Homemade Skin Care Tips for Holi : హోలీ 2024 (Holi 2024)రానే వచ్చింది. మరికొన్ని రోజుల్లో రంగులతో ఆడుకుంటాము. ఫ్రెండ్స్​తో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తాము. ఇంతకు వరకు బాగానే ఉంది. కానీ.. హోలీ సమయంలో చర్మానికి అంటుకునే రంగులు వదిలించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా కాంబినేషన్ స్కిన్ ఉన్నవారికి ఇది కాస్త సమస్యతో కూడుకున్నదనే చెప్పాలి. కొన్ని రోజుల వరకు ఈ రంగులు వారి చర్మంపై కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని మాస్క్​లతో ఈ రంగులను పోగొట్టుకోవచ్చు అంటున్నారు బ్యూటీ నిపుణులు. 


కాంబినేషన్ స్కిన్​ని హ్యాండిల్ చేయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే దానిని వదిలించుకోవడానికి సరైన పదార్థాలను ఉపయోగించాలి. లేదంటే రంగులు పోకపోవడంతో పాటు.. స్కిన్ అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడే మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే సహజమైన మాస్క్​లను ఎంచుకోవాలి. ఇవి రంగులను వదిలించడంతో పాటు.. మీ స్కిన్​ను కెమికల్స్​ నుంచి రక్షిస్తాయి. రంగులను వదిలించుకునే విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. లేదంటే సమస్య ఎక్కువైపోతుంది. 


రంగుల వల్ల చర్మానికి కలిగే నష్టాలు


హోలీ రంగులు చర్మాన్ని డీహైడ్రేట్ చేసేస్తాయి. చర్మం పొడిబారిపోతుంది. కొందరిలో ఎరుపు, వాపు లక్షణాలు కనిపిస్తాయి. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారికి ముక్కు జిడ్డుగా.. నుదురు, గడ్డం పొడిగా ఉంటుంది. అందువల్ల వారి చర్మం నుంచి రంగులను తొలగించడం కాస్త కష్టమవుతుంది. అందుకే చర్మాన్ని సమతుల్యం చేసే మాస్క్​లను ఎంచుకోవాలి. లేదంటే బ్లాక్​హెడ్స్, మొటిమలు, ఓపెన్ పోర్స్ వంటి సమస్యలు వస్తాయి. అయితే చర్మానికి ఎలాంటి మాస్క్​లు వేస్తే రంగు పోవడంతో పాటు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


క్లెన్సింగ్.. 


కలర్స్​ను వదిలించుకోవడానికి పాలను ఉపయోగించాలి. ఇవి మంచిగా చర్మాన్ని క్లెన్సింగ్ చేస్తాయి. మీ ముఖం మీద పాలతో మసాజ్ చేయండి. లేదంటే కాటన్ బాల్​ను పాలల్లో ముంచి.. చర్మంపై రుద్దండి. లేదంటే గ్లిజరిన్ కలిగిన సోప్​.. లేదంటే స్క్రబ్​లను కూడా ట్రై చేయవచ్చు. ఇవి ఓపెన్ పోర్స్​ను తగ్గించి.. బ్లాక్​హెడ్స్​ను కంట్రోల్ చేస్తాయి. రోజ్​వాటర్​ని టోనర్​గా ఉపయోగించవచ్చు. ముఖాన్ని క్లీన్​ చేసిన తర్వాత దీనిని ఉపయోగించాలి. 


ఓట్స్, గుడ్లు


ఓట్స్​ పౌడర్​లో.. గుడ్డు తెల్లసొనను మిక్స్ చేసి.. ముఖానికి అప్లై చేయండి. దానిని పావుగంట ఉంచి తర్వాత స్క్రబ్ చేయండి. సున్నితంగా స్క్రబ్ చేసి చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీనివల్ల రంగులు పోయి.. మీ చర్మానికి మంచి పోషణ అందుతుంది. 


కీరదోస, పాలు


ఓ గిన్నెలో పాలు, కీరదోసం రసం వేసి.. అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి. దీనిని ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో మాసాజ్ చేస్తూ.. శుభ్రం చేసుకోవాలి. రంగులను వదిలించడంతో పాటు.. చర్మానికి హైడ్రేషన్​ను అందించి.. పిగ్మెంటేనషన్​ను తగ్గిస్తాయి. 


మరిన్ని టిప్స్


గుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం మిక్స్ చేయాలి. కాస్త తేనెను వేసి కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే రంగులు సులువుగా పోతాయి. ఇవే కాకుండా మీరు ఫ్రూట్ మాస్క్​లు, ఓట్స్ మాస్క్​లు కూడా ట్రై చేయవచ్చు. మీరు స్కిన్​ని ఎలా శుభ్రం చేసుకున్నా.. తర్వాత చర్మానికి కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్​ డ్యామేజ్​ కాకుండా హెల్తీగా ఉంటుంది. 


Also Read : డ్రెస్​లు పాడవ్వకుండా.. హోలీ కలర్స్​ను వదిలించుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి