Protect Your Privacy : ఈ మధ్యకాలంలో ఒకరి పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడం, వీడియోలు తీసి వైరల్ అవ్వడానికి పోస్ట్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాము. అవి కొందరికి మేలు చేస్తే.. మరికొందరికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. పైగా డిజిటల్ యుగంలో ఒక్క వీడియో ఎప్పుడు.. ఎలా వైరల్ అవుతుందో.. ఎన్ని దేశాలకు రీచ్ అవుతుందో చెప్పలేము. అలాంటప్పుడు మీరు ఆ సోషల్ మీడియా నుంచి ఆ వీడియో డిలీట్ చేయడం సాధ్యమవుతుందో? లేదో.. ఇప్పుడు చూసేద్దాం.
సోషల్ మీడియాలో రీచ్ కోసం.. లేదా వైరల్ కంటెంట్ కోసం చూసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దానిలో భాగంగా తమ వీడియోలే కాకుండా.. తాము చూసిన వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. కొన్ని వీడియోలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టి నిమిషాల్లో వేలల్లో లైక్‌లు, వ్యూస్‌లు సంపాదిస్తున్నారు. తమ రీచ్ కోసం ఎదుటివారి పర్మిషన్ లేకుండా ఇలా పోస్ట్ చేయడం చట్ట రీత్యా నేరం. అయితే కొన్ని సందర్భాల్లో చట్టాన్ని ఆశ్రయించేందుకు కొందరు భయపడతారు. అలాంటివారికోసమే ఇది.
ఇన్‌స్టాలో ఇలా డిలీట్ చేసేయండి..
మీకు సంబంధించిన ఫోటో లేదా వీడియో ఇన్‌స్టాలో కనిపిస్తే దాని లింక్ కాపీ చేసుకుని.. httpps://help.instagram.com/contact/552695131608132 అనే వెబ్ సైట్ లింక్ ఓపెన్ చేయండి. దానిలో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ పూర్తి పేరు, డీటైల్స్ ఇచ్చి.. మీరు కాపీ చేసిన లింక్ పేస్ట్ చేయాలి. ఏ టైప్ కంటెంట్ ఫోటో లేదా వీడియో అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఎంటర్ కొడితే రెండు గంటల్లోపు ఆ పోస్ట్ డిలీట్ అయిపోతుంది. ఇది కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కి మాత్రమే.
ఇన్‌స్టా కాకుండా మరేదైనా ప్లాట్‌ఫామ్ అయితే..
మీకు సంబంధించిన ఫోటో లేదా వీడియో కేవలం ఇన్స్టాలోనే కాదు.. ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అయినా ఉండవచ్చు. అలాంటప్పుడు దానిని డిలీట్ చేసేందుకు stopncii.org వెబ్సైట్ ఓపెన్ చేసి.. క్రియేట్ యువర్ కేస్ మీద క్లిక్ చేయాలి. లీకైన మీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేయాలి. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్కడున్నా.. 24 గంటల్లోపు అన్నీ డిలీట్ అయిపోతాయి. ఎవరైనా దానిని డౌన్లోడ్ చేసుకుంటే తీయలేకపోవచ్చు కానీ.. ఏ సోషల్ మీడియాలో ఉన్నా సరే డిలీట్ చేయవచ్చు.
ఇతరుల కంటెంట్ పోస్ట్ చేసేముందు జాగ్రత్త ఎందుకంటే
మీకు సంబంధించిన వీడియోలు ఉంటే.. వాటిని డిలీట్ చేసేందుకు ఈ టెక్నిక్స్ వాడండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు జరగకుండా ఆపగలుగుతారు. ఇలాంటి వీడియోలు పూసలమ్మే మోనాలిసా లాంటి వాళ్లకి హెల్ప్ కావచ్చు. కానీ అందరకీ అలా మంచి జరగకపోవచ్చు. కాబట్టి మీరు ఎవరి వీడియోలు అయినా వారి పర్మిషన్ లేకుండా షేర్ చేసేముందు కచ్చితంగా ఆలోచించండి. ఎందుకంటే అవతలి వాళ్లు కేసు పెడితే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తించుకోండి.