంలో గుడ్ అంటే ఆధ్యాత్మికంగా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజు సెలబ్రేషన్స్ చేసుకోరు.
గుడ్ ఫ్రైడే రోజున చర్చిలలో గంటలు మోగించరు. పాటలు చాలా తక్కువగా పాడుకుంటారు. అలాగే చాలామంది ఉపవాసం ఉంటారు. యేసు క్రీస్తు తమ పాపాలను పోగొట్టడానికి శిలువపై ప్రాణాలు విడిచారనే సందేశాన్ని ఇస్తూ.. ప్రార్థనలు చేసుకుంటారు.
ఈస్టర్ తేదీ
కొన్ని పండుగలు ప్రతి ఏడాది ఒకే తేదీకి రావు. అలాగే ఈస్టర్ ప్రతి సంవత్సరం ఒకే తేదీకి రాదు. అందుకే ఈస్టర్ ఎప్పుడూ మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 మధ్య ఎప్పుడైనా రావచ్చు. అయితే లెంట్ డేస్ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఈస్టర్‌గా జరుపుకుంటారు. అందుకే ప్రతి ఏడాది తేదీ మారుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఈస్టర్ వచ్చింది. ఈస్టర్‌కు ముందు 40 రోజుల కాలాన్ని లెంట్ అంటారు.
ఈస్టర్ ఎగ్స్ అర్థం ఇదే..
ఈస్టర్ ఎగ్స్ చాలా ఫేమస్. కానీ ఎందుకు గుడ్లతో సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? గుడ్లు అనేవి కొత్త జీవితాన్ని సూచిస్తాయి. యేసుక్రీస్తు పునరుత్థానం, పునర్జన్మకు దీనిని సంకేతంగా భావిస్తారు. అందుకే ఈస్టర్ సందర్భంగా గుడ్లను అలంకరించి సెలబ్రేట్ చేసుకుంటారు.
ఈస్టర్ బన్నీ స్టోరీ..
ఈస్టర్ బన్నీ అసలు మతపరమైనది కాదు. ఇది జర్మన్ జానపద కథల నుంచి వచ్చింది. పిల్లలకు గుడ్లు తీసుకువచ్చే కుందేలు కథగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఇది ఈస్టర్‌లో ఫన్ సింబల్ అయింది.
లెంట్ సమయంలో చాలామంది తమకు ఇష్టమైన ఆహారాలు మానేస్తారు. ప్రార్థనల్లో పాల్గొంటారు. గుడ్ ఫ్రైడే శోకాన్ని సూచిస్తే.. ఈస్టర్‌లో ఆనందం, సంతోషం ఉంటుంది. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఆశ, కొత్త జీవితాన్ని సూచిస్తుంది. అందుకే ఈస్టర్ రోజు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు.
