డయాబెటిస్... ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండకపోవడమే డయాబెటిస్ వ్యాధి లక్షణం. ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండకపోతే ఆ ప్రభావం శరీరంలోని ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీ, కాలేయం, కళ్ళు, రక్తనాళాలు వంటి అవయవాలపై పడుతుంది. అలాగే నాడీ వ్యవస్థపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. నాడీ వ్యవస్థపై చూపే ప్రభావం మెదడుపై కూడా పడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉండకపోతే మెదడు పనితీరు మారిపోతుంది. జ్ఞాపకశక్తి క్షీణించి అల్జీమర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. 35 ఏళ్లకే ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న పిల్లల్లో వచ్చేది టైప్ 1 డయాబెటిస్, పెద్దవారిలో వచ్చేది టైప్ 2 డయాబెటిస్.
వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. 70 ఏళ్లకు పైగా వయసు దాటితేనే అల్జీమర్స్ ఇలా తీవ్రస్థాయిలో వస్తుంటుంది. అయితే డయాబెటిస్ వల్ల ఇంకా తక్కువ వయసులోనే అల్జీమర్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అల్జీమర్స్ వస్తే సొంత వారిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశంలో 60 ఏళ్ళు దాటిన వారిలో 60 లక్షల మందికి ఈ మతిమరుపు వ్యాధి ఉండొచ్చని అంచనా. డయాబెటిస్ అదుపులో ఉండకపోతే 50 ఏళ్లకే ఈ వ్యాధి దాడి చేయవచ్చు. క్రమంగా పెరుగుతూ 60 ఏళ్ళు వచ్చేసరికి పెద్ద జబ్బుగా మారి బయటపడుతుంది. విషయాలు మర్చిపోతూ ఉంటారు. సొంతవారని కూడా గుర్తుపట్టలేరు. ఇలా చిన్న వయసులోనే మతిమరుపు వ్యాధి రావడానికి కారణం మధుమేహం కూడా ఒక కారణమే.
మధుమేహం వల్ల మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది. కేవలం డయాబెటిస్ ఉన్న వారికే కాదు, ప్రీడయాబెటిస్ అంటే డయాబెటిస్‌కి ముందు దశలో ఉన్న వారికి కూడా మెదడు పనితీరులో మార్పులు వస్తున్నాయి. వారి విషయం సంగ్రహణా సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది కొన్నాళ్ళకు డిమెన్షియాకు దారితీస్తుంది. మధుమేహం లేని వారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారికి మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ కాలం పాటు డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో మతిమరుపుతోపాటు డిప్రెషన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోనూ గ్లూకోజ్ మోతాదులు పెరుగుతాయి. దీనివల్లనే మెదడుపై ప్రభావం పడుతుంది. గ్లూకోజ్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉండడం మంచిది కాదు. ఇది మొదటి పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ను పూర్తిగా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Also read: చల్లదనం కోసం ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా? మీ చర్మంపై ఈ మార్పులు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.